తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ashwin Retirement: విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉండింటే.. అశ్విన్ రిటైర్మెంట్ తీసుకునేవాడు కాదన్న మాజీ క్రికెటర్

Ashwin retirement: విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉండింటే.. అశ్విన్ రిటైర్మెంట్ తీసుకునేవాడు కాదన్న మాజీ క్రికెటర్

Galeti Rajendra HT Telugu

20 December 2024, 13:35 IST

google News
  • Ashwin retirement: ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ మధ్యలోనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కెప్టెన్‌గా కోహ్లీ ఉండి ఉంటే.. అశ్విన్ కచ్చితంగా ఆ నిర్ణయం తీసుకునేవాడు కాదని పాక్ మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు.

అశ్విన్, కోహ్లీ
అశ్విన్, కోహ్లీ (AFP)

అశ్విన్, కోహ్లీ

భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో.. అశ్విన్‌కి రెండో మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం లభించినా మూడో టెస్టులో వేటు పడింది. దాంతో మూడో టెస్టు ముగిసిన నిమిషాల వ్యవధిలోనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించేశాడు.

సిరీస్‌లో ఇంకా రెండు టెస్టులు

భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఆ తర్వాత ఆ తర్వాత జనవరి 3 నుంచి సిడ్నీలో ఐదో టెస్టు జరగనుంది. అయితే.. కీలకమైన ఈ రెండు టెస్టుల మంగిట అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.

అశ్విన్ అనూహ్య రిటైర్మెంట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిరీస్ ముగిసే వరకు ఎందుకు ఎదురు చూడలేదని కొందరు మాజీ ఆటగాళ్లు అతడ్ని ప్రశ్నిస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత అశ్విన్ వెంటనే జట్టును వీడి భారత్‌కు తిరిగొచ్చాడు. ఈ విషయంపై పాక్ మాజీ బ్యాట్స్ మన్ బాసిత్ అలీ మాట్లాడుతూ.. ఒకవేళ విరాట్ కోహ్లీ భారత్‌కు ఇప్పుడు కెప్టెన్‌గా ఉండి ఉంటే అశ్విన్‌ను ఇలా సిరీస్ మధ్యలో రిటైర్మెంట్‌ తీసుకోకుండా జాగ్రత్తపడేవాడని చెప్పుకొచ్చాడు.

కోహ్లీ కెప్టెన్‌గా ఉండింటే?

‘‘విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉండి ఉంటే అశ్విన్‌ను ఇలా సిరీస్ మధ్యలో రిటైర్మెంట్‌కు అస్సలు అనుమతించేవాడు కాదు. సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల తర్వాత రిటైర్మెంట్ ఇవ్వమని కోరేవాడు. ఎందుకంటే.. సిడ్నీ టెస్టులో అశ్విన్ అవసరం జట్టుకి ఉండొచ్చు’’ అని బాసిత్ అలీ అభిప్రాయపడ్డాడు.

‘‘టీమ్ఇండియా మాజీ కోచ్‌లు రాహుల్ ద్రావిడ్ లేదా రవిశాస్త్రిలో ఒక్కరు టీమ్‌ కోచింగ్ స్టాఫ్‌లో ఉన్నా అశ్విన్ రిటైర్మెంట్‌కి అనుమతించేవారు కాదు. కానీ.. ఆ పని ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లు చేయలేకపోయారు. సిడ్నీ టెస్టులో నీ అవసరం ఉందని అశ్విన్‌ను ఒప్పించలేకపోయారు’’ అని బాసిత్ అలీ చెప్పుకొచ్చాడు.

భారత్ తరఫున అనిల్ కుంబ్లే 619తో టాప్‌లో ఉండగా.. ఆ తర్వాత స్థానంలో అశ్విన్ 537 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.

తదుపరి వ్యాసం