sainik school jobs: కోరుకొండ సైనిక్ స్కూల్‌లో ఉద్యోగాలు.. ఆలస్యం ఎందుకు.. తొందరగా అప్లై చేయండి
sainik school jobs: కోరుకొండ సైనిక్ స్కూల్‌లో ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, వేతన వివరాలను అధికారులు వెల్లడించారు.
విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్‌లో వివిధ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రతి పోస్టుకు సంబంధించిన అర్హతలు, వేతన వివరాలు వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
టీజీటీ గణితశాస్త్రం:
ఈ పోస్టుకు సంబంధించి గణితశాస్త్రంలో కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్, బీఈడీ, టెట్/సీటెట్ పాస్ అయిన వారు అర్హులు. వేతనం రూ.52,533 ఉంటుంది. 21 నుంచి 35 సంవత్సరాల లోపు వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది అన్ రిజర్వ్ పోస్టు అని అధికారులు వెల్లడించారు.
మెడికల్ ఆఫీసర్:
మెడికల్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ డిగ్రీ పొంది ఉండాలి. మెడికల్ ఆఫీసర్‌కు రూ.74,552 వేతనం ఉంటుంది. 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు వారు ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది అన్ రిజర్వ్ పోస్టు.
నర్సింగ్ సిస్టర్:
ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సీనియర్ సెకండరీ పాస్, గ్రేడ్ ‘ఎ’ డిప్లొమా/సర్టిఫికెట్ ఇన్ నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ చదివి ఉండాలి. రూ.29,835 వేతనం ఉంటుంది. 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది అన్ రిజర్వ్ పోస్టు.
కౌన్సిలర్:
సైకాలజీ లో గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా చైల్డ్ డెవలప్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా కేరియర్ గైడెన్స్, కౌన్సిలింగ్ లో డిప్లొమా చేసిన వారు ఈ పోస్టుకు అర్హులు. వేతనం రూ.52,533 ఉంటుంది. 21 నుంచి 35 సంవత్సరాల లోపు వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది అన్ రిజర్వ్ పోస్టు.
పిటిఐ–కమ్ మేట్రన్ (స్త్రీ):
ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా డీపీఈడీ చేసిన అభ్యర్థులు దీనికి అర్హులు. వేతనం రూ.34,000 ఉంటుంది. 21 నుంచి 50 సంవత్సరాల లోపు వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది అన్ రిజర్వ్ పోస్టు.
క్రాఫ్ట్ అండ్ వర్క్‌షాప్ ఇన్‌స్ట్రక్టర్:
ఈ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. రెండు సంవత్సరాల ట్రేడ్ సర్టిఫికెట్, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బోధించగలగే సామర్థ్యం ఉండాలి. వేతనం రూ.34,164 ఉంటుంది. 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది అన్ రిజర్వ్ పోస్టు.
హార్స్ రైడింగ్ ఇన్‌స్ట్రక్టర్:
హార్స్ రైడింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా అనుభవం ఉండి.. ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు ఈ పోస్టుకు అర్హులు. వేతనం రూ.34,000 ఉంటుంది. 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఈ పోస్టుకు అర్హులు. ఈ పోస్టును ఓబీసీకి కేటాయించారు.
బ్యాండ్ మాస్టర్:
పొటెన్షియల్ బ్యాండ్ మాస్టర్, బ్యాండ్ మేజర్, డ్రమ్ మేజర్లు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. వేతనం రూ.34,000 ఉంటుంది. 21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఈ పోస్టుకు అర్హులు. ఇది అన్ రిజర్వ్ పోస్టు అని అధికారులు వెల్లడించారు.