తెలుగు న్యూస్  /  career  /  Icai Ca Final Results 2024: ఐసీఏఐ సీఏ ఫైనల్ ఫలితాలు వెల్లడయ్యే తేదీ ఇదే; ఇలా చెక్ చేసుకోండి..

ICAI CA Final results 2024: ఐసీఏఐ సీఏ ఫైనల్ ఫలితాలు వెల్లడయ్యే తేదీ ఇదే; ఇలా చెక్ చేసుకోండి..

Sudarshan V HT Telugu

18 December 2024, 19:24 IST

google News
    • ICAI CA Final results 2024: ఐసీఏఐ సీఏ నవంబర్ 2024 ఫలితాలను ప్రకటించే తేదీలు వెల్లడయ్యాయి. ఐసీఏఐ సీఏ ఫైనల్ ఫలితాలు డిసెంబర్ 26వ తేదీ నాటికి వెలువడనున్నాయి. ఫలితాలు వెలువడిన తరువాత అభ్యర్థులు ఏసీఏఐ అధికారిక వెబ్సైట్స్ icai.org, icai.nic.in లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.
ఐసీఏఐ సీఏ ఫైనల్ ఫలితాలు
ఐసీఏఐ సీఏ ఫైనల్ ఫలితాలు

ఐసీఏఐ సీఏ ఫైనల్ ఫలితాలు

ICAI CA Final results 2024: సీఏ, నవంబర్ పరీక్ష తుది ఫలితాలను డిసెంబర్ 26, 2024 నాటికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ప్రకటించనుంది. ఈ విషయాన్ని సిసిఎం ధీరజ్ ఖండేల్వాల్ తన ఎక్స్ హ్యాండిల్ లో తెలియజేశారు. ఐసీఏఐ అధికారిక వెబ్సైట్లు icai.org, లేదా icai.nic.in అభ్యర్థులు తమ స్కోర్లను చెక్ చేసుకోవచ్చు. డిసెంబర్ చివరి వారంలో ఐసీఏఐ ఫైనల్ ఫలితాలు వస్తాయని, డిసెంబర్ 26వ తేదీ సాయంత్రం వరకు సీఏ ఫైనల్ ఫలితాలు వెలువడే అవకాశం ఉందని ఖండేల్వాల్ పేర్కొన్నారు.

అప్లికేషన్ నంబర్, రోల్ నంబర్ తో..

సీఏ, నవంబర్ పరీక్ష ఫలితాలను (exam results) డౌన్ లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు లాగిన్ మాడ్యూల్ లో ఇచ్చిన స్థలంలో అప్లికేషన్ నంబర్, రోల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా, ఐసీఏఐ సీఏ నవంబర్ 2024 పరీక్ష (EXAM) గ్రూప్ 1కు నవంబర్ 3, 5, 7 తేదీల్లో, గ్రూప్ 2కు నవంబర్ 9, 11, 13, 14 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే అభ్యర్థులు ప్రతి విభాగంలో 40 శాతం, మొత్తంగా 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

ఐసీఏఐ సీఏ ఫైనల్ నవంబర్ ఫలితాలు 2024: ఎలా డౌన్లోడ్ చేయాలో చూడండి..

సీఏ ఫైనల్ నవంబర్ 2024 ఫలితాలను చెక్ చేయడానికి అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు:

  • ఫలితాలను ప్రకటించిన తరువాత, ముందుగా ఐసీఏఐ అధికారిక వెబ్సైట్ icai.nic.in ను ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో, సీఏ ఫైనల్ కోర్సు ఫలితాలను తనిఖీ చేయడం కోసం ఏర్పాటు చేసిన లింక్ పై క్లిక్ చేయండి.
  • మీ లాగిన్ క్రెడెన్షియల్స్ (రోల్ నంబర్, అప్లికేషన్ నంబర్) ఎంటర్ చేసి, సబ్మిట్ మీద క్లిక్ చేయండి.
  • మీ CA ఫైనల్ ఫలితాలు స్క్రీన్ పై ప్రదర్శించబడతాయి.
  • భవిష్యత్తు రిఫరెన్స్ కోసం డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ ఉంచండి.
  • ఐసీఏఐ సీఏ అప్డేట్స్ కోసం అభ్యర్థులు తరచుగా ఐసీఏఐ అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.

తదుపరి వ్యాసం