తెలుగు న్యూస్  /  career  /  Aibe 19 Hall Tickets 2024 : 'లా' అభ్యర్థులకు అలర్ట్ - ఈనెల 15న ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదల

AIBE 19 Hall Tickets 2024 : 'లా' అభ్యర్థులకు అలర్ట్ - ఈనెల 15న ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ హాల్ టికెట్లు విడుదల

12 December 2024, 20:11 IST

google News
    • All India Bar Examination 2024 : AIBE 19కి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 15వ తేదీన హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఆన్ లన్ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తి అయింది. ఇందుకు సంబంధించిన రాత పరీక్ష… డిసెంబర్ 22వ తేదీన జరగనుంది. ఏపీ, తెలంగాణలోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 
AIBE - 19 హాల్ టికెట్లు
AIBE - 19 హాల్ టికెట్లు

AIBE - 19 హాల్ టికెట్లు

ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామినేషన్​ (ఏఐబీఈ 19)కు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు డిసెంబర్ 22వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. https://allindiabarexamination.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

డిసెంబర్ 22వ తేదీన ఈ పరీక్ష నిర్వహించనున్నారు. డిసెంబర్ 22వ తేదీన దేశవ్యాప్తంగా పరీక్ష జరగనుంది. తెలంగాణలో హైదరాబాద్ సెంటర్ గా ఉంది. ఏపీలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలు ఉన్నాయి.

ఆలిండియా బార్ ఎగ్జామినేషన్​లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కులు 40 శాతంగా ఉంది. సిలబస్ ప్రకారం AIBE 19లో 19 అంశాలు నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. మూడు గంటల సమయం ఉంటుంది.

ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి:

  1. ఏఐబీఈ 19కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://allindiabarexamination.com/index.html వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే AIBE XIX admit card 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
  3. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తో పాటు పాస్ వర్డ్ ను ఎంట్రీ చేయాలి.
  4. డౌన్లోడ్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

ఏఐబీఈ పరీక్ష విధానం - మార్కుల వివరాలు:

  1. రాజ్యాంగ చట్టం: 10 ప్రశ్నలు
  2. ఐ.పీ.సీ(ఇండియన్ పీనల్ కోడ్), (కొత్త) భారతీయ న్యాయ సంహిత: 8 ప్రశ్నలు
  3. సీఆర్​పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్), (కొత్త) భారతీయ నగరిక్ సురక్ష సంహిత: 10
  4. సీ.పీ.సీ.(సివిల్ ప్రొసీజర్ కోడ్): 10 ప్రశ్నలు
  5. ఎవిడెన్స్​ యాక్ట్​ (భారతీయ శక్ష అధినియం): 8 ప్రశ్నలు
  6. మధ్యవర్తిత్వ చట్టంతో సహా ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం: 4 ప్రశ్నలు
  7. కుటుంబ చట్టం: 8 ప్రశ్నలు
  8. ప్రజా ప్రయోజన వ్యాజ్యం: 4 ప్రశ్నలు
  9. అడ్మినిస్ట్రేషన్ చట్టం: 3 ప్రశ్నలు
  10. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ ప్రొఫెషనల్ మిస్​కాండక్ట్​ కేసులు: 4 ప్రశ్నలు
  11. కంపెనీ చట్టం: 2 ప్రశ్నలు
  12. పర్యావరణ చట్టం: 2 ప్రశ్నలు
  13. సైబర్ చట్టం: 2 ప్రశ్నలు
  14. కార్మిక, పారిశ్రామిక చట్టం: 4 ప్రశ్నలు
  15. మోటారు వాహన చట్టం, వినియోగదారుల రక్షణ చట్టంతో సహా లా ఆఫ్​ టోర్ట్: 5 ప్రశ్నలు
  16. పన్నుకు సంబంధించిన చట్టం: 4 ప్రశ్నలు
  17. కాంట్రాక్ట్ చట్టం, నిర్దిష్ట ఉపశమనం, ఆస్తి చట్టాలు, నెగోషియబుల్ ఇన్​స్ట్రుమెంట్ చట్టం: 8 ప్రశ్నలు
  18. భూసేకరణ చట్టం: 2 ప్రశ్నలు
  19. మేథో సంపత్తి చట్టాలు: 02 ప్రశ్నలు

 

టాపిక్

తదుపరి వ్యాసం