తెలుగు న్యూస్  /  career  /  Ap Dsc Free Coaching 2024 : డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌ - ఉచితంగా కోచింగ్‌, ఇలా దరఖాస్తు చేసుకోండి

AP DSC Free Coaching 2024 : డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు గుడ్‌న్యూస్‌ - ఉచితంగా కోచింగ్‌, ఇలా దరఖాస్తు చేసుకోండి

HT Telugu Desk HT Telugu

28 November 2024, 16:16 IST

google News
    • AP DSC Free Coaching 2024 :మైనార్టీ అభ్యర్థులకు ఏపీ సర్కీర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉచితంగా డీఎస్సీ కోసం అందిచనుంది. ఈ మేరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. https://www.apcedmmwd.org/programs.php వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మైనార్టీ అభ్య‌ర్థుల‌కు డీఎస్సీ ఉచిత కోచింగ్‌
మైనార్టీ అభ్య‌ర్థుల‌కు డీఎస్సీ ఉచిత కోచింగ్‌

మైనార్టీ అభ్య‌ర్థుల‌కు డీఎస్సీ ఉచిత కోచింగ్‌

డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు రాష్ట్ర మైనార్టీ మంత్రిత్వ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. మెగా డీఎస్సీ రాసే మైనార్టీ అభ్య‌ర్థుల‌కు డీఎస్సీ ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకుంది. ఈమేర‌కు ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఉచిత కోచింగ్ కోసం అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మైనార్టీ అభ్య‌ర్థుల‌కు ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు ఇన్ట్సిట్యూట్స్ నుంచి కూడా ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. డిసెంబ‌ర్ 10 లోగా ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి…

మైనార్టీ అభ్య‌ర్థులైన ముస్లీం, క్రైస్త‌వులు (బీసీ-సీ), సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు త‌దిత‌రులకు ఉచిత కోచింగ్‌ను అందించనున్నారు. అప్లికేష‌న్ ఫాం అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని దాన్ని పూర్తి, చేసి ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేష‌న్ ఫారం కోసం అధికారి వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ file:///C:/Users/ADMIN/Downloads/42%20-%206746c866889dbDSC%20Application.pdf ను క్లిక్ చేయండి. అలాగే అప్లికేషన్ అప్లోడ్ చేయ‌డానికి అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ను https://www.apcedmmwd.org/submit-application.php ఉప‌యోగించుకోండి.

మరోవైపు అర్హత ఉన్న సంస్థ‌ల నుంచి కూడా ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. కోచింగ్ ఇచ్చే సంస్థ‌లు కూడా అప్లికేష‌న్ ఫామ్ ను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని దాన్ని పూర్తి చేసి ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆస‌క్తి గ‌ల సంస్థ‌లు అప్లికేష‌న్ ఫారం కోసం అధికారి వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ file:///C:/Users/ADMIN/Downloads/40%20-%206746c79d92b34Institute%20Eligibiliy%20Criteria%20-%2027.9.2024.pdf ను క్లిక్ చేయండి. అలాగే అప్లికేషన్ అప్లోడ్ చేయ‌డానికి అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ను https://www.apcedmmwd.org/submit-application.php ఉప‌యోగించుకోండి.

ఆఫ్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు ఇలా చేసుకోండి

ఆఫ్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకునేవారు. డైరెక్ట‌ర్ కార్యాల‌యం, మైనార్టీల విద్యాభివృద్ధి కేంద్రం, స్వాతి థియేట‌ర్ ఎదురు, భ‌వానీపురం, విజ‌య‌వాడ‌-520012కు డిసెంబ‌ర్ 10వ తేదీలోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇత‌ర స‌మాచారం కోసం 0866-2970567, ఈ-మెయిల్ ఐడీః cedmap2017@gmail.com ను సంప్ర‌దించ‌వ‌చ్చు. రాష్ట్రంలో మైనార్టీ అభ్య‌ర్థులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫ‌రూక్ కోరారు.

రాష్ట్రంలోని మైనార్టీల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్ర‌భుత్వం కార్యాచ‌ర‌ణ బ‌ద్ధంగా చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని తెలిపారు. గ‌తంలో ఇచ్చిన హామీ మేర‌కు డీఎస్సీ - 2024 ను కూట‌మి ప్ర‌భుత్వం నిర్వ‌హించ‌బోతుంద‌ని తెలిపారు. అందులో భాగంగానే డీఎస్సీకి హాజ‌ర‌య్యే మైనార్టీ వ‌ర్గాల‌కు చెందిన అభ్య‌ర్థుల‌కు ఉచిత శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ప్ర‌ముఖ ప్రైవేట్ సంస్థ‌ల‌తో ఎంప్యానెల్ చేయ‌డం ద్వారా ఉచిత శిక్ష‌ణ ఇస్తామ‌ని వెల్ల‌డించారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల‌తో డీఎస్సీకి నోటీఫికేష‌న్ ఇవ్వ‌నుంది. ఇందులో 6,371 ఎస్జీటీలు, 7,725 స్కూల్ అసిస్టెంట్లు, 1,781 టీజీటీలు, 286 పీజీటీలు, 52 ప్రిన్సిప‌ల్‌, 132 పీఈటీ పోస్టులు ఉన్నాయి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

తదుపరి వ్యాసం