తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India: కొత్త హెడ్ కోచ్ గంభీర్ డిమాండ్‍కు బీసీసీఐ ఓకే.. టీమిండియా అసిస్టెంట్ కోచ్‍గా హైదరాబాదీ!

Team India: కొత్త హెడ్ కోచ్ గంభీర్ డిమాండ్‍కు బీసీసీఐ ఓకే.. టీమిండియా అసిస్టెంట్ కోచ్‍గా హైదరాబాదీ!

10 July 2024, 16:29 IST

google News
    • Team India Coach: టీమిండియా కొత్త హెడ్‍కోచ్‍గా గౌతమ్ గంభీర్ వచ్చేశాడు. దీంతో కోచింగ్ స్టాఫ్‍లోనూ మార్పులు రానున్నాయి. అసిస్టెంట్ కోచ్ విషయంలో గంభీర్ డిమాండ్‍కు బీసీసీఐ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో కోచ్‍గా అభిషేక్ నాయర్ రావడం దాదాపు ఖరారైనట్టు సమాచారం.
Team India: కొత్త హెడ్ కోచ్ గంభీర్ డిమాండ్‍కు బీసీసీఐ ఓకే.. టీమిండియా అసిస్టెంట్ కోచ్‍గా హైదరాబాదీ!
Team India: కొత్త హెడ్ కోచ్ గంభీర్ డిమాండ్‍కు బీసీసీఐ ఓకే.. టీమిండియా అసిస్టెంట్ కోచ్‍గా హైదరాబాదీ!

Team India: కొత్త హెడ్ కోచ్ గంభీర్ డిమాండ్‍కు బీసీసీఐ ఓకే.. టీమిండియా అసిస్టెంట్ కోచ్‍గా హైదరాబాదీ!

టీమిండియా కొత్త హెడ్ కోచ్‍గా మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నియమితుడయ్యాడు. గంభీరే ఎంపికవుతాడని కొంతకాలంగా అంచనాలు వెలువుతుండగా.. అదే జరిగింది. తాను హెడ్ కోచ్‍ బాధ్యతలను చేపట్టేందుకు బీసీసీఐకు గంభీర్ కొన్ని డిమాండ్లు చెప్పినట్టు సమాచారం. ముఖ్యంగా అసిస్టెంట్ కోచ్‍లుగా తాను అడిగిన వారినే ఇవ్వాలని కోరాడు. అందులో భాగంగానే భారత అసిస్టెంట్ కోచ్‍గా అభిషేక్ నాయర్‌ను నియమించాలని గంభీర్ అడుగగా.. ఇందుకు బీసీసీఐ ఓకే చెప్పిందనే సమాచారం వెల్లడైంది. ఐపీఎల్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టుకు గంభీర్, నాయర్ ఇద్దరూ కలిసి పని చేయగా.. ఇప్పుడు భారత జట్టు కోచింగ్‍లోనూ వీరి కాంబినేషన్ ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.

అభిషేక్ నాయర్ హైదరాబాద్‍లోనే పుట్టాడు. అయితే, తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ మొత్తం ముంబై జట్టు తరఫున ఆడాడు. ముంబై ప్లేయర్‌గానే కొనసాగాడు. భారత జట్టు తరఫున మూడు వన్డేలు ఆడాడు. కోచింగ్ సర్కిల్‍లో అభిషేక్ నాయర్‌కు మంచి పేరు ఉంది.

గంభీర్‌తో అనుబంధం

కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టుకు ఈ ఏడాది ఐపీఎల్‍ 2024లో గౌతమ్ గంభీర్ మెంటార్‌గా వ్యవహరించాడు. అప్పటికే ఆ టీమ్ బ్యాటింగ్ కోచ్‍గా అభిషేక్ నాయర్ ఉన్నాడు. అంతకు ముందు నుంచే ఇద్దరికీ మంచి రిలేషన్ ఉంది. ఈ ఏడాది ఐపీఎల్‍లో కోల్‍కతా అద్భుతమైన సక్సెస్ చూసింది. దూకుడైన ఆటతో టైటిల్ సాధించింది. ఈ ఎఫెక్ట్ వల్లే భారత హెడ్ కోచ్‍గా గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. ఇప్పుడు, అభిషేక్ నాయర్ కూడా అసిస్టెంట్ కోచ్‍గా వచ్చేయనున్నాడని క్రిక్ బజ్ రిపోర్ట్ వెల్లడించింది. అభిషేక్ నాయర్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మతోనూ మంచి అనుబంధం ఉంది.

హెచ్ కోచ్‍గా ఉన్న గౌతమ్ గంభీర్.. భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్‍గా కూడా ఉండాలని అనుకుంటున్నాడని తెలుస్తోంది. దీంతో అభిషేక్ నాయర్‌ను అసిస్టెంట్ కోచ్ హోదాతోనే తీసుకోనున్నారని అంచనాలు ఉన్నాయి. ఈ విషయంపై బీసీసీఐ త్వరలోనే ఈ విషయంపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఫీల్డింగ్ కోచ్ కొనసాగే ఛాన్స్

టీమిండియా హెడ్ కోచ్ స్థానం నుంచి దిగ్గజం రాహుల్ ద్రవిడ్ తప్పుకున్నారు. అలాగే, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ పదవీ కాలం కూడా ముగిసింది. అయితే, ఫీల్డింగ్ కోచ్‍గా దిలీప్‍ను పొడిగించాలని కొత్త హెడ్ కోచ్ గంభీర్ కోరుకుంటున్నట్టు తెలుస్తోంది.

విక్రమ్ రాథోడ్ స్థానంలో తానే బ్యాటింగ్ కోచ్‍గానూ ఉండాలని గంభీర్ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. బ్యాటింగ్ విభాగం కోసమే అభిషేక్ నాయర్‌ను అసిస్టెంట్ కోచ్‍గా తీసుకోవాలని గౌతీ డిసైడ్ అయ్యాడు.

టీమిండియా కొత్త బౌలింగ్ కోచ్‍గా మాజీ పేసర్లు జహీర్ ఖాన్, లక్ష్మీపతి బాలజీ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఒకరు ఈ స్థానంలో వచ్చే అవకాశం ఉంది. అయితే, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని సమాచారం.

ప్రస్తుతం జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడుతోంది టీమిండియా. తదుపరి శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. శ్రీలంకతో జూలై 27న మొదలుకానున్న టీ20 సిరీస్‍తోనే భారత హెడ్ కోచ్‍గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. అప్పటికల్లా అసిస్టెంట్ కోచ్‍ల నియామకం కూడా జరుగనుంది.

తదుపరి వ్యాసం