Video: “ఐపీఎల్‍లో మోస్ట్ సక్సెస్‍ఫుల్ టీమ్ మాదే”: బ్రావో, పొలార్డ్ మధ్య సరదా వాదన ఎలా సాగిందంటే!-dwayne bravo vs kieron pollard engage in banter on most successful ipl team ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Dwayne Bravo Vs Kieron Pollard Engage In Banter On Most Successful Ipl Team

Video: “ఐపీఎల్‍లో మోస్ట్ సక్సెస్‍ఫుల్ టీమ్ మాదే”: బ్రావో, పొలార్డ్ మధ్య సరదా వాదన ఎలా సాగిందంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 02, 2023 03:26 PM IST

Dwayne Bravo vs Kieron Pollard: ఐపీఎల్‍లో మోస్ట్ సక్సెస్‍ఫుల్ టీమ్ మాదే అంటూ డ్వైన్ బ్రావో, కీరన్ పొలార్డ్ మధ్య వాదన సాగింది. ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్ బౌలింగ్ కోచ్‍గా బ్రావో, ముంబై ఇండియన్స్ టీమ్ బ్యాటింగ్ కోచ్‍గా పొలార్డ్ ఉన్నారు.

Video: “ఐపీఎల్‍లో మోస్ట్ సక్సెస్‍ఫుల్ టీమ్ మాదే”: బ్రావో, పోలార్డ్ మధ్య సరదా వాదన ఎలా సాగిందంటే! (Photo: Bravo/Instagram)
Video: “ఐపీఎల్‍లో మోస్ట్ సక్సెస్‍ఫుల్ టీమ్ మాదే”: బ్రావో, పోలార్డ్ మధ్య సరదా వాదన ఎలా సాగిందంటే! (Photo: Bravo/Instagram)

Dwayne Bravo vs Kieron Pollard: ఈ ఏడాది ఐపీఎల్ ఫైనల్‍లో గుజరాత్ టైటాన్స్ టీమ్‍ను ఓడించి ఎంఎస్ ధోనీ సారథ్యంలో 5వ టైటిల్‍ను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సొంతం చేసుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ (MI) అయిదు ఐపీఎల్ టైటిళ్ల రికార్డును సీఎస్‍కే సమం చేసింది. ఈ నేపథ్యంలో చెన్నై టీమ్ బౌలింగ్ కోచ్ డ్వైన్ బ్రావో, ముంబై జట్టు బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ సరదాగా వాదనకు దిగారు. గతంలో ఐపీఎల్‍లో ఆయా జట్లకు ప్లేయర్లుగానూ ఈ వెస్టిండీస్ ఆటగాళ్లు ఆడారు. ఐపీఎల్‍లో మోస్ట్ సక్సెస్‍ఫుల్ టీమ్ చెన్నై అని బ్రావో అంటే.. కాదు ముంబై అంటూ పొలార్డ్ వాదించాడు. ఈ వీడియోను ఇన్‍స్టాగ్రామ్‍లో బ్రావో షేర్ చేయగా.. వైరల్‍గా మారింది. ఆ ఇద్దరు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ల మధ్య వాదన ఎలా సాగిందంటే..

ట్రెండింగ్ వార్తలు

డ్వైన్ బ్రావో, పొలార్డ్ ఓ కారులో కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 5వ టైటిల్ సాధించడం ఎలా అనిపించిందని పొలార్డ్ అడుగగా.. చాలా సంతోషంగా ఉందని, ఐపీఎల్‍లో మోస్ట్ సక్సెస్‍ఫుల్ టీమ్‍గా చెన్నై నిలిచిందని బ్రావో అన్నాడు. దీనికి అభ్యంతరం చెప్పిన పొలార్డ్.. ముంబై కూడా ఐదు టైటిళ్లు గెలిచిందని, సీఎస్‍కే మోస్ట్ సక్సెస్‍ఫుల్ ఎలా అని అడిగాడు. అయితే, చెన్నై సూపర్ కింగ్.. రెండుసార్లు చాంపియన్స్ లీగ్ కూడా గెలిచిందని బ్రావో అన్నాడు.

“ఫ్రాంచైజీ క్రికెట్‍లో నాకు 17 ట్రోఫీలు ఉన్నాయి. మరి నీకు ఎన్ని ఉన్నాయి” అని బ్రావో ప్రశ్నించాడు. తాను లెక్క పెట్టుకోవడం లేదని పొలార్డ్ చెప్పాడు. ప్లేయర్‌గా మాత్రమే పొలార్డ్ టైటిళ్లు సాధించాడని, తాను కోచ్‍గానూ ట్రోఫీని గెలిచిన ఫీలింగ్ పొందానని బ్రావో టీజ్ చేశాడు. ఈ వీడియోను ఇన్‍స్టాగ్రామ్‍లో బ్రావో పోస్ట్ చేశాడు.

“ఎవరైనా ఈ వాదనను సెటిల్ చేయగలరా. ఐపీఎల్‍లో మోస్ట్ సక్సెస్‍ఫుల్ టీమ్ తమదే అని కీరన్ పొలార్డ్ నమ్ముతున్నాడు. అయితే చెన్నై మోస్ట్ సక్సెస్‍ఫుల్ ఐపీఎల్ టీమ్. ఇక ట్రోఫీల విషయానికి వస్తే నాకు 17 ఉన్నాయి. పొలార్డ్ ఇంకా 15 దగ్గరే ఉన్నాడు” అని వీడియోకు క్యాప్షన్ పెట్టాడు బ్రావో. పొలార్డ్, బ్రావో ఇద్దరూ ప్రపంచవ్యాప్తంగా చాలా లీగ్‍ల్లో ఆడారు.

ఐపీఎల్‍‍లో చెరో 5 టైటిళ్లు సాధించి చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ సమవుజ్జీలుగా ఉన్నాయి. దీంతో లీగ్ చరిత్రలో రెంటింట్లో ఏది మోస్ట్ సక్సెస్‍ఫుల్ ఐపీఎల్ టీమ్ అనేది చెప్పడం కష్టమే.

WhatsApp channel