తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Csk Vs Gt Toss Final Xi: చెన్నై సూపర్ కింగ్స్‌కు రిలీఫ్.. యంగ్ యార్కర్ స్టార్ పతిరణ సిద్ధం: తుది జట్లు ఇవే

CSK vs GT Toss Final XI: చెన్నై సూపర్ కింగ్స్‌కు రిలీఫ్.. యంగ్ యార్కర్ స్టార్ పతిరణ సిద్ధం: తుది జట్లు ఇవే

26 March 2024, 19:49 IST

google News
    • CSK vs GT IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు మొదలైంది. గాయం నుంచి కోలుకొని ఈ మ్యాచ్‍కు శ్రీలంక స్టార్ పేసర్ మతీష పతిరణ సిద్ధమయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా అతడు ఈ మ్యాచ్ ఆడే అవకాశం ఉందని టాస్ సమయంలో చెన్నై కెప్టెన్ రుతురాజ్ చెప్పాడు.
CSK vs GT IPL 2024
CSK vs GT IPL 2024 (AFP)

CSK vs GT IPL 2024

IPL 2024 CSK vs GT: ఐపీఎల్ 2024 సీజన్‍లో ఇప్పటికే బోణీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీకి దిగాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో నేడు (మార్చి 26) ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ శుభ్‍మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో ముందుగా సీఎస్‍కే బ్యాటింగ్‍కు దిగనుంది.

శ్రీలంక యంగ్ యార్కర్ స్టార్ మతీష పతిరణ ఆడేందుకు రెడీ అయినట్టు సీఎస్‍కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు. ఈ మ్యాచ్‍లో పతిరణ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బౌలింగ్ చేస్తాడని టాస్ సమయంలో గైక్వాడ్ సంకేతాలు ఇచ్చాడు. పతిరణ కోసమే తుది జట్టులో ఈ మ్యాచ్ కోసం ముగ్గురు విదేశీ ఆటగాళ్లనే సీఎస్‍కే తీసుకుంది. గాయం కారణంగా తొలి మ్యాచ్‍కు పతిరణ అందుబాటులో లేకుండా పోయాడు. అయితే, ఇప్పుడు అతడు రావటంతో డెత్ ఓవర్లలో చెన్నైకు బౌలింగ్ బలం పెరగనుంది. ఇది ఆ జట్టుకు బిగ్ రిలీఫ్‍గా మారే ఛాన్స్ ఉంది.

గత మ్యాచ్‍తో పోలిస్తే గుజరాత్ టైటాన్స్ తుది జట్టులో ఏ మార్పులు చేయలేదు. ఈ సీజన్‍తో తన తొలి మ్యాచ్‍లో ముంబై ఇండియన్స్ జట్టుపై గుజరాత్ విజయం సాధించింది. అయితే, ఆ మ్యాచ్ జరిగిన రెండు రోజులకే ఇప్పుడు చెన్నైతో తలపడుతోంది. అయితే, తమ జట్టుకు సరిపడా విశ్రాంతి దొరికిందని టాస్ సమయంలో గిల్ అన్నాడు. ఆ విషయంలో ఇబ్బంది లేదని టాస్ సమయంలో చెప్పాడు.

మహీష తీక్షణ స్థానంలో మతీష పతిరణ అందుబాటులోకి వచ్చాడని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ సమయంలో చెప్పాడు. మా మలింగ అంటూ పతిరణను పోల్చాడు.

చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వి, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‍పాండే, ముస్తాఫిజుర్ రహమాన్

చెన్నై ఇంపాక్ట్ సబ్‍స్టిట్యూట్ ఆప్షన్లు: మతీష పతిరణ, శార్దూల్ ఠాకూర్, షేక్ రషీద్, షేక్ రషీద్, నిషాంత్ సింధు, మిచెల్ సాంట్నర్

గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభ్‍మన్ గిల్ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్‌జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, ఆర్ సాయికిశోర్, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్

గుజరాత్ ఇంపాక్ట్ సబ్‍స్టిట్యూట్ ఆప్షన్లు: సాయిసుదర్శన్, సుశాంత్ బీఆర్, అభినవ్ మనోహర్, నూర్ అహ్మద్, మానవ్ సూతర్

ఐపీఎల్ 2024 సీజన్‍లో తమ తొలి మ్యాచ్‍లో మార్చి 22వ తేదీన చెన్నై టీమ్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుపై విజయం సాధించింది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టి బోణీ కొట్టింది. హోం గ్రౌండ్‍లో జరిగిన తొలి పోరుతో సీజన్‍కు శుభారంభం చేసింది. ఇక మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకొని.. ఆ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‍కు అప్పగించాడు.

తదుపరి వ్యాసం