JNTU Anantapur: జేఎన్‌టీయూ నుంచి పీహెచ్‌డీ నోటీఫికేష‌న్.. సెప్టెంబర్ 4 వరకే గడువు-phd notification released from anantapur jawaharlal nehru technological university ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jntu Anantapur: జేఎన్‌టీయూ నుంచి పీహెచ్‌డీ నోటీఫికేష‌న్.. సెప్టెంబర్ 4 వరకే గడువు

JNTU Anantapur: జేఎన్‌టీయూ నుంచి పీహెచ్‌డీ నోటీఫికేష‌న్.. సెప్టెంబర్ 4 వరకే గడువు

HT Telugu Desk HT Telugu
Aug 24, 2024 02:46 PM IST

JNTU Anantapur: అనంత‌పురంలోని జ‌వ‌హ‌ర్‌ లాల్ నెహ్రూ టెక్నాల‌జీక‌ల్ యూనివ‌ర్శిటీ (జేఎన్‌టీయూ-ఏ) పీహెచ్‌డీ నోటీఫికేష‌న్ విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు సెప్టెంబ‌ర్ 4న వరకు అవకాశం ఇచ్చింది. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవాలని సూచించింది.

జేఎన్‌టీయూ నుంచి పీహెచ్‌డీ నోటీఫికేష‌న్
జేఎన్‌టీయూ నుంచి పీహెచ్‌డీ నోటీఫికేష‌న్ (JNTU Anantapur)

పార్ట్‌ టైం, ఫుల్‌ టైం కేట‌గిరీల్లో పీహెచ్‌డీ చేసేందుకు జేఎన్‌టీయూ-ఏ ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేంద్ర‌, రాష్ట్ర సంస్థ‌ల్లో ప‌ని చేసేవారు, ఆర్ అండ్‌ డీ సంస్థ‌ల్లో ప‌ని చేసే సైంటిస్టులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి ప‌ద‌వుల్లో ఉండే వారు అర్హులని నోటిఫికేషన్‌లో స్పష్టంచేసింది. పీహెచ్‌డీలో చేరిన వారు ఏడాదికి ట్యూష‌న్ ఫీజు రూ.80 వేలు చెల్లించాల్సి ఉంటుందిని వివరించింది.

మాస్ట‌ర్ డిగ్రీలో క‌నీసం 55 శాతం మార్కులు, 6.0 సీజీపీఏ సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వర్సిటీ అధికారులు వివరించారు. ఇంజ‌నీరింగ్‌లో సివిల్‌, ఎల‌క్ట్రిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్స్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రానిక్ అండ్ క‌మ్యూనికేషన్స్‌, కంప్యూట‌ర్ సైన్స్‌, కెమిక‌ల్ ఇంజినీరింగ్, జనరల్ సైన్స్ స‌బ్జెట్స్‌లో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్.. అలాగే మేనేజ్‌మెంట్‌, ఫార్మా, ఇంగ్లీష్‌, ఫుడ్ టెక్నాల‌జీ విభాగాల్లో పీహెచ్‌డీ చేయ‌డానికి అవ‌కాశం ఉన్నట్టు వెల్లడించారు. జేఎన్‌టీయూ -ఏ అనుబంధ కాలేజీలే కాకుండా గుర్తించిన 12 రీసెర్చ్ సెంట‌ర్ల‌లోనూ పీహెచ్‌డీని చేయొచ్చని స్పష్టం చేశారు.

అప్లికేష‌న్ ఫీజు రూ.5 వేలు..

దీని అప్లికేష‌న్ ఫీజు రూ.5 వేలు ఉంటుంది. ఈ ఫీజును.. ది రిజిస్ట్రార్, జేఎన్‌టీ యూనివ‌ర్శిటీ అనంత‌పుర పేరుతో డీడీ తీయాలి. ఈ డీడీకి సంబంధిత స‌ర్టిఫికేట్లు జ‌త చేసి ద‌ర‌ఖాస్తు చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తులను సెప్టెంబ‌ర్ 4లోగా డైరెక్ట‌ర్ ఆఫ్ అడ్మిష‌న్స్‌, జేఎన్‌టీయూకు చేరేలా పోస్టు చేయాలి. త‌ప్పుడు స‌మాచారం ఇస్తే అడ్మిష‌న్ ర‌ద్దు అవుతుంది. పూర్తి వివ‌రాలకు యూనివ‌ర్శిటీ అధికారిక వెబ్‌సైట్ https://www.jntua.ac.in/ph-d-ft-pt-admissions-for-executives-from-industry-research-professionals-public-representatives-2024-25/ సంప్ర‌దించవచ్చు. అలాగే అప్లికేష‌న్ అధికారిక వెబ్‌సైట్ https://www.jntua.ac.in/wp-content/uploads/2024/08/1-Application-proforma.pdf ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

అప్లికేష‌న్‌కు జ‌త చేయాల్సిన స‌ర్టిఫికేట్‌లు..

1. ఎంటెక్‌, ఎంఈ స‌ర్టిఫికేట్‌

2. ఎంటెక్‌, ఎంఈ మార్కుల జాబితా

3. బీటెక్‌, బీఈ స‌ర్టిఫికేట్‌

4. బీటెక్‌, బీఈ మార్కుల జాబితా

5. ప‌దో త‌ర‌గ‌తి మార్కుల జాబితా

6. ఇత‌ర స‌ర్టిఫికేట్లు

( రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌రరావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ప్రతినిధి )