OnePlus Phone Discount : రూ.14వేల డిస్కౌంట్‌తో వన్ ప్లస్ ఫోన్.. అరగంటలో ఛార్జింగ్.. ఇయర్ బడ్స్ ఫ్రీ!-oneplus 11 5g phone at lowest price after 14000 rupees discount get free oneplus buds ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Oneplus Phone Discount : రూ.14వేల డిస్కౌంట్‌తో వన్ ప్లస్ ఫోన్.. అరగంటలో ఛార్జింగ్.. ఇయర్ బడ్స్ ఫ్రీ!

OnePlus Phone Discount : రూ.14వేల డిస్కౌంట్‌తో వన్ ప్లస్ ఫోన్.. అరగంటలో ఛార్జింగ్.. ఇయర్ బడ్స్ ఫ్రీ!

Anand Sai HT Telugu
Jul 15, 2024 08:30 PM IST

OnePlus Phone Discount : తక్కువ ధరకే వన్ ప్లస్ 11 5జీ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ జూలై 22 వరకు ఈ ఫోన్‌తో ఉచిత ఇయర్ బడ్స్ కూడా అందిస్తోంది.

వన్ ప్లస్ 5జీపై డిస్కౌంట్
వన్ ప్లస్ 5జీపై డిస్కౌంట్

మీరు వన్ ప్లస్ ఫోన్‌కు ఫ్యాన్ అయితే మీకోసం మంచి అవకాశం ఉంది. మీకు ఇష్టమైన వన్ ప్లస్ 11 5జీని తక్కువ ధరకు కొనుగోలు చేయెుచ్చు. అమెజాన్ వన్ ప్లస్ ఫోన్‌ను భారీ తగ్గింపుతో విక్రయిస్తోంది. వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లపై ఇంత పెద్ద డిస్కౌంట్ లభించడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. అమెజాన్ జూలై 22 వరకు ఫోన్‌తోపాటుగా ఉచిత ఇయర్ బడ్స్‌ను కూడా అందిస్తోంది. అంతే కాదు మీరు బ్యాంక్ ఆఫర్ల ద్వారా డీల్‌ను సులభతరం చేయవచ్చు. కొనుగోలు సమయంలో ఉచిత వన్ ప్లస్ బడ్స్ జెడ్ 2ను పొందవచ్చు. ఈ ఆఫర్ ఏంటో వివరంగా తెలుసుకోండి..

రూ.56,999 ధరకు లాంచ్ అయిన వన్ ప్లస్ 11 5జీపై భారీ డిస్కౌంట్ వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌పై ప్రస్తుతం అమెజాన్‌లో రూ .14,000 భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను అమెజాన్‌ రూ .42,999 కు కొనుగోలు చేయవచ్చు. ఈ ధరలో ఎటర్నల్ గ్రీన్ షేడ్ మాత్రమే లభిస్తుంది. టైటాన్ బ్లాక్ కలర్ ధర రూ.45,999గా ఉంది.

రూ.3,000 వరకు బ్యాంక్ ఆఫర్ల ద్వారా అదనపు క్యాష్ బ్యాక్ పొందవచ్చని అమెజాన్ తెలిపింది. ఇది కాకుండా వన్ ప్లస్ బడ్స్ జెడ్2ను ఉచితంగా తీసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.31,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. డివైజ్ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం.

వన్ ప్లస్ 11 5జీ స్పెసిఫికేషన్లు

వన్ ప్లస్ 11లో 6.7 అంగుళాల క్యూహెచ్ డీ అమోలెడ్ ఎల్టీపీఓ 120 హెర్ట్జ్ స్క్రీన్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. అడ్రినో 740 జీపీయూతో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్ సెట్ తో వస్తున్న ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. 100వాట్ సూపర్ వూక్ ఛార్జింగ్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ఓఐఎస్, 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ 32 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ లెన్స్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం ఫోన్ వై-ఫై 7, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సి, యుఎస్బి టైప్-సి 2.0 పోర్ట్‌ను అందిస్తుంది. ఇతర విషయాలకొస్తే, ఇందులో ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ రీడర్, అలర్ట్ స్లైడర్, డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి.

Whats_app_banner