తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs England Toss: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా మొదట బ్యాటింగ్.. టీమ్ ఇదే

India vs England Toss: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా మొదట బ్యాటింగ్.. టీమ్ ఇదే

Hari Prasad S HT Telugu

27 June 2024, 21:08 IST

google News
    • India vs England Toss: టీమిండియాతో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. ఈ మ్యాచ్ కు ఇండియన్ టీమ్ ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది.
టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా మొదట బ్యాటింగ్.. టీమ్ ఇదే
టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా మొదట బ్యాటింగ్.. టీమ్ ఇదే

టాస్ గెలిచిన ఇంగ్లండ్.. టీమిండియా మొదట బ్యాటింగ్.. టీమ్ ఇదే

India vs England Toss: టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో ఇండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ కీలకమైన మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గయానాలో వర్షం కారణంగా టాస్ సుమారు గంటన్నర ఆలస్యంగా పడింది. గురువారమే (జూన్ 27) జరిగిన మరో సెమీఫైనల్లో సౌతాఫ్రికా విజయం సాధించి ఫైనల్ చేరగా.. ఇప్పుడీ రెండు టీమ్స్ లో విజేతతో తలపడుతుంది.

టీమిండియా బ్యాటింగ్

వర్షం, ఆ తర్వాత మైదానం చిత్తడిగా ఉండటంతో ఇండియా, ఇంగ్లండ్ రెండో సెమీఫైనల్ టాస్ ఆలస్యమైంది. రెండుసార్లు గ్రౌండ్ ను పరిశీలించిన అంపైర్లు.. చివరికి మ్యాచ్ మొదలుపెట్టాలని నిర్ణయించారు. టాస్ గెలిచిన వెంటనే ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం పడటంతో మొదట బౌలింగ్ చేయడం కలిసి వస్తుందని భావిస్తున్నట్లు బట్లర్ చెప్పాడు.

ఇక ఎలాగూ టాస్ గెలిస్తే తాను బ్యాటింగ్ చేసేవాడినని రోహిత్ చెప్పడం విశేషం. మంచి స్కోరు సాధించాలని భావిస్తున్నామని, రాను రాను పిచ్ నెమ్మదిగా మారుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. ఈ సెమీఫైనల్ కు టీమిండియా ఎలాంటి మార్పుల్లేకుండానే బరిలోకి దిగుతోంది. మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవుతున్నా ఎలాంటి ఓవర్లు కుదించలేదు.

ఈ సెమీఫైనల్ కు రిజర్వ్ డే కేటాయించలేదు. దీంతో మ్యాచ్ జరగడానికి అదనపు సమయాన్ని ఇచ్చారు. ఒకవేళ మ్యాచ్ లో మరోసారి వర్షం కురిసి ఆట సాధ్యం కాకపోతే ఇండియా ఫైనల్ చేరుతుంది. ఈ రెండు టీమ్స్ చివరిసారి 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో తలపడగా.. ఆ మ్యాచ్ లో ఇంగ్లండ్ 10 వికెట్లతో గెలిచింది. దీంతో దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇప్పుడు టీమిండియా చూస్తోంది.

ఇండియా తుది జట్టు ఇదే

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా

ఇంగ్లండ్ తుది జట్టు ఇదే

జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ

తదుపరి వ్యాసం