తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget 2024: బడ్జెట్ 2024పై ‘జెరోధా’ ఫౌండర్ నితిన్ కామత్ ‘కూల్ డౌన్’ కామెంట్స్; వైరల్ గా మారిన పోస్ట్

Budget 2024: బడ్జెట్ 2024పై ‘జెరోధా’ ఫౌండర్ నితిన్ కామత్ ‘కూల్ డౌన్’ కామెంట్స్; వైరల్ గా మారిన పోస్ట్

HT Telugu Desk HT Telugu

Published Jul 23, 2024 03:39 PM IST

google News
  • కేంద్ర బడ్జెట్ 2024: బడ్జెట్ 2024 పై ప్రముఖ స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ సంస్థ ‘జెరోధా’ సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ఆసక్తికర విశ్లేషణ చేశారు. తాజా బడ్జెట్లో ప్రతిపాదించిన పన్ను మార్పుల వల్ల స్టాక్ మార్కెక్ కార్యకలాపాలు కొంత కూల్ డౌన్ అవుతాయని నితిన్ కామత్ వ్యాఖ్యానించారు.

‘జెరోధా’ సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్

‘జెరోధా’ సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్

స్టాక్ మార్కెట్ కార్యకలాపాలకు సంబంధించి ఎస్టీటీ, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ ల్లో పెంపు వల్ల స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు కొంత తగ్గుముఖం పడుతాయని ప్రముఖ స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ సంస్థ ‘జెరోధా’ సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ అభిప్రాయపడ్డారు. పన్ను రేట్లలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2024 బడ్జెట్లో ప్రకటించిన మార్పులు మార్కెట్ కార్యకలాపాలను కొంత తగ్గించగలవని కామత్ అన్నారు.


ఎఫ్ అండ్ ఓ లపై..

సెక్యూరిటీలలో ఆప్షన్ విక్రయంపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) రేట్లను ఆప్షన్ ప్రీమియంలో 0.0625 శాతం నుంచి 0.1 శాతానికి, సెక్యూరిటీల్లో ఫ్యూచర్స్ అమ్మకంపై పన్నును 0.0125 శాతం నుంచి 0.02 శాతానికి పెంచాలని బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. గత ఏడాది తాము రూ.1,500 కోట్ల ఎస్టీటీని సేకరించామని, ఈ ఏడాది కూడా అదే స్థాయిలో కార్యకలాపాలు కొనసాగితే కొత్త రేట్ల ప్రకారం ఇది సుమారు రూ.2,500 కోట్లకు పెరుగుతుందని కామత్ పేర్కొన్నారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ను 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారని, ఇది నేటి నుంచి వర్తిస్తుందని చెప్పారు.