Annamayya Jobs : అన్నమయ్య జిల్లాలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్-డిసెంబర్ 13 ఆఖరు తేదీ
03 December 2024, 17:16 IST
Annamayya Jobs : అన్నమయ్య జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ, సాధికారక అధికారి ఆఫీసులో 17 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, పార్ట్‌టైం ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు డిసెంబర్ 13 ఆఖరు తేదీగా నిర్ణయించారు.
అన్నమయ్య జిల్లాలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్-డిసెంబర్ 13 ఆఖరు తేదీ
అన్నమయ్య జిల్లా పరిధిలో మహిళా, శిశు సంక్షేమ, సాధికారక అధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, పార్ట్‌టైం ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు డిసెంబర్ 13 ఆఖరు తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గల వారు నిర్ణీత సమయంలో దరఖాస్తు దాఖలు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి కోరారు.
అన్నమయ్య జిల్లాలోని మహిళ, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని మదనపల్లె, రాజంపేట, లక్కిరెడ్డిపల్లెలో ఖాళీగా ఉన్న 17 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానించారు. ఈ పోస్టులను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, పార్ట్‌టైం పద్దతిలో భర్తీ చేస్తారు. పనితీరు ఆధారంగా వారి సర్వీసును కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇందులో అర్హులైన స్థానిక అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకం జరుపుతారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, దరఖాస్తు ఫీజు ఉండదు. పోస్టు బట్టి ఏడో తరగతి, పదో తరగతి, డిగ్రీ, పీజీ విద్యార్హతతో పాటు అనుభవం అవసరం ఉంటుంది. ఈ పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే అర్హులు.
17 పోస్టుల భర్తీ
మొత్తం 17 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆఫీస్ ఇన్ ఛార్జ్-1 (కాంట్రాక్ట్), కుక్-3 (ఔట్ సోర్సింగ్) , హెల్పర్-1 (ఔట్ సోర్సింగ్), హౌస్ కీపర్-2, (ఔట్ సోర్సింగ్), ఎడ్యుకేటర్-2 (పార్ట్‌టైం), ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్ - 2 (పార్ట్‌టైం), పీటీ ఇన్సుట్రక్టర్ కం యోగా టీచర్-3 (పార్ట్‌టైం), హెల్పర్ కం నైట్ వాచ్‌మెన్-3 (పార్ట్‌టైం) పోస్టులను భర్తీ చేస్తున్నారు.
నెలవారీ వేతనం
1. ఆఫీస్ ఇన్ ఛార్జ్ పోస్టుకు రూ.33,100
2. కుక్ పోస్టులకు రూ.9,930
3. హెల్పర్ పోస్టుకు రూ.7,944
4. హౌస్ కీపర్ పోస్టులకు రూ.7,944
5. ఎడ్యుకేటర్ పోస్టులకు రూ.10,000
6. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కం మ్యూజిక్ టీచర్ పోస్టులకు రూ.10,000
7. పీటీ ఇన్సుట్రక్టర్ కం యోగా టీచర్ పోస్టులకు రూ.10,000
8. హెల్పర్ కం నైట్ వాచ్‌మెన్ పోస్టులకు రూ.7,944
వయో పరిమితి
అన్ని పోస్టులకు వయో పరమితి 30 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s31be3bc32e6564055d5ca3e5a354acbef/uploads/2024/12/2024120247.pdf ను క్లిక్ చేయండి. అందులోనే అప్లికేషన్ ఫాం డౌన్‌లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఖాళీలను పూర్తి చేసి సంబంధిత సర్టిఫికేట్లను జతచేసి, డిసెంబర్ 13 తేదీ, సాయంత్రం 5 గంటల లోపు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ, సాధికారత అధికారి, కె.టిసి. ఫంక్షన్ హాల్ దగ్గర, సుండుపల్లి రోడ్డు, రాయచోటి, అన్నమయ్య జిల్లాకి అందజేయాలి.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు