తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pollard Sixes: పొలార్డ్ వరుసగా నాలుగు సిక్స్‌లు.. అన్నీ వంద మీటర్లకుపైనే.. వీడియో వైరల్

Pollard Sixes: పొలార్డ్ వరుసగా నాలుగు సిక్స్‌లు.. అన్నీ వంద మీటర్లకుపైనే.. వీడియో వైరల్

Hari Prasad S HT Telugu

28 August 2023, 19:35 IST

    • Pollard Sixes: పొలార్డ్ వరుసగా నాలుగు సిక్స్‌లు బాదాడు. అవన్నీ వంద మీటర్లకుపైనే కావడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
కీరన్ పొలార్డ్
కీరన్ పొలార్డ్

కీరన్ పొలార్డ్

Pollard Sixes: వెస్టిండీస్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఓ యువ స్పిన్నర్ పై విరుచుకుపడ్డాడు. ఒకటి రెండు కాదు.. వరుసగా నాలుగు సిక్స్‌లు బాదాడు. పైగా అవన్నీ 100 మీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లడం విశేషం. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2023లో భాగంగా పొలార్డ్ ఈ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

RCB vs CSK : వర్షం వల్ల సీఎస్కే వర్సెస్​ ఆర్సీబీ మ్యాచ్​ జరగకపోతే.. ప్లేఆఫ్స్​ పరిస్థితేంటి?

ఆఫ్ఘనిస్థాన్ కు చెందిన యువ స్పిన్నర్ ఇజారుల్‌హక్ నవీద్ అతనికి బలయ్యాడు. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరఫున ఆడిన పొలార్డ్.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ పై చెలరేగిపోయాడు. ట్రిన్‌బాగో ఇన్నింగ్స్ 15వ ఓవర్లో పొలార్డ్ తన విశ్వరూపం చూపించాడు. 35 బంతుల్లో 58 పరుగులు అవసరమైన సమయంలో పొలార్డ్ ఇలా వరుసగా నాలుగు సిక్స్ లు కొట్టాడు.

పవర్ హిట్టింగ్ కు మారుపేరైన పొలార్డ్.. వరుసగా నాలుగు సిక్స్ లు వంద మీటర్లకుపైగా బాదడం విశేషం. అతని బాదుడు ధాటికి ట్రిన్‌బాగో టీమ్ మరో 17 బంతులు మిగిలి ఉండగానే 179 పరుగుల లక్ష్యాన్ని చేజ్ చేసింది. పొలార్డ్ 16 బంతుల్లో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. నవీద్ బౌలింగ్ లో నాలుగు సిక్స్ లను మిడ్ వికెట్ మీదుగానే పొలార్డ్ కొట్టాడు.

ఈ ప్రతి షాట్ లోనూ బంతి రూఫ్ టాప్ మీద పడింది. ఆఫ్ఘన్ టీమ్ తరఫున రషీద్ ఖాన్ తర్వాత ఆ స్థాయి స్పిన్నర్ అంటూ నవీద్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్న వేళ పొలార్డ్ అతని బౌలింగ్ ను ఇలా తుత్తునియలు చేయడం విశేషం. నవీద్ గతేడాది అండర్ 19 వరల్డ్ కప్ లోనూ ఆడాడు. బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడిన నవీద్.. ఐపీఎల్ వేలంలోనూ పాల్గొన్నా అతన్ని ఎవరూ కొనుగోలు చేయలేదు.

గతేడాది అంతర్జాతీయ క్రికెట్ తోపాటు ఐపీఎల్ కు కూడా గుడ్ బై చెప్పిన పొలార్డ్.. మిగతా లీగ్స్ లో మాత్రం కొనసాగుతున్నాడు. సీపీఎల్లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇదే మ్యాచ్ లో ఈ టీమ్ కు చెందిన సునీల్ నరైన్ క్రికెట్ లో రెడ్ కార్డ్ అందుకున్న తొలి ప్లేయర్ గా నిలిచాడు. నిర్ణీత సమయంలో ట్రిన్‌బాగో టీమ్ ఓవర్లు పూర్తి చేయలేకపోవడంతో అంపైర్ రెడ్ కార్డ్ చూపించాడు. దీని ప్రకారం ఓ ప్లేయర్ ను బయటకు పంపించాల్సి ఉండగా.. అప్పటికే ఓవర్ల కోటా పూర్తి చేసుకున్న నరైన్ ను పొలార్డ్ బయటకు పంపాడు.

తదుపరి వ్యాసం