Sainik School Admission : సైనిక్ స్కూళ్లలో అడ్మిషన్ నోటిఫికేషన్ రాబోతోంది.. ఈ సర్టిఫికెట్స్ ఉన్నాయా?
11 December 2024, 9:51 IST
- Sainik School Admission 2025 : సైనిక్ స్కూళ్లలో అడ్మిషన్ కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అలాంటివారి కోసం త్వరలోనో నోటిఫికేషన్ రాబోతోంది. ఎన్టీఏ అధికారిక పోర్టల్‌లో 2025-26 సైనిక్ స్కూల్ అడ్మిషన్ ఆన్‌లైన్ అప్లికేషన్‌ను విడుదల చేయనుంది
సైనిక్ స్కూళ్లలో అడ్మిషన్స్
ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్(AISSEE 2025) అనేది భారతదేశం అంతటా ఉన్న సైనిక్ స్కూల్స్‌లో అడ్మిషన్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహించే ప్రవేశ పరీక్ష. సైనిక్ స్కూల్ అడ్మిషన్ ఆన్‌లైన్ అప్లికేషన్ 2025-26ని తన అధికారిక వెబ్‌సైట్ https://aissee.ntaonline.in/ లో ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. సైనిక్ స్కూల్‌లో 6వ తరగతి, 9వ తరగతిలో ప్రవేశం కోరుకునే విద్యార్థులు తప్పనిసరిగా AISSEE 2025లో ఉత్తీర్ణత సాధించాలి.
సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష 2025 జనవరిలో దేశవ్యాప్తంగా 33 సైనిక్ పాఠశాలల్లో 6వ, 9వ తరగతుల్లో ప్రవేశం కోసం ఎన్టీఏ నిర్వహిస్తుంది. 10 నుండి 12 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు ఎన్టీఏ సైనిక్ స్కూల్ అడ్మిషన్ 2025 కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 9వ తరగతికి విద్యార్థులు తప్పనిసరిగా 13 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో సైనిక్ స్కూల్ అడ్మిషన్ ఫారమ్ 2025-26 తేదీలను ప్రచురించడానికి సిద్ధంగా ఉంది. డిసెంబర్‌లోనే ఈ నోటిఫికేషన్ వస్తుంది. 5వ, 8వ తరగతుల్లో ఉన్న విద్యార్థులందరూ వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి.
ఆరో తరగతి పరీక్షలో 5వ తరగతి సిలబస్ (గణితం, మేధస్సు, భాష, సాధారణ జ్ఞానం) ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఇక 9వ తరగతి విషయానికొస్తే.. క్లాస్ 8 సిలబస్ (గణితం, ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్, సోషల్ సైన్స్) ఆధారంగా ప్రశ్నలు వేస్తారు. రెండు పరీక్షలు ఓఎంఆర్ ఆధారితమైనవి. షార్ట్‌లిస్ట్ అయిన విద్యార్థులు మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ చేయించుకోవాలి. శారీరక, మానసిక దృఢత్వాన్ని అంచనా వేస్తుంది. కొన్ని పాఠశాలలు వ్యక్తిత్వం, అనుకూలతను అంచనా వేయడానికి ఇంటర్వ్యూలను కూడా నిర్వహించవచ్చు.
అప్లికేషన్ ఎలా నింపాలి?
స్టెప్ 1 : https://aissee.ntaonline.in అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక సైట్‌కి వెళ్లండి.
స్టెప్ 2 : ప్రధాన పేజీలో AISSEE 2025 కోసం దరఖాస్తు ఫారమ్ అని లింక్‌ను కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
స్టెప్ 3 : 2025 కోసం సైనిక్ పాఠశాల దరఖాస్తు ఫారమ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అవసరమైన మొత్తం సమాచారాన్ని పూర్తి చేయండి.
స్టెప్ 4 : సైనిక్ స్కూల్ అప్లికేషన్ ఫారమ్ 2025 ఫీజు చెల్లింపును సమర్పించండి.
స్టెప్ 5 : దరఖాస్తు ఫారమ్ కోసం మొత్తం సమాచారం, ఫీజులను పూర్తి చేసిన తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 6 : చివరగా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడుతుంది.
జనరల్/ డిఫెన్స్ కేటగిరీ అభ్యర్థులు రూ.650, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.
సైనిక్ స్కూల్‌లో అడ్మిషన్ కోసం ప్రయత్నించే విద్యార్థులకు కొన్ని పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. ముందే వాటిని రెడీ చేసుకుంటే ఇబ్బందులు పడకుండా ఉంటారు. అవేంటంటే.. విద్యార్థి ఫోటో స్కాన్ చేసిన ఫొటోలు, విద్యార్థి సంతకం, ఎడమ చేతి బొటనవేలు ముద్ర, ఆధార్ కార్డ్ వంటి ID రుజువు, నివాస ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రం, బదిలీ సర్టిఫికెట్, సర్వీస్ సర్టిఫికెట్(మాజీ సైనికుల పిల్లలకు), కేటగిరీ సర్టిఫికెట్ (వర్తిస్తే), చెల్లింపులు చేయడానికి క్రెడిట్/డెబిట్ కార్డ్, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఉండాలి.