Riyan Parag Search history: సారుకు సారా హాట్ వీడియోలు కావాలట: క్రికెటర్ రియాన్ పరాగ్ యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ వైరల్
28 May 2024, 15:04 IST
- Riyan Parag Search history: రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ రియాన్ పరాగ్ మరోసారి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతని యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ అనుకోకుండా బయటపడటంతో అతన్ని నెటిజన్లు ఆటాడుకుంటున్నారు.
సారుకు సారా హాట్ వీడియోలు కావాలట: క్రికెటర్ రియాన్ పరాగ్ యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ వైరల్
Riyan Parag Search history: రియాన్ పరాగ్ ను గతేడాది ఐపీఎల్ వరకు క్రికెట్ అభిమానులు తిట్టిపోశారు. ఎక్స్‌ట్రాలు తప్ప ఆట తక్కువే అని అన్నారు. ఈ సీజన్లో మొత్తానికి అతడు తన సత్తా ఏంటో నిరూపించాడు. ఐపీఎల్ 2024లో రాయల్స్ తరఫున 573 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కానీ తనను మెచ్చుకునే లోపే మరోసారి తన యూట్యూబ్ సెర్చ్ హిస్టరీతో విమర్శల పాలవుతున్నాడు.
రియాన్ పరాగ్ యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ
అనన్య పాండే హాట్.. సారా అలీ ఖాన్ హాట్.. ఇదీ రియాన్ పరాగ్ యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ. ఇది అనుకోకుండా లీకైంది. సోమవారం (మే 27) నుంచి పరాగ్ మరోసారి తన గేమింగ్ సెషన్ల లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించాడు. ఈ సెషన్ లోనే అతని యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ బయటపడింది. ఈ సెషన్ కు వెళ్లిన వాళ్లు ఎవరో స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు.
ఈ లైవ్ స్ట్రీమింగ్ మొదలైన తర్వాత కాపీరైట్ లేని మ్యూజిక్ కోసం అతడు యూట్యూబ్ లో సెర్చ్ చేయడం మొదలు పెట్టాడు. అప్పుడే అతని పాత సెర్చ్ హిస్టరీ బయటపడింది. అందులో చూస్తే అన్నీ బూతు వీడియోల కోసం వెతికినట్లు కనిపించింది. బాలీవుడ్ హీరోయిన్లు అనన్య పాండే, సారా అలీ ఖాన్ ల హాట్ వీడియోల కోసం రియాన్ సెర్చ్ చేసినట్లు స్పష్టమవుతోంది.
రియాన్.. ఇదేం బుద్ధి?
ఈ స్క్రీన్ షాట్లు బయటకు వచ్చినప్పటి నుంచీ రియాన్ తో పలువురు ఆటాడుకుంటున్నారు. ఇదేం పాడు బుద్ధి.. అంతటి క్రికెటర్ అయి ఉండి.. ఇలా దారుణంగా హీరోయిన్ల హాట్ వీడియోల కోసం సెర్చ్ చేస్తావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఐపీఎల్లో బాగా ఆడావని మెచ్చుకునేలోపే ఇలా చేస్తావా అంటూ మరికొందరు క్లాస్ పీకారు.
అయితే కొందరు మాత్రం పరాగ్ కు మద్దతుగా నిలిచారు. అది అతని సెర్చ్ హిస్టరీ.. అతనిష్టం.. మీరు మీ సెర్చ్ హిస్టరీలను కూడా బయటపెట్టండి ఏముందో చూస్తామంటూ కామెంట్స్ చేశారు. ఇండియాలో చాలా మంది పెళ్లి కాని వాళ్లు ఈ సమ్మర్ లో ఇలా బనియన్ పై కూర్చొని యూట్యూబ్ లో ఇలాంటి హాట్ వీడియోలే వెతుకుతుంటారని పరాగ్ ను చూస్తే తెలుస్తోందని ఓ యూజర్ కామెంట్ చేయడం గమనార్హం.
రియాన్ పరాగ్ కు ఇలాంటి వివాదాలు కొత్త కాదు. గతేడాది ఐపీఎల్లో ఫీల్డ్ లో అతడు చేసిన అతి, బయట సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులతో తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఐపీఎల్ 2024లో మాత్రం రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు చేసి ఆ టీమ్ రెండో క్వాలిఫయర్ వరకు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఆ మ్యాచ్ లో మాత్రం సన్ రైజర్స్ పై కీలకమైన సమయంలో ఓ చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. దీనిపైనా విమర్శలు వచ్చాయి. ఎంత టాలెంట్ ఉండి ఏం లాభం అంటూ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ లైవ్ కామెంటరీలోనే అనడం విశేషం.