IAF Agniveervayu Recruitment : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్.. ఈ తేదీ నుంచి అప్లై చేయెుచ్చు
19 December 2024, 13:28 IST
- IAF Agniveervayu Recruitment : ఎయిర్ ఫోర్స్‌లో పని చేయాలనుకునే వారికి శుభవార్త. అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ వెలువడింది. జనవరి 7 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్
ఎయిర్‌ఫోర్స్‌లో చేరి దేశానికి సేవ చేయాలనుకునే యువతకు గుడ్‌న్యూస. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు (ఇంటాక్ 02/2026) రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ ప్రకారం ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ జనవరి 7, 2025 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు ప్రారంభమైన వెంటనే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ agnipathvayu.cdac.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్ ఫారమ్‌ను నింపాలి. దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి చివరి తేదీ 27 జనవరి 2025గా నిర్ణయించారు.
అర్హతలు
అగ్నివీర్ వాయు ఎంపిక పరీక్షకు అప్లై చేసుకునేవారు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ ఉండాలి. మొత్తంగా కనీసం యాభై శాతం మార్కులు, ఇంగ్లీషులో యాభై శాతం మార్కులు సాధించాలి. ప్రత్యామ్నాయంగా ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా సంబంధిత విభాగాల్లో రెండేళ్ల వృత్తి విద్యా కోర్సు చేసిన వారు కూడా అర్హులు. ఇతర సబ్జెక్టుల అభ్యర్థులు మొత్తంగా, ఆంగ్లంలో కూడా కనీసం యాభై శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
దీనితో పాటు అభ్యర్థి 1 జనవరి 2005- 1జులై 2008 మధ్య జన్మించి ఉండాలి. దరఖాస్తుదారులు తప్పనిసరిగా IAF ద్వారా పేర్కొన్న భౌతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అంటే ఇందులో ఎత్తు, ఛాతీ విస్తరణ, బరువు వంటి అంశాలు ఉంటాయి.
అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టుల (సైన్స్ లేదా ఇతర) ఆధారంగా ఆన్‌లైన్ పరీక్షకు హాజరవుతారు. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఫిజికల్ ఫిట్‌నెస్ అసెస్‌మెంట్ చేయించుకోవాలి. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు ఐఏఎఫ్ ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నారని వైద్య పరీక్ష చేయించాలి.
పురుషులు 152 సెం.మీ, మహిళలు 152 సెం.మీ ఉండాలి. ఈశాన్య రాష్ట్రాలవారికి, పర్వత ప్రాంతాలవారికి ఎత్తులో మినహాయింపు ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారు 147 సెం.మీ, లక్ష్యద్వీప్‌కు చెందినవారు 150 సెం.మీ ఎత్తు ఉండాలి.
జీతం వివరాలు
ఎంపికైన వారికి మెుదటి సంవత్సరం నెలకు రూ.30వేల జీతం ఉంటుంది. రెండో సంవత్సరం నెలకు రూ.33 వేలు, మూడో ఏడాది నెలకు రూ.36 వేలు, నాలుగో సంవత్సరం రూ.46 వేలు. అయితే ఇందులో చేతికి వచ్చేది వేరేలా ఉంటుంది. ఎందుకంటే అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు యాడ్ చేస్తారు. నాలుగేళ్ల తర్వాత బయటకు వచ్చేవారికి సేవానిధి ప్యాకేజీ కింద రూ.10.04 లక్షలు చెల్లిస్తారు.
ఎలా అప్లై చేయాలి?
అభ్యర్థులు దరఖాస్తులను నమోదు చేసుకోవడానికి అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ agnipathvayu.cdac.inను సందర్శించాలి.
అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయడం, దరఖాస్తు రుసుము చెల్లించడం వంటి ప్రక్రియ పూర్తి చేయాలి. ఆన్‌లైన్ మోడ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
ఇక్కడ ఉన్న అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ పీడీఎఫ్ చదవండి..
టాపిక్