తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ration Dealer Jobs :ఎన్‌టీఆర్‌ జిల్లాలో రేష‌న్ డీల‌ర్ పోస్టుల‌కు భ‌ర్తీకి నోటిఫికేష‌న్, దరఖాస్తుకు డిసెంబ‌ర్ 5 ఆఖరు తేదీ

Ration Dealer Jobs :ఎన్‌టీఆర్‌ జిల్లాలో రేష‌న్ డీల‌ర్ పోస్టుల‌కు భ‌ర్తీకి నోటిఫికేష‌న్, దరఖాస్తుకు డిసెంబ‌ర్ 5 ఆఖరు తేదీ

HT Telugu Desk HT Telugu

27 November 2024, 15:17 IST

google News
  • Ration Dealer Jobs : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజన్ లోని ఐదు మండలాల్లో 22 రేషన్ డీలర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానించారు. డిసెంబర్ 5వ తేదీ లోపు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూలు ద్వారా ఎంపిక ఉంటుంది.

ఎన్‌టీఆర్‌ జిల్లాలో రేష‌న్ డీల‌ర్ పోస్టుల‌కు భ‌ర్తీకి నోటిఫికేష‌న్, దరఖాస్తుకు డిసెంబ‌ర్ 5 ఆఖరు తేదీ
ఎన్‌టీఆర్‌ జిల్లాలో రేష‌న్ డీల‌ర్ పోస్టుల‌కు భ‌ర్తీకి నోటిఫికేష‌న్, దరఖాస్తుకు డిసెంబ‌ర్ 5 ఆఖరు తేదీ

ఎన్‌టీఆర్‌ జిల్లాలో రేష‌న్ డీల‌ర్ పోస్టుల‌కు భ‌ర్తీకి నోటిఫికేష‌న్, దరఖాస్తుకు డిసెంబ‌ర్ 5 ఆఖరు తేదీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రేష‌న్ డీల‌ర్ల నియామ‌కానికి సంబంధించి వివిధ రెవెన్యూ డివిజ‌న్‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయడానికి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ఎన్‌టీఆర్‌ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలోని ఐదు మండ‌లాల్లో 22 రేష‌న్ డీల‌ర్ల నియామ‌కం, దుకాణాల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు డిసెంబ‌ర్‌ 5 ఆఖ‌రు తేదీగా నిర్ణ‌యించారు. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూలు ద్వారా ఎంపిక ఉంటుంది.

తిరువూరు రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలో రెడ్డిగూడెం, గంప‌ల‌గూడెం, తిరువూరు, ఎ.కొండూరు, విస్స‌న్న‌పేట మండ‌లాల్లో ఖాళీగా ఉన్న 13 రేష‌న్ డీల‌ర్లు, కొత్తగా మంజూరు అయిన 9 తొమ్మిది రేష‌న్ దుకాణాల‌కు డీల‌ర్ల నియామ‌కానికి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్న‌ట్లు తిరువూరు ఆర్డీవో మాధురి తెలిపారు. వీటిలో గంప‌ల‌గూడెం మండ‌లంలో 9, ఎ.కొండూరు మండ‌లంలో రెండు, తిరువూరు మండ‌లంలో 7, రెడ్డిగూడెం మండలంలో మూడు, విస‌న్న‌పేట మండ‌లంలో 1 రేష‌న్ డీల‌ర్ల పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు.

విద్యార్హత‌...వ‌యో ప‌రిమితి

తిరువూరు రెవెన్యూ డివిజ‌న్ ప‌రిధిలో ఖాళీగా ఉన్న రేష‌న్ డీల‌ర్లు, కొత్తగా మంజూరైన దుకాణాల భ‌ర్తీ చేయ‌డానికి ఇంట‌ర్మీడియ‌ట్ అర్హ‌త‌ను నిర్ణ‌యించారు. డీల‌ర్ పోస్టుకు, దుకాణానికి ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు సొంత గ్రామానికి చెందిన వారై ఉండాలి. ఎటువంటి పోలీసు కేసులు ఉండ‌కూడ‌దు. చ‌దువుతున్న‌వారు, విద్యా వ‌లంటీర్లు, ఏఎన్ఎంలు, కాంట్రాక్టు ఉద్యోగులుగా ప‌ని చేస్తున్న‌వారు, ఆశ కార్య‌క్త‌లు ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు అన‌ర్హులు. అలాగే వ‌య‌స్సు 18 నుంచి 40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. రిజ‌ర్డ్వ్ కేట‌గిరీకి చెందిన అభ్య‌ర్థుల‌కు ప్ర‌భుత్వ నిర్ణ‌యించిన మిన‌హాయింపు ఉంటుంది.

అభ్యర్థుల ఎంపిక షెడ్యూల్

అభ్య‌ర్థులు డిసెంబ‌ర్ 5 తేదీలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబ‌ర్ 6 తేదీన ద‌ర‌ఖాస్తుల ప‌రిశీలించ‌నున్నారు. అదే రోజు అర్హులైన వారి జాబితా ప్ర‌క‌టిస్తారు. ఎంపికైన వారికి డిసెంబ‌ర్ 10న రాత ప‌రీక్ష‌ నిర్వ‌హిస్తారు. రాత ప‌రీక్ష తిరువూరు జెడ్పీ బాలికోన్న‌త పాఠ‌శాల‌లో ఉద‌యం 10.30 గంట‌ల‌కు నిర్వ‌హిస్తారు. రాత ప‌రీక్ష‌కు సంబంధించి హాల్ టికెట్స్ డిసెంబ‌ర్ 8న జారీ చేస్తారు. డిసెంబ‌ర్ 11న రాత ప‌రీక్ష‌ల ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు. ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల జాబితా ప్ర‌చురిస్తారు. రాత ప‌రీక్ష‌లో ఆయా ప్రాంతాల‌కు చెందిన అత్య‌ధిక మార్కులు సాధించిన ఐదుగురు అభ్య‌ర్థుల‌కు డిసెంబ‌ర్ 12న తిరువూరు ఆర్డీవో కార్యాల‌యంలో ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తారు. డిసెంబ‌ర్ 13న ఎంపికైన వారి తుది జాబితాను విడుద‌ల చేస్తారు.

ద‌ర‌ఖాస్తుతో పాటు జ‌త చేయాల్సిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు

1. ఇంట‌ర్మీడియ‌ట్‌, ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త స‌ర్టిపికేట్లు

2. వ‌య‌స్సు ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

3. నివాస ధ్రువీక‌ర‌ణ ప‌త్రం (ఓట‌రు కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదైనా ప‌ర్వాలేదు)

4. మూడు పాస్‌పోట్ సైజ్ పోటోలు

5. కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

6. నిరుద్యోగిగా ఉన్న‌ట్లు స్వీయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

7. దివ్యాంగుల కేట‌గిరికి చెందిన వారైతే సంబంధిత స‌ర్టిఫికేట్లు జ‌త చేయాలి.

తిరువూరు రెవెన్యూ డివిజ‌న్‌కు సంబంధించి డీల‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆయా ఆర్డీవో కార్యాల‌యంలో స‌మ‌ర్పించాలి. డిసెంబ‌ర్ 5 తేదీ లోపు ద‌ర‌ఖాస్తును దాఖలు చేయాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుతో పాటు సంబంధిత స‌ర్టిఫికేట్లు జ‌త చేయడం త‌ప్ప‌ని స‌రి. ఇత‌ర వివ‌రాల కోసం తిరువూరు ఆర్డీవో కార్యాల‌యాన్ని సంప్ర‌దించాల‌ని ఆర్డీవో మాధురి తెలిపారు.

జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం