తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Akhtar On India: శెభాష్ ఇండియా.. ఫిక్సింగ్ అంటున్న వాళ్ల బుర్ర పాడైంది.. వాళ్లను చూసి పాక్ నేర్చుకోవాలి: అక్తర్

Akhtar on India: శెభాష్ ఇండియా.. ఫిక్సింగ్ అంటున్న వాళ్ల బుర్ర పాడైంది.. వాళ్లను చూసి పాక్ నేర్చుకోవాలి: అక్తర్

Hari Prasad S HT Telugu

13 September 2023, 15:55 IST

    • Akhtar on India: శెభాష్ ఇండియా.. ఫిక్సింగ్ అంటున్న వాళ్ల బుర్ర పాడైంది.. వాళ్లను చూసి పాకిస్థాన్ నేర్చుకోవాలి అంటూ ఆ దేశ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ ఇండియన్ టీమ్ పై ప్రశంసలు కురిపించాడు.
షోయబ్ అక్తర్
షోయబ్ అక్తర్

షోయబ్ అక్తర్

Akhtar on India: ఆసియా కప్ 2023లో పాకిస్థాన్, శ్రీలంకను చిత్తుగా ఓడించిన ఇండియన్ క్రికెట్ టీమ్ పై ప్రశంసలు కురిపించాడు పాక్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్. ఇక పాకిస్థాన్ ను ఇంటికి పంపించడానికి కావాలనే శ్రీలంక చేతుల్లో ఓడిపోవడానికి ఇండియా మ్యాచ్ ఫిక్సింగ్ చేసిందన్న విమర్శలపై అతడు తీవ్రంగా స్పందించాడు.

ట్రెండింగ్ వార్తలు

RCB vs CSK : ధోనీ కోపం.. కోహ్లీ ఎమోషనల్​- ట్రెండింగ్​లో ‘డెఫినెట్లీ నాట్​’! క్రికెట్​ అంటే ఇదే..

Virat Kohli: అంపైర్‌తో గొడవకు దిగిన విరాట్ కోహ్లీ.. అలా చేయమంటూ ఒత్తిడి.. చివరికీ..!

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

శ్రీలంక చేతుల్లో ఇండియా ఓడిపోయి ఉంటే పాకిస్థాన్ ఫైనల్ ఆశలు అడుగంటేవి. ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంతో పాక్ అభిమానులు కొందరు సోషల్ మీడియాలో మ్యాచ్ ఫిక్సింగ్ విమర్శలు చేశారు. వీటిని అక్తర్ ఖండించాడు. "అసలు మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు.

ఇండియా మ్యాచ్ ఫిక్స్ చేసిందని నాకు మీమ్స్, మెసేజ్ లు వస్తున్నాయి. పాకిస్థాన్ ను ఇంటికి పంపించడానికి కావాలని ఓడిపోతున్నారని అంటున్నారు. అసలు మీకు బుర్ర పని చేస్తోందా? శ్రీలంక ఎంత బాగా బౌలింగ్ చేసింది. వెల్లలాగె, అసలంక అద్భుతంగా వేశారు. ఆ 20 ఏళ్ల యువకుడిని చూడండి.. 5 వికెట్లు తీశాడు, 43 రన్స్ చేశాడు" అని అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్లో అన్నాడు.

అదే సమయంలో ఇండియాపై అక్తర్ ప్రశంసల వర్షం కురిపించాడు. "వాళ్లు ఎందుకు ఓడిపోవాలని అనుకుంటారు చెప్పండి? వాళ్లు కూడా ఫైనల్ వెళ్లాలని అనుకుంటారు. ఎలాంటి కారణం లేకుండా మీమ్స్ చేస్తున్నారు. ఇండియా గొప్పగా పోరాడింది. కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బుమ్రాను చూడండి. వాళ్లు చిన్న టార్గెట్ కూడా డిఫెండ్ చేశారు" అని అక్తర్ చెప్పాడు.

ఇక ఇదే పోరాట స్ఫూర్తి లేని పాకిస్థాన్ పై విమర్శలు గుప్పించాడు. "20 ఏళ్ల వెల్లలాగె పోరాడాడు. బ్యాట్ తో, బాల్ తో ఫైట్ చేశాడు. పాకిస్థాన్ ప్లేయర్స్ ఇలా పోరాడలేకపోయారు. మా ఫాస్ట్ బౌలర్లు ఆడరు. వాళ్లు వరుసగా 25-30 వన్డేలు ఎక్కడ ఆడారు? షహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, నసీమ్ షాలాంటి వాళ్లు 10 ఓవర్లు వేసి గాయపడకుండా ఎలా ఉంటారు? పాకిస్థాన్ పోరాడాలని అనుకుంటున్నాను. ఇది చాలా అవమానకరంగా ఉంది" అని అక్తర్ స్పష్టం చేశాడు.

తదుపరి వ్యాసం