తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Dsc 2008 Jobs: డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్..మరో 1399మందికి ఉద్యోగాలు, వారంలో పోస్టింగ్..

TG DSC 2008 Jobs: డీఎస్సీ-2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్..మరో 1399మందికి ఉద్యోగాలు, వారంలో పోస్టింగ్..

27 November 2024, 10:41 IST

google News
    • TG DSC 2008 Jobs:  తెలంగాణ డిఎస్సీ 2008 అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది మరో వారం రోజుల్లో మరికొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కనున్నాయి. డిఎస్సీ 2008లో అర్హత సాధించిన వారిలో 1399మందికి కాంట్రాక్టు పద్ధతిలో కొలువులు కల్పించనున్నారు. 
డిఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్టు ఉద్యోగాలు
డిఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్టు ఉద్యోగాలు

డిఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్టు ఉద్యోగాలు

TG DSC 2008 Jobs: తెలంగాణలో డిఎస్సీ 2008 అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటికే కొందరికి ఉద్యోగాలు దక్కగా మరికొందరికి మరో వారంలో కొలువులు దక్కనున్నాయి. డీఎస్సీ-2008లో పోస్టింగులు దక్కని వారికి కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల హామీ ఇచ్చారు. ఈ మేరకు అప్పట్లో నష్టపోయిన వారిలో 1399 మంది అభ్యర్థులకు మరోవారంలో ఉద్యోగాలు దక్కనున్నాయి.

డిఎస్సీ 2008 అర్హత పొందిన వారిలో ఉద్యోగాలు దక్కని వారి ధ్రువపత్రాలను గత నెలలోనే విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి కాంట్రాక్టు విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలిచ్చేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. మరో వారంలో వారికి అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు ఇస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా కాంట్రాక్టు ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లిస్తామని తెలిపారు.

మరోవైపు డీఎస్సీ-2024లో స్పోర్ట్స్‌ కోటాలో ఎంపిక ఉపాధ్యాయ నియా మకాలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ ముగిసింది. వారికి త్వరలోనే నియామక పత్రాలు అందచేయనున్నారు.

16ఏళ్లుగా ఎదురు చూపులు..

16ఏళ్ల క్రితం ఉద్యోగ నియామక పరీక్షల్లో కొలువు దక్కక నష్టపోయిన వారికి న‌్యాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన డీఎస్సీ- 2008లో నష్టపో యిన వారిని కాంట్రాక్టు విధానంలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయాన్ని వెలువరించింది.

ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 2367 మంది ప్రయోజనం పొందుతారని అంచనా వేశారు. ప్రధానంగా నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక పోస్టులు రానున్నాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో 2008 డిఎస్సీ బాధిత అభ్యర్థులున్నారని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఉమ్మడి పీలో 2008లో డీఎస్సీ నిర్వహించినపుడు 30 శాతం ఎస్జీటీ పోస్టులను ప్రత్యేకంగా డీఈడీ పూర్తి చేసినవారికి ప్రభుత్వం కేటాయించింది. దీంతో మార్కుల ద్వారా ముందున్నా బీఈడీ అభ్యర్థులు చివరి నిమిషంలో ప్రభుత్వం 30శాతం డిఇడి విద్యార్ధులకు కోటా ఇవ్వడంతో నష్టపోయారు. ప్రభుత్వ నిర్ణయంతో తమకు అన్యాయం జరిగిందని, తమకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటూ నాటి నుంచి వారు పోరాటం చేస్తున్నారు.

కాంగ్రెస్ ఎన్నికల హామీ…

న్యాయస్థానాల్లో కూడా బాధితులకు న్యాయం చేయాలని తీర్పునిచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో 2008లో పోస్టింగ్ దక్కని వారికి న్యాయం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. తాజాగా వారికి కాంట్రాక్టు విధానంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ ఉద్యోగాలు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. వీరికి వేతనంగా నెలకు రూ.31,030 చొప్పున చెల్లిస్తారు.ఉమ్మడి జిల్లాల ప్రకారం ఈ నియామకాలను చేపడతారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టో బరు 5వ తేదీ వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల వెరిఫికేషన్‌ చేపట్టారు.

తదుపరి వ్యాసం