AIBE 19 Exam : 'లా' అభ్యర్థులకు అలర్ట్ - ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ మరోసారి​ వాయిదా, కొత్త తేదీలివే-aibe 19 exam will be held on december 22 key dates check here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Aibe 19 Exam : 'లా' అభ్యర్థులకు అలర్ట్ - ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ మరోసారి​ వాయిదా, కొత్త తేదీలివే

AIBE 19 Exam : 'లా' అభ్యర్థులకు అలర్ట్ - ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ మరోసారి​ వాయిదా, కొత్త తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 20, 2024 04:23 PM IST

AIBE 19కి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 1వ తేదీన జరగాల్సిన పరీక్షను వాయిదా వేశారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తి అయింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నవంబర్ 22వ తేదీలోపు ఎడిట్ చేసుకోవచ్చు.

ఏఐబీఈ - 19 పరీక్ష
ఏఐబీఈ - 19 పరీక్ష

ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామినేషన్​ (ఏఐబీఈ 19) మరోసారి వాయిదా పడింది. ఈ మేరకు బార్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా (బీసీఐ) ప్రకటించింది. షెడ్యూల్​ ప్రకారం నవంబర్​ 24న జరగాల్సిన ఈ పరీక్ష,… డిసెంబర్​ 1కి వాయిదా వేశారు. అయితే ఈ తేదీని కూడా బీఐసీ మార్చింది. డిసెంబర్ 22వ తేదీన ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు తాజాగా ప్రకటించింది.

AIBE 19కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నవంబర్ 22వ తేదీలోపు ఎడిట్ చేసుకోవచ్చు. డిసెంబర్ 15వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. డిసెంబర్ 22వ తేదీన దేశవ్యాప్తంగా పరీక్ష జరగనుంది. తెలంగాణలో హైదరాబాద్ సెంటర్ గా ఉంది. ఏపీలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలుగా ఉన్నాయి.

ఆలిండియా బార్ ఎగ్జామినేషన్​లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కులు 40 శాతంగా ఉంది. సిలబస్ ప్రకారం AIBE 19లో 19 అంశాలు నుంచి ప్రశ్నలు వస్తాయి. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. మూడు గంటల సమయం ఉంటుంది.

  1. రాజ్యాంగ చట్టం: 10 ప్రశ్నలు
  2. ఐ.పీ.సీ(ఇండియన్ పీనల్ కోడ్), (కొత్త) భారతీయ న్యాయ సంహిత: 8 ప్రశ్నలు
  3. సీఆర్​పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్), (కొత్త) భారతీయ నగరిక్ సురక్ష సంహిత: 10
  4. సీ.పీ.సీ.(సివిల్ ప్రొసీజర్ కోడ్): 10 ప్రశ్నలు
  5. ఎవిడెన్స్​ యాక్ట్​ (భారతీయ శక్ష అధినియం): 8 ప్రశ్నలు
  6. మధ్యవర్తిత్వ చట్టంతో సహా ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం: 4 ప్రశ్నలు
  7. కుటుంబ చట్టం: 8 ప్రశ్నలు
  8. ప్రజా ప్రయోజన వ్యాజ్యం: 4 ప్రశ్నలు
  9. అడ్మినిస్ట్రేషన్ చట్టం: 3 ప్రశ్నలు
  10. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ ప్రొఫెషనల్ మిస్​కాండక్ట్​ కేసులు: 4 ప్రశ్నలు
  11. కంపెనీ చట్టం: 2 ప్రశ్నలు
  12. పర్యావరణ చట్టం: 2 ప్రశ్నలు
  13. సైబర్ చట్టం: 2 ప్రశ్నలు
  14. కార్మిక, పారిశ్రామిక చట్టం: 4 ప్రశ్నలు
  15. మోటారు వాహన చట్టం, వినియోగదారుల రక్షణ చట్టంతో సహా లా ఆఫ్​ టోర్ట్: 5 ప్రశ్నలు
  16. పన్నుకు సంబంధించిన చట్టం: 4 ప్రశ్నలు
  17. కాంట్రాక్ట్ చట్టం, నిర్దిష్ట ఉపశమనం, ఆస్తి చట్టాలు, నెగోషియబుల్ ఇన్​స్ట్రుమెంట్ చట్టం: 8 ప్రశ్నలు
  18. భూసేకరణ చట్టం: 2 ప్రశ్నలు
  19. మేధో సంపత్తి చట్టాలు: 2 ప్రశ్నలు

ఏఐబీఈ - 19 గురించి మరింత సమాచారం కోసం అభ్యర్థులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ barcouncilofindia.org, ఎగ్జామ్ పోర్టల్​ని చూడొచ్చు.

Whats_app_banner