OnePlus Nord 4 launch: ప్రీమియం లుక్, ఏఐ ఫీచర్స్ తో వన్ ప్లస్ నార్డ్ 4 లాంచ్; ఈ ఆఫర్స్ తో కొనేయండి..
OnePlus Nord 4 launch: రూ.29,999 ప్రారంభ ధరతో వన్ ప్లస్ నార్డ్ 4 భారత్ లో లాంచ్ అయింది. కొత్త తరం నార్డ్ సిరీస్ స్మార్ట్ ఫోన్ లో పొందుపర్చిన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ను తెలుసుకోండి. ఈ స్మార్ట్ ఫోన్ ను జూలై 20 నుంచి అమేజాన్, వన్ ప్లస్ ఆన్ లైన్ స్టోర్స్, ఇతర రిటైల్ స్టోర్స్ లో ప్రి ఆర్డర్ చేసుకోవచ్చు.
OnePlus Nord 4 launch: కొన్ని నెలల ఊహాగానాల తరువాత, మిలాన్ లో జరిగిన "సమ్మర్ లాంచ్ ఈవెంట్" లో వన్ ప్లస్ నార్డ్ 4 ను ప్రకటించారు. ఈ లాంచ్ ఈవెంట్లో వన్ ప్లస్ నార్డ్ 4 (OnePlus Nord 4) తో పాటు వన్ ప్లస్ వాచ్ 2ఆర్, నార్డ్ బడ్స్ 3 ప్రో, ప్యాడ్ 2 వంటి అనేక ఇతర డివైజెస్ ను ఆవిష్కరించారు. గత కొన్ని వారాలుగా, వన్ ప్లస్ తన కొత్త మెటల్-ఫినిష్ డిజైన్ ను ప్రదర్శించడం ద్వారా నార్డ్ 4 ను టీజ్ చేస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ 4 సంవత్సరాల ఓఎస్ అప్ గ్రేడ్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్స్ ను అందిస్తుందని వన్ ప్లస్ ప్రకటించింది.
వన్ ప్లస్ నార్డ్ 4 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
వన్ ప్లస్ నార్డ్ 4 కొత్త డ్యూయల్-టోన్ డిజైన్, కొత్త కెమెరా మాడ్యూల్ ను కలిగి ఉంది. ఇది మిడ్-రేంజ్ సెగ్మెంట్లో ప్రీమియం స్మార్ట్ ఫోన్ గా కనిపిస్తుంది. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2150 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో 6.74 అంగుళాల అమోఎల్ఈడీ డిస్ప్లే, ఉంది. నార్డ్ 4 లో ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 7+ జెన్ 3 ప్రాసెసర్, 8 జీబీ LPDDR5X ర్యామ్ ఉన్నాయి. స్మూత్ గేమింగ్ కోసం, ఈ స్మార్ట్ఫోన్ (OnePlus Nord 4) ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటారును కూడా కలిగి ఉంది. ఇది టీయూవీ ఎస్యూడీ 72 మంత్ ఏ రేటింగ్ ను కూడా పొందింది.
వన్ ప్లస్ నార్డ్ 4 కెమెరా సెటప్
వన్ ప్లస్ నార్డ్ 4లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఓఐఎస్, ఇఐఎస్ సపోర్ట్ తో 50 మెగాపిక్సెల్ సోనీ లైటియా సెన్సార్, 8 మెగాపిక్సెల్ సోనీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. 100 వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఈ బ్యాటరీ 1600 ఛార్జింగ్ సైకిళ్ల వరకు పనిచేస్తుందని వన్ ప్లస్ పేర్కొంది. వన్ ప్లస్ నార్డ్ 4 (OnePlus Nord 4) స్మార్ట్ ఫోన్ ఏఐ ఆడియో సమ్మరీ, ఏఐ నోట్ సమ్మరీ, ఏఐ టెక్స్ట్ ట్రాన్స్లేట్ వంటి అనేక ఏఐ ఫీచర్లను కూడా అందిస్తుంది.
వన్ ప్లస్ నార్డ్ 4 ధర, ఆఫర్స్
వన్ ప్లస్ నార్డ్ 4 స్మార్ట్ ఫోన్ మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి మెర్క్యూరియల్ సిల్వర్, ఒయాసిస్ గ్రీన్, ఒబ్సిడియన్ మిడ్ నైట్. వన్ ప్లస్ నార్డ్ 4 స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.29,999 గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర వరుసగా రూ.32,999, రూ.35,999 గా ఉంది. వన్ ప్లస్ ఆన్లైన్ స్టోర్, అమెజాన్, ఇతర రిటైల్ స్టోర్లలో జూలై 20 నుంచి ఈ (OnePlus Nord 4) స్మార్ట్ ఫోన్ ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. కొత్త నార్డ్-సిరీస్ స్మార్ట్ ఫోన్ అధికారిక సేల్ ఆగస్టు 4 న ప్రారంభమవుతుంది.