IAF Agniveer Recruitment: భారత వాయుసేనలో అగ్నివీర్ ఎంపికలకు నోటిఫికేషన్ విడుదల
IAF Agniveer Recruitment: భారతీయ వాయుసేనలో అగ్నివీర్ ఎంపికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోండి.
IAF Agniveer Recruitment: అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు ఎంపికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపిక పరీక్షకు అవివాహితులైన భారతీయెలైన పురుషులు, మహిళా అభ్యర్థుల నుండి వాయుసేన ఆన్లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది.
అగ్నివీర్ నియామకాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 2024 జూలై 8వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. జూలై 28వ తేదీ రాత్రి 11 గంటల వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. 2024 అక్టోబర్ 18నుంచి ఎంపిక పరీక్షలు నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ల కోసం https://agnipathvayu.cdac.in కోసం సందర్శించాల్సి ఉంటుంది.
అగ్నివీర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే వారు 2004 జూలై 3 నుంచి 2008 జనవరి 3 మధ్యకాలంలో జన్మించాల్సి ఉంటుంది.
దరఖాస్తుదారులకు విద్యార్హతలు
(ఎ) సైన్స్ సబ్జెక్ట్స్ అభ్యర్థులు కోర్ సబ్జెక్టుల్లో సగటున కనీసం 50% మార్కులతో పాటు ఇంగ్లిష్ లో 50% మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుండి మేథమెటిక్స్, ఫిజిక్స్ మరియు ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్/ 10+2/ సరిసమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
దీంతో పాటు డిప్లొమా కోర్సు (డిప్లొమా కోర్సులో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా లేనట్లయితే ఇంటర్మీడియట్ / మెట్రిక్యులేషన్)లో ఇంగ్లిష్లో 50% మార్కులు మరియు అగ్రిగేట్లో 50% మార్కులతో కేంద్ర, రాష్ట్ర మరియు UTలతో గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుండి ఇంజినీరింగ్ విభాగాలైన మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఆటోమొబైల్ / కంప్యూటర్ సైన్స్ , ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాటజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలలో మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సు ఉత్తీర్ణత పొంది ఉండాలి.
ఒకేషనల్ కోర్సుల అభ్యర్థులకు వొకేషనల్ కోర్సులో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా లేనట్లయితే ఇంటర్మీడియట్ / మెట్రిక్యులేషన్)లో ఇంగ్లిష్లో 50% మార్కులు మరియు అగ్రిగేట్లో 50% మార్కులతో కేంద్ర, రాష్ట్ర మరియు UTచే గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుండి నాన్-ఒకేషనల్ సబ్జెక్ట్ అంటే ఫిజిక్స్ మరియు మేథమెటిక్స్ రెండు సంవత్సరాల వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణత పొంది ఉండాలి.
(బి) సైన్స్ సబ్జెక్టులు కాకుండా 50శాతం మార్కులతో కేంద్ర, రాష్ట్ర మరియు UTచే గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుండి ఏవేని స్ట్రీమ్ / సబ్జెక్టులలో ఇంటర్మీడియట్/ 10+2 / సరిసమాన పరీక్ష ఉతీర్ణత పొంది ఉండాలి.
వొకేషనల్ కోర్సులకు చెందిన విద్యార్ధులు వొకేషనల్ కోర్సులో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా లేనట్లయితే ఇంటర్మీడియట్ / మెట్రిక్యులేషన్)లో ఇంగ్లిష్ 50% మార్కులు మరియు అగ్రిగేట్లో కనీసం 50% మార్కులతో కేంద్ర, రాష్ట్ర మరియు UTచే గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుండి రెండు సంవత్సరాల వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణత పొందాలి.
ఇంటర్మీడియట్ / 10+2 / ఇంజినీరింగ్లో మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సు లేదా నాన్-వొకేషనల్ సబ్జెక్టులు అంటే ఫిజిక్స్ మరియు మ్యాథ్స్ రెండు సంవత్సరాల వొకేషనల్ కోర్సు సహా అర్హతగల అభ్యర్థులు సైన్స్ సబ్జెక్టులు కాని ఉద్యోగాలకు కూడా అర్హులవుతారు. సైన్స్ చదవని వారు అయా పోస్టులకు మాత్రమే అర్హత ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫారం పూరించే సమయంలో సైన్స్ సబ్జెక్టులు మరియు సైన్స్ సబ్జెక్టులు కాని వాటికి రెండింటిలో పరీక్షకు హాజరుకావడానికి ఆప్షన్ ఇస్తారు. అభ్యర్థులు వీటిని దృష్టిలో ఉంచుకుని ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ మరియు పరీక్ష ఫీజు:
అగ్నివీర్ వాయుసేన ఎంపికల కోసం రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.550/- ప్లస్ GST చెల్లించాల్సి ఉంటుంది. అగ్నివీర్ వాయు ఎంపికలు 02/2025 విద్యార్హతలు, వైద్య ప్రమాణాలు, నియమ నిబంధనలతో పాటు నోటిఫికేషన్ పూర్తి సమాచారం, ఆన్లైన్ దరఖాస్తులు పూరించడానికి సూచనలు, రిజిస్ట్రేషన్ కోసం https://agnipathvayu.cdac.in వెబ్‌సైట్ సందర్శించాల్సి ఉంటుంది.