Budget 2024: ఎస్టీటీ, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంపు; మార్కెట్ల నెగటివ్ రియాక్షన్-budget centre proposes to increase stt capital gains tax ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Budget 2024: ఎస్టీటీ, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంపు; మార్కెట్ల నెగటివ్ రియాక్షన్

Budget 2024: ఎస్టీటీ, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంపు; మార్కెట్ల నెగటివ్ రియాక్షన్

HT Telugu Desk HT Telugu
Jul 23, 2024 02:48 PM IST

డెరివేటివ్ ట్రేడింగ్ పై రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతోందని సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో తేలింది. ఈ నేపథ్యంలో.. ఈ రోజు బడ్జెట్లో రోజే నిర్మలా సీతారామన్ ఎస్టీటీ, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంపుపై కీలక ప్రకటన చేశారు.

ఎస్టీటీ, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంపు
ఎస్టీటీ, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంపు (PTI)

ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F & O) ట్రేడింగ్ పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) రేటును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సెక్యూరిటీలలో ఆప్షన్ విక్రయంపై ఎస్టీటీ రేట్లను ఆప్షన్ ప్రీమియంలో 0.0625 శాతం నుంచి 0.1 శాతానికి, సెక్యూరిటీల్లో ఫ్యూచర్స్ అమ్మకంపై 0.0125 శాతం నుంచి 0.02 శాతానికి పెంచాలని ప్రతిపాదించినట్లు ఆమె కేంద్ర బడ్జెట్ (budget 2024) ప్రసంగంలో తెలిపారు.

ఆర్థిక సర్వే ప్రభావం..

డెరివేటివ్ ట్రేడింగ్ పై రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతుండటంపై ఆర్థిక సర్వే (Economic Survey) ఆందోళన వ్యక్తం చేసిన మరుసటి రోజే నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అభివృద్ధి చెందుతున్న దేశంలో స్పెక్యులేటివ్ ట్రేడింగ్ సరి కాదని ఎకనమిక్ సర్వే తెలిపింది. డెరివేటివ్ ట్రేడింగ్ మానవుల జూద ప్రవృత్తిని ప్రోత్సహిస్తుందని సర్వే తెలిపింది. ఈ అంశాలు డెరివేటివ్స్ ట్రేడింగ్ లో చురుకైన రిటైల్ భాగస్వామ్యాన్ని ప్రేరేపించే అవకాశం ఉందని తెలిపింది.

మూలధన లాభాల పన్ను

దీర్ఘకాలిక, స్వల్పకాలిక మూలధన లాభాల పన్నును పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 'క్యాపిటల్ అసెట్' అమ్మకం ద్వారా వచ్చే లాభం లేదా లాభాన్ని మూలధన లాభాల పన్నుగా వర్గీకరించవచ్చు. స్వల్పకాలిక మూలధన లాభాలపై ఇకపై 15 శాతానికి బదులుగా 20 శాతం పన్ను రేటు విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. అన్ని ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ఆస్తులపై దీర్ఘకాలిక లాభాలపై 10 శాతానికి బదులుగా 12.5 శాతం పన్ను రేటు ఉంటుందని వెల్లడించారు. ఏడాదికి పైగా ఉన్న లిస్టెడ్ ఫైనాన్షియల్ అసెట్స్ ను లాంగ్ టర్మ్ గా వర్గీకరిస్తే, అన్ లిస్టెడ్ ఫైనాన్షియల్ అసెట్స్, నాన్ ఫైనాన్షియల్ అసెట్స్ ను లాంగ్ టర్మ్ గా వర్గీకరించడానికి కనీసం రెండేళ్ల పాటు ఉంచాల్సి ఉంటుంది.

డిబెంచర్లు, డెట్ మ్యూచువల్ ఫండ్స్ పై..

హోల్డింగ్ పీరియడ్ తో సంబంధం లేకుండా అన్ లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లు, డెట్ మ్యూచువల్ ఫండ్స్, మార్కెట్ లింక్డ్ డిబెంచర్లు వర్తించే రేట్ల వద్ద మూలధన లాభాలపై పన్ను ఉంటుందని బడ్జెట్ (budget 2024) ప్రసంగంలో నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే, స్టార్టప్ రంగానికి ఊతమిచ్చేందుకు అన్ని వర్గాల ఇన్వెస్టర్లకు ఏంజెల్ ట్యాక్స్ ను రద్దు చేయాలని నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు.

Whats_app_banner