Akhtar on Pakistan: హమ్మయ్య.. వర్షం మమ్మల్ని బతికించింది: షోయబ్ అక్తర్ కామెంట్స్ వైరల్-akhtar says rain saved pakistan against india in asia cup super 4 match cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Akhtar On Pakistan: హమ్మయ్య.. వర్షం మమ్మల్ని బతికించింది: షోయబ్ అక్తర్ కామెంట్స్ వైరల్

Akhtar on Pakistan: హమ్మయ్య.. వర్షం మమ్మల్ని బతికించింది: షోయబ్ అక్తర్ కామెంట్స్ వైరల్

Hari Prasad S HT Telugu
Sep 11, 2023 10:15 AM IST

Akhtar on Pakistan: హమ్మయ్య.. వర్షం మమ్మల్ని బతికించింది అని పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండియాతో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్థాన్ డిఫెన్స్ లో పడిపోయింది.

వర్షం కారణంగా ఆగిపోయిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్
వర్షం కారణంగా ఆగిపోయిన ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ (AP)

Akhtar on Pakistan: పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇండియాతో జరుగుతున్న ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ లో వర్షమే పాకిస్థాన్ ను కాపాడిందని అతడు అనడం విశేషం. ఆదివారం (సెప్టెంబర్ 10) జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డే అయిన సోమవారానికి (సెప్టెంబర్ 11) వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ చూడటానికి కొలంబో వచ్చిన అక్తర్.. వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయిన తర్వాత తన సోషల్ మీడియా అకౌంట్లో మాట్లాడాడు. "ఈ మ్యాచ్ మళ్లీ మొదలవుతుందని నేను అనుకోవడం లేదు. కొలంబో వర్షం చాలా క్రేజీ. మ్యాచ్ చూడటానికి ఇక్కడికి వచ్చాను. ఫ్యాన్స్ అందరు కూడా వేచి చూస్తున్నారు. ఇండియన్స్, పాకిస్థానీలు కూడా.

కానీ చివరికి వర్షం మమ్మల్ని బతికించింది. ఇంతకుముందు ఇండియా మా దగ్గర ఇరుక్కుపోయింది. కానీ అప్పుడు వర్షం వాళ్లను కాపాడింది. ఈరోజు మేము ఇండియా దగ్గర ఇరుక్కుపోయాం. అదృష్టవశాత్తూ వర్షం మమ్మల్ని బతికించింది" అని అక్తర్ అన్నాడు.

అక్తర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. నిజానికి ఈ సూపర్ 4 మ్యాచ్ లో ఇండియా మొదట్లోనే పైచేయి సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలతో చెలరేగి తొలి వికెట్ కు 121 పరుగులు జోడించారు. తర్వాత ఈ ఇద్దరూ వెంటవెంటనే ఔటైనా.. రాహుల్, కోహ్లి క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వర్షం కురవడంతో ఆదివారం ఆట సాధ్యం కాలేదు.

ఒకవేళ మ్యాచ్ అలాగే కొనసాగి ఉంటే.. ఇండియా భారీ స్కోరు సాధించేదే. ఆదివారం 24.1 ఓవర్ల ఆట సాధ్యం కాగా.. ఇండియా 2 వికెట్లకు 147 రన్స్ చేసింది. నలుగురు పాకిస్థాన్ పేస్ బౌలర్లను ఇండియన్ బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కొన్నారు. ఇక స్పిన్నర్ షాదాబ్ ఖాన్ పై రోహిత్ ఎదురుదాడికి దిగడంతో అతడు మొదట్లోనే డిఫెన్స్ లో పడిపోయాడు.

Whats_app_banner