తెలుగు న్యూస్  /  career  /  Nit Warangal Recruitment 2024 : వరంగల్‌ నిట్ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు - 56 ఖాళీలు, ముఖ్య వివరాలివే

NIT Warangal Recruitment 2024 : వరంగల్‌ నిట్ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు - 56 ఖాళీలు, ముఖ్య వివరాలివే

04 December 2024, 9:03 IST

google News
    • NIT Warangal Recruitment 2024 : వరంగల్‌లోని నిట్(NIT) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. నాన్ - టీచింగ్ ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. మొత్తం 56 జాబ్స్ ఉన్నాయి. ఆన్ లైన్ దరఖాస్తులకు జనవరి 07, 2025వ  తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
వరంగల్ నిట్ లో ఉద్యోగాలు 2024
వరంగల్ నిట్ లో ఉద్యోగాలు 2024

వరంగల్ నిట్ లో ఉద్యోగాలు 2024

నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి వరంగల్‌లోని ‘నిట్’(NIT) ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. మొత్తం 56 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో అత్యధికంగా ఆఫీస్‌ అటెండెంట్, ల్యాబ్‌ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి. డైరెక్ట్‌, డిప్యూటేషన్‌ ప్రాతిపదికన ఈ పోస్టులను రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. https://nitw.ac.in/staffrecruit లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. కొన్ని పోస్టులకు అయితే రూ. 500గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు అయితే ఎలాంటి ఫీజు లేదు. గ్రూప్ ఏ, బీ, సీ కేటగిరీలుగా పోస్టులున్నాయి.

ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి. నవంబర్ 30వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు జనవరి 07, 2025వ తేదీతో పూర్తి అవుతుంది. రాత్రి 11.59 గంటల లోపు అప్లికేషన్ చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే recruit_admn@nitw.ac.in మెయిల్ చేయవచ్చు. ఇక సాంకేతిక సమస్యలు ఉంటే recruit@nitw.ac.in మెయిల్ ను సంప్రదించవచ్చు.

అర్హతలు చూస్తే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత ఉండాలి. 56 ఏళ్లు మించకూడదు. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ముఖ్య వివరాలు:

  • ఉద్యోగ ప్రకటన - నిట్ వరంగల్,
  • మొత్తం ఖాళీలు - 56
  • ఈ పోస్టులను డైరెక్ట్‌, డిప్యూటేషన్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
  • దరఖాస్తులకు చివరి తేదీ - జనవరి 07, 2025.
  • దరఖాస్తు ఫీజు - రూ. 1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
  • ఎంపిక విధానం - ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇందుకు సంబంధించి అధికారిక వెబ్ సైట్ లో వివరాలను అందుబాటులో ఉంచారు
  • అధికారిక వెబ్ సైట్ - https://nitw.ac.in/Careers/

ఖాళీల వివరాలు: గ్రూప్ ఏ

  • ప్రిన్సిపల్ సైంటిఫిక్‌ / టెక్నికల్‌ ఆఫీసర్‌ -3 ఖాళీలు ఉన్నాయి.
  • ప్రిన్సిపల్ స్టూడెంట్స్‌ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ - 1
  • డిప్యూటీ రిజిస్ట్రార్‌ - 01
  • ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ -1
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 01

గ్రూప్‌-బీ కేటగిరి ఖాళీలు:

  • అసిస్టెంట్ ఇంజినీర్‌ -3
  • సూపరింటెండెంట్ - 5
  • జూనియర్‌ ఇంజినీర్‌ -3
  • లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ -1
  • స్టూడెంట్స్‌ యాక్టివిటీ అండ్‌ స్పోర్ట్స్‌ అసిస్టెంట్ - 1

గ్రూప్‌-సి కేటగిరి ఖాళీలు:

  • సీనియర్‌ అసిస్టెంట్ - 8
  • జూనియర్‌ అసిస్టెంట్ -5
  • ఆఫీస్‌ అటెండెంట్ - 10
  • ల్యాబ్‌ అసిస్టెంట్ - 13

తదుపరి వ్యాసం