ITR Filing : పన్ను ఆదా చేసేందుకు పక్క చూపులు చూస్తే నోటీసులు ఖాయం.. ఇలా చేయెుద్దు-itr filing 2024 these are main reasons to receive notice from income tax department ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Itr Filing : పన్ను ఆదా చేసేందుకు పక్క చూపులు చూస్తే నోటీసులు ఖాయం.. ఇలా చేయెుద్దు

ITR Filing : పన్ను ఆదా చేసేందుకు పక్క చూపులు చూస్తే నోటీసులు ఖాయం.. ఇలా చేయెుద్దు

Anand Sai HT Telugu
Jul 18, 2024 01:32 PM IST

ITR Filing 2024 : చాలా మందికి ఇప్పుడుంతా ఐటీఆర్ ఫైలింగ్ టెన్షన్. అయితే ఈ టెన్షన్‌లో చాలా తప్పులు చేస్తుంటారు. దీనితో ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుకోవాల్సి వస్తుంది.

ఐటీఆర్​ ఫైలింగ్​ తప్పులు
ఐటీఆర్​ ఫైలింగ్​ తప్పులు (MINT_PRINT)

ఆదాయపు పన్ను రిటర్నుల సమర్పణకు చివరి తేదీ సమీపిస్తోంది. పన్ను ఆదా చేయడం ఎలా అనే సాధారణ సూత్రాలు మీకు తెలుసు. కానీ చాలా మంది ఇందులో తప్పులు చేస్తుంటారు. అదేవిధంగా ఏదైనా మూలం నుండి వచ్చే ఆదాయాన్ని దాచిపెడితే మీరు ఎలాంటి నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందో తెలుసుకోవాలి.

ఆదాయాన్ని ఏదైనా విధంగా దాచినా లేదా ఆదాయాన్ని తక్కువగా ప్రకటించినా నోటీసు జారీ చేస్తారు. రెండో కారణం ఏంటంటే మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్(ITR)లో పొరపాటు చేస్తే, మీ రిటర్న్‌లో మీరు తక్కువ ఆదాయాన్ని చూపినప్పటికీ మీకు నోటీసు రావచ్చు. ముందుగా ఐటీఆర్‌లో ఆదాయాన్ని దాచిపెడితే ఎంత జరిమానా విధిస్తారో తెలుసుకోవాలి.

ఉద్యోగులు సెక్షన్లు 80C, 80D, ఇంటి అద్దె అలవెన్స్ అంటే HRA, లీవ్ ట్రావెల్ అలవెన్స్ అంటే LTA వంటి ఇతర విభాగాలలో తగ్గింపులను ఉపయోగించడం ద్వారా పన్ను ఆదా చేయవచ్చు. HRA క్లెయిమ్ చేయడానికి, పన్ను చెల్లింపుదారు తప్పనిసరిగా అద్దె ఇంట్లో నివసించాలి. ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నందుకు అద్దె చెల్లించి HRA పొందాలి.

నకిలీ అద్దె

సొంత ఇంట్లో ఉంటున్న వారు కూడా కంపెనీకి నకిలీ అద్దె రశీదు ఇచ్చి హెచ్‌ఆర్‌ఏ క్లెయిమ్ చేస్తున్నారు. ఏడాదికి లక్ష కంటే ఎక్కువ అద్దె ఉంటే యజమాని పాన్ నంబర్ ఇవ్వాలి. అటువంటప్పుడు సాధారణంగా చాలా మంది తమ పాన్ నంబర్‌ని ఉపయోగించి ఐటీఆర్ ఫైల్ చేయని వారిని కనుగొంటారు. పాన్ నంబర్ ఇవ్వకుండా ఉండేందుకు లక్షలోపు అద్దె చూపే వారు ఉన్నారు.

హోమ్‌లోన్, హెచ్ఆర్ఏ

చాలామంది HRA (గృహ అద్దె భత్యం), గృహ రుణ మినహాయింపులు రెండింటినీ క్లెయిమ్ చేస్తారు. దీనిపై ఎలాంటి నిషేధం లేదు. అయితే, కొన్ని పరిమితులు ఉన్నాయి. మీ ఇల్లు మీరు పని చేస్తున్న నగరంలో లేదా వేరే నగరంలో ఉన్నా, HRA, హోమ్ లోన్ పన్ను మినహాయింపు ఈ రెండు సందర్భాల్లోనూ పొందవచ్చు. అయితే ఈ పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయడానికి కారణం చట్టబద్ధంగా ఉండాలి. ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ చేపడితే దొరికిపోతారు. విచారణలో ఏమైనా సందేహాలుంటే విచారిస్తారు. అంతే కాదు పన్ను ఆదా చేసేందుకు అనేక నకిలీ విరాళాల రశీదులను కూడా సమర్పించకూడదు.

అదనపు ఆదాయం

మీ పన్ను రిటర్న్‌లో ఏదైనా అదనపు ఆదాయాన్ని తప్పనిసరిగా నివేదించాలి. ఏదైనా అదనపు ఆదాయాన్ని వెల్లడించకపోతే, పన్ను విచారణ కచ్చితంగా చేస్తారు. బ్యాంకింగ్ ద్వారా డబ్బు వచ్చినా లేదా టీడీఎస్ కోసం సమర్పించినా, అదే దర్యాప్తు చేస్తారు. పన్ను రాయితీ పొందడానికి నకిలీ పత్రాలను ఉపయోగించడం మంచి పద్ధతి కాదు. ఆదాయపు పన్ను శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI, డేటా మైనింగ్‌ని ఉపయోగిస్తోంది. ఈ టెక్నాలజీని ఉపయోగించి 360 డిగ్రీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తుంది.

జరిమానా

కొన్నిసార్లు పన్ను చెల్లింపుదారులు పన్ను బాధ్యతను తగ్గించడానికి ఆదాయాన్ని తక్కువగా అంచనా వేస్తారు. ఇది తప్పుడు విధానం. అటువంటి సందర్భాలలో, సెక్షన్ 270A ప్రకారం జరిమానా విధించవచ్చు. పన్ను అండర్‌రిపోర్టింగ్‌లో 50శాతంకి సమానమైన జరిమానాలు విధించవచ్చు. ఆ విధంగా వివరాలు తప్పుగా ఇచ్చినట్లయితే 200 శాతం జరిమానా విధించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదాయాన్ని దాచుకుని ఇబ్బందులు పడొద్దు.

Whats_app_banner