Fake Rent Receipts : ఐటీ రిటర్న్ కోసం ఫేక్ రెంట్ రసీదులు పెడుతున్నారా? ఏఐ పట్టేస్తుంది జాగ్రత్త
ITR Filing Rent Receipts : ఐటీఆర్ అనగానే చాలా మంది నకిలీ అద్దె రసీదులు పెడుతుంటారు. కానీ ఒకప్పటిలా లేదు పరిస్థితి. టెక్నాలజీ వచ్చేసింది. మిమ్మల్ని ఈజీగా పట్టిస్తుంది జాగ్రత్త.
చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఐటీ రిటర్న్‌లను దాఖలు చేసేటప్పుడు నకిలీ రెంట్ రసీదులను సమర్పిస్తారు. దీనితో ఏం కాదులే.. రిఫండ్ వచ్చేస్తుందని అనుకుంటారు. కానీ పరిస్థితులు గతంలోలాగా లేవు. పెరిగిన టెక్నాలజీ మీరు చేసిన తప్పును ఈజీగా పట్టిస్తుంది. చాలా మంది చెల్లిస్తున్న దానికంటే ఎక్కువ మొత్తంలో అద్దెను చూపి రికార్డులు సృష్టిస్తారు. దీనితో ఐటీఆర్ ఫైల్ చేస్తే రిఫండ్ వస్తుందని అనుకుంటారు. మీరు నిజంగా చెల్లించే అద్దె పాన్ ద్వారా నమోదు చేయబడినందున, అది AIS స్టేట్‌మెంట్‌లో నమోదు చేయబడుతుంది. ఇది ఆదాయ పన్ను శాఖ దృష్టికి రావచ్చు.
ఆదాయపు పన్నును ఆదా చేసేందుకు అనేక అధికారిక మార్గాలు ఉన్నాయి. అయితే నకిలీ సర్టిఫికెట్లు, పత్రాలు ఇచ్చి పన్ను ఆదా చేసుకునేందుకు ప్రయత్నించే వారు చాలా మంది ఉన్నారు. ఒక నివేదిక ప్రకారం పన్నును ఆదా చేయడానికి ప్రజలు చాలా మంది నకిలీ పత్రాలను సృష్టిస్తుంటారు. ఇందులో రెంట్ ఒకటి. డూప్లికేట్ అద్దె రసీదు పత్రాలను సమర్పించడం ద్వారా కొంత పన్ను ఆదా అవుతుందని అనుకుంటారు. ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ అలాంటి వాటిని గుర్తించే కొత్త సాంకేతిక శక్తిని కలిగి ఉంది. నకిలీ పత్రాలను ఇప్పుడు సులభంగా గుర్తించవచ్చు.
ఉద్యోగి జీతంలో హెచ్‌ఆర్‌ఏ లేదా ఇంటి అద్దె అలవెన్స్ ఉంటే వారు ఇంటి అద్దె చెల్లింపు రికార్డును కంపెనీ హెచ్‌ఆర్‌కి సమర్పించాలి. ఆదాయపు పన్నులో ఈ ఇంటి అద్దెకు పన్ను మినహాయింపు ఉంది. హెచ్ఆర్ కి సమర్పించకుంటే, పన్ను తీసివేస్తారు. ఐటీ రిటర్న్‌ల దాఖలుతో పాటు అద్దె రసీదులను అప్‌లోడ్ చేయవచ్చు. తీసివేసిన పన్ను తిరిగి చెల్లిస్తారు.
అద్దె సంవత్సరానికి రూ.1 లక్ష కంటే ఎక్కువ ఉంటే వారు తమ ఇంటి యజమాని పాన్ నంబర్‌ను అందించాలి. ఈ విధంగా మీ ఇంటి అద్దె చెల్లింపు AIS లేదా వార్షిక సమాచార ప్రకటన అనే డాక్యుమెంట్‌లో నమోదు చేస్తారు.
మీరు ఎక్కువ ఇంటి అద్దెను చూపించి, అద్దె రసీదును రూపొందించి, ఐటీఆర్ ఫైల్ చేస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దాని సమాచారం, AISలోని సమాచారం మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. ఆదాయపు పన్ను శాఖ అమలు చేస్తున్న AI టెక్నాలజీతో ఈ వ్యత్యాసాన్ని గుర్తించవచ్చు. అప్పుడు ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసులు జారీ చేస్తుంది.
రూ.1 లక్ష వరకు ఇంటి అద్దెకు మీరు యజమాని పాన్ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ కేసులో ఆదాయపు పన్ను శాఖ కూడా పత్రాలను సరిచూసుకునే పనికి వెళ్లడం లేదు. అయితే ఏడాదికి లక్ష రూపాయలకు మించి అద్దె చెల్లించినప్పుడే అది శాఖ దృష్టికి వస్తుంది. ఈ విషయాన్ని గుర్తించి.. ఫేక్ రెంట్ రసీదులను పెట్టుకుండా ఉండాలి.
టాపిక్