Bar exam 2024 : అలర్ట్! ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ వాయిదా- ముఖ్యమైన డేట్లు ఇవే..
ఏఐబీఈ 19కి సంబంధించి కీలక్ అప్డేట్! బార్ ఎగ్జామ్‌ని వాయిదా వేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ గడువును సైతం పొడిగించారు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ 19)ని వాయిదా వేస్తున్నట్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 24న జరగాల్సిన ఈ పరీక్ష, ఇప్పుడు డిసెంబర్ 1కి వాయిదా పడింది. ఈ మేరకు బీఐసీ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.
పరీక్షను వాయిదా వేయడంతో పాటు ఏఐబీఈ 19 రిజిస్ట్రేషన్ ప్రక్రియను సైతం పొడగించింది. షెడ్యూల్ ప్రకారం బార్ ఎగ్జామ్ 2024 రిజిస్ట్రేషన్లు అక్టోబర్ 25, శుక్రవారంతో ముగియాల్సి ఉంది. కానీ ఇప్పుడు అభ్యర్థులు ఈ నెల 28 వరకు allindiabarexamination.com లో పరీక్ష కోసం రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫారం కరెక్షన్ విండో అక్టోబర్ 30తో ముగుస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక లేటెస్ట్ షెడ్యూల్ ప్రకారం ఏఐబీ 19 అడ్మిట్ కార్డులు నవంబర్ 23న విడుదలవుతాయి.
ఏఐబీఈ 19 పరీక్షకు సంబంధించిన రివైడ్జ్ షెడ్యూల్ ప్రకటనను చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
బార్ ఎగ్జామ్ 2024..
ఆలిండియా బార్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి.
ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీస మార్కులు 40 శాతం.
సిలబస్ ప్రకారం ఏఐబీఈ 19లో 19 అంశాలు లేదా సబ్జెక్టుల నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి.
రాజ్యాంగ చట్టం: 10 ప్రశ్నలు
ఐ.పీ.సీ(ఇండియన్ పీనల్ కోడ్), (కొత్త) భారతీయ న్యాయ సంహిత: 8 ప్రశ్నలు
ఇదీ చూడండి:- Justice Sanjiv Khanna: 51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా; నవంబర్ 11న ప్రమాణ స్వీకారం
సీఆర్పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్), (కొత్త) భారతీయ నగరిక్ సురక్ష సంహిత: 10
సీ.పీ.సీ.(సివిల్ ప్రొసీజర్ కోడ్): 10 ప్రశ్నలు
ఎవిడెన్స్ యాక్ట్ (భారతీయ శక్ష అధినియం): 8 ప్రశ్నలు
మధ్యవర్తిత్వ చట్టంతో సహా ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం: 4 ప్రశ్నలు
కుటుంబ చట్టం: 8 ప్రశ్నలు
ప్రజా ప్రయోజన వ్యాజ్యం: 4 ప్రశ్నలు
అడ్మినిస్ట్రేషన్ చట్టం: 3 ప్రశ్నలు
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ కేసులు: 4 ప్రశ్నలు
కంపెనీ చట్టం: 2 ప్రశ్నలు
పర్యావరణ చట్టం: 2 ప్రశ్నలు
సైబర్ చట్టం: 2 ప్రశ్నలు
కార్మిక, పారిశ్రామిక చట్టం: 4 ప్రశ్నలు
మోటారు వాహన చట్టం, వినియోగదారుల రక్షణ చట్టంతో సహా లా ఆఫ్ టోర్ట్: 5 ప్రశ్నలు
పన్నుకు సంబంధించిన చట్టం: 4 ప్రశ్నలు
కాంట్రాక్ట్ చట్టం, నిర్దిష్ట ఉపశమనం, ఆస్తి చట్టాలు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చట్టం: 8 ప్రశ్నలు
భూసేకరణ చట్టం: 2 ప్రశ్నలు
మేధో సంపత్తి చట్టాలు: 2 ప్రశ్నలు
ఏఐబీఈ 19 గురించి మరింత సమాచారం కోసం అభ్యర్థులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్, barcouncilofindia.org, ఎగ్జామ్ పోర్టల్‌ని సందర్శించవచ్చు.
సంబంధిత కథనం