Sainik School entrance Results: సైనిక్ స్కూల్ 6,9వ తరగతి ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాల విడుదల;ఇలా చెక్ చేసుకోండి
సైనిక పాఠశాలల్లో 6వ తరగతిలో, 9వ తరగతిలో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ పరీక్షను ఎన్టీఏ నిర్వహించింది. ఈ పరీక్ష రాసిన విద్యార్థులు తమ ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in లో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి చూసుకోవచ్చు.
Sainik School entrance Results: ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE 2024) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం విడుదల చేసింది. అభ్యర్థులు, తల్లిదండ్రులు ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in లో తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి ఈ పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోవచ్చు
జనవరిలో పరీక్ష
దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూళ్లలో 6, 9 తరగతుల్లో ప్రవేశానికి జనవరి 28న ఆఫ్ లైన్ విధానంలో ఎన్టీఏ AISSEE 2024 ప్రవేశ పరీక్ష నిర్వహించింది. భారతదేశంలోని 185 నగరాల్లోని 450 పరీక్ష కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పరీక్ష అనంతరం ఫిబ్రవరి 25 నుంచి 27 వరకు ఆన్సర్ కీలు, ఓఎంఆర్ షీట్లు, అభ్యర్థుల రికార్డు చేసిన సమాధానాలను ఎన్టీఏ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. వాటిపై అభ్యంతరాలు తెలపాలని కోరారు. అలా వచ్చిన అభ్యంతరాలను నిపుణులు పరిశీలించారని, నిపుణులు ఖరారు చేసిన ఆన్సర్ కీల ప్రకారమే ఫలితాలను ప్రాసెస్ చేశామని ఎన్టీఏ తెలిపింది. ఫలితాలకు ముందు తుది ఆన్సర్ కీని విడుదల చేశారు.
ఇలా చెక్ చేసుకోండి..
- సైనిక్ స్కూల్స్ లో 6వ తరగతి, 9వ తరగతి లో ప్రవేశాల కోసం నిర్వహించిన AISSEE 2024 ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలను తెలుసుకోవడం కోసం ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.
- ముందుగా ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీలో కనిపిస్తున్న సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల లింక్ ను ఓపెన్ చేయండి.
- అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీతో లాగిన్ అయి ఫలితాన్ని చెక్ చేసుకోవచ్చు.
కౌన్సెలింగ్, సైనిక్ స్కూల్ అడ్మిషన్స్
ఈ AISSEE 2024 ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులు ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియలో తమ అర్హత ప్రమాణాలు, సెల్ఫ్ డిక్లరేషన్, ఇతర అవసరమైన డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఫలితాల ప్రకటన తర్వాత కౌన్సెలింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితర బాధ్యత తమకు లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. సైనిక్ స్కూళ్లు, న్యూ సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలు ఈ-కౌన్సెలింగ్ ద్వారా జరుగుతాయని, ఎంపికైన అభ్యర్థులు తదుపరి దశకు వెళ్లాలంటే pesa.ncog.gov.in/sainikschoolecounselling/ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన ఏవైనా సందేహాలను admission.sss@gov.in ఈమెయిల్ ఐడీకి పంపవచ్చని ఎన్టీఏ తెలిపింది.
సైనిక్ పాఠశాలల గురించి
సైనిక్ పాఠశాలలను (Sainik Schools) భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ సైనిక్ స్కూల్స్ సొసైటీ (SSS) నిర్వహిస్తుంది. ఇవి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)కి అనుబంధంగా ఉన్న ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ స్కూళ్లు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NTA), ఇండియన్ నేవల్ అకాడమీ, ఇతర ట్రైనింగ్ అకాడమీల్లో అధికారులుగా చేరడానికి సైనిక్ పాఠశాలలు క్యాడెట్లను సిద్ధం చేస్తాయి. ఈ పాఠశాలల్లో 6, 9 తరగతుల్లో ప్రవేశానికి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (AISSEE 2024)ను ఎన్టీఏ నిర్వహిస్తుంది.