TTD Jobs 2024 : టీటీడీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ - అక్టోబర్ 1న ఇంటర్వ్యూలు
టీటీడీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఎనిమిది ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అక్టోబర్ 1న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ ఉద్యోగులకు హిందూ మతం వారు మాత్రమే అర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన తిరుపతిలో ఉన్న శ్రీ పద్మావతి హార్ట్ సెంటర్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ ఉద్యోగులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగులకు హిందు మతం వారు మాత్రమే అర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
అర్హత, ఆసక్తి ఉన్న వారు స్వయంగా అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికేట్స్ (విద్యార్హత, అనుభవం, వయస్సు, ఆధార్, కుల ధ్రువీకరిణ పత్రాలు)తో పాటు ఒక అటెస్టడ్ చేసిన సెట్ జిరాక్స్ కాపీలతో అక్టోబర్ 1న జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
పోస్టులు:
మొత్తం ఎనిమిది పోస్టులను భర్తీ చేయనున్నారు. సీనియర్ ఫిజిషియన్ అసిస్టెంట్ (1), జూనియర్ ఫిజిషియన్ అసిస్టెంట్ (1), పెర్ఫ్యూజనిస్ట్ (1), హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్ (1), ఎకో టెక్నీషియన్ (1), అనస్థీషియా టెక్నీషియన్ (3), వంటి పోస్టులను భర్తీ చేస్తారు.
సీనియర్ ఫిజిషియన్ అసిస్టెంట్ పోస్టుకు విద్యా అర్హత బీఎస్సీ ఫిజిషియన్ అసిస్టెంట్ కోర్సు (సీటీ సర్జరీ). సీటీ సర్జరీలో ఫిజిషియన్ అసిస్టెంట్‌గా ఐదేళ్ల అనుభవం ఉండాలి. వయో పరిమితి 35 ఏళ్లు. నెల వారీ వేతనం రూ. 66,552 ఉంటుంది.
జూనియర్ ఫిజిషియన్ అసిస్టెంట్ పోస్టుకు విద్యా అర్హత ఫిజిషియన్ అసిస్టెంట్ కోర్సు (సీటీ సర్జరీ)లో డిప్లొమాతో బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. సీటీ సర్జరీలో ఫిజిషియన్ అసిస్టెంట్‌గా మూడేళ్ల అనుభవం ఉండాలి. వయో పరిమితి 35 ఏళ్లు. నెల వారీ వేతనం రూ. 41,476 ఉంటుంది.
పెర్ఫ్యూజనిస్ట్ పోస్టుకు విద్యా అర్హత పెర్ఫ్యూజన్ టెక్నాలజీలో బీఎస్సీ చేసి ఉండాలి. ఈసీఎంఓతో హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి. వయో పరిమితి 35 ఏళ్లు. నెల వారీ వేతనం రూ. 35 వేలు ఉంటుంది.
హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ కోఆర్డినేటర్ పోస్టుకు విద్యా అర్హత బీఎస్సీ ఫిజిషియన్ అసిస్టెంట్, లేదా ఎంఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలి. హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ విభాగంలో కో ఆర్డినేటర్ లేదా ఫిజిషియన్ అసిస్టెంట్‌గా ఐదేళ్ల అనుభవం. వయో పరిమితి 35 ఏళ్లు. నెల వారీ వేతనం రూ. 30 వేలు ఉంటుంది.
ఎకో టెక్నీషియన్‌కు విద్యా అర్హత బీఎస్సీ ఎకోకార్డియోగ్రఫీ. గుర్తింపు పొందిన హాస్పిటల్‌లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. వయో పరిమితి 35 ఏళ్లు. నెల వారీ వేతనం రూ. 21,500 ఉంటుంది.
అనస్థీషియా టెక్నీషియన్ పోస్టుకు విద్యా అర్హత బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ పూర్తి చేసి ఉండాలి. గుర్తింపు పొందిన హాస్పిటల్‌లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. వయో పరిమితి 35 ఏళ్లు. నెల వారీ వేతనం రూ. 21,500 ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. మార్కులను బట్టీ మెరిట్ లిస్టు తయారు చేస్తారు. మార్కులను అకాడమీక్ ప్రతిభను అనుసరించి కేటాయిస్తారు. ఇంటర్వ్యూ జరిగే చిరునామా...శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్, తిరుపతి. అక్కడ అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు రిపోర్టింగ్ చేయాలి. మధ్యాహ్నం 12 గంటలకు రిజిస్ట్రేషన్ గడువు ముగుస్తుంది.
రిపోర్టింగ్ - జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్