తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Dhoni On 2019 World Cup Semis: వరల్డ్ కప్ సెమీఫైనల్ తర్వాత ధోనీ ఏడ్చాడా.. అతని మాటల్లోనే వినండి

Dhoni on 2019 world cup semis: వరల్డ్ కప్ సెమీఫైనల్ తర్వాత ధోనీ ఏడ్చాడా.. అతని మాటల్లోనే వినండి

Hari Prasad S HT Telugu

27 October 2023, 10:52 IST

google News
    • Dhoni on 2019 world cup semis: వరల్డ్ కప్ సెమీఫైనల్ తర్వాత ధోనీ ఏడ్చాడా? నాలుగేళ్ల తర్వాత దీనిపై ధోనీయే స్పందించాడు. ఓ ఈవెంట్లో పాల్గొన్న అతడు.. ఆ సెమీఫైనల్ ఓటమిపై మాట్లాడాడు.
ఎమ్మెస్ ధోనీ
ఎమ్మెస్ ధోనీ

ఎమ్మెస్ ధోనీ

Dhoni on 2019 world cup semis: ఇండియా 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓడిపోయిన విషయం తెలుసు కదా. న్యూజిలాండ్ తో జరిగిన ఆ మ్యాచ్ లో ధోనీ, జడేజా టీమ్ ను గెలిపించడానికి ఎంతో ప్రయత్నించి విఫలమయ్యాడు. ధోనీ రనౌట్ కావడం ఆ మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఈ ఓటమి తర్వాత ధోనీ కంటతడి పెడుతూ పెవిలియన్ కు వెళ్లినట్లు కనిపించింది.

నిజానికి టీమిండియాకు ధోనీ ఆడిన చివరి మ్యాచ్ కూడా అదే. ఆ మ్యాచ్ తర్వాత ధోనీ, ఇతర ప్లేయర్స్ చిన్న పిల్లల్లాగా ఏడ్చేశారని ఈ మధ్య మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ చెప్పాడు. ధర్మశాలలో న్యూజిలాండ్ ను ఇండియా ఓడించిన తర్వాత అతడు ఈ కామెంట్స్ చేశాడు. వీటిపై తాజాగా ఓ ఈవెంట్లో ధోనీ స్పందించడం విశేషం.

ఎమోషనల్ అయ్యాను: ధోనీ

సంజయ్ బంగార్ చేసిన ఈ కామెంట్స్ పై గురువారం (అక్టోబర్ 26) జరిగిన ఓ ఈవెంట్లో ధోనీ స్పందించాడు. చివరి వరకూ వచ్చి ఓ మ్యాచ్ ఓడిపోయినప్పుడు భావోద్వేగాలను అదుపు చేయడం చాలా కష్టమని అన్నాడు. "అలాంటి మ్యాచ్ లు ఓడిపోయినప్పుడు భావోద్వేగాలను అదుపు చేసుకోవడం కష్టం. ప్రతి మ్యాచ్ కు నేను నా ప్లాన్స్ సిద్ధం చేసుకుంటాను.

నా వరకూ ఇండియాకు నేను ఆడిన చివరి మ్యాచ్ అది. ఆ తర్వాతి ఏడాదే నేను క్రికెట్ నుంచి రిటైరయ్యాను. కానీ అప్పుడే ఆ విషయం నేను చెప్పలేకపోయాను. అంతకుముందు 12-15 ఏళ్ల పాటు క్రికెట్ ఆడటం మాత్రమే తెలుసు. కానీ అక్కడి నుంచి ఇక దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కదు. దీంతో ఆ సమయంలో సహజంగానే ఎమోషనల్ అయ్యాను" అని ధోనీ చెప్పాడు.

2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఓడిపోయిన తర్వాత ధోనీ మళ్లీ ఇండియన్ టీమ్ కు ఆడలేదు. వరల్డ్ కప్ తర్వాత కొంతకాలం వివిధ కారణాల వల్ల టీమ్ కు దూరంగా ఉన్న ధోనీ.. 2020, ఆగస్ట్ 15న రిటైర్మెంట్ ప్రకటించాడు. అదే రోజు మరో స్టార్ బ్యాటర్ సురేశ్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.

తదుపరి వ్యాసం