Ambani's Wedding : అతిథుల కోసం 3 ఫాల్కన్-2000 జెట్లను అద్దెకు తీసుకున్న అంబానీ-mukesh ambani hire 3 falcon 2000 jets to fly guests for anant ambani radhika merchant wedding ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ambani's Wedding : అతిథుల కోసం 3 ఫాల్కన్-2000 జెట్లను అద్దెకు తీసుకున్న అంబానీ

Ambani's Wedding : అతిథుల కోసం 3 ఫాల్కన్-2000 జెట్లను అద్దెకు తీసుకున్న అంబానీ

Anand Sai HT Telugu
Jul 11, 2024 12:07 PM IST

Anant Ambani-Radhika Merchant Wedding : అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే వచ్చే అతిథులకు ఎలాంటి లోటు లేకుండా ముకేశ్ అంబానీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా జెట్లు, విమానాలను అద్దెకు తీసుకుంటున్నారు.

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం గురించే ఇప్పుడుంతా చర్చ. దేశం మెుత్తం ఈ పెళ్లి వేడుక గురించి మాట్లాడుకుంటుంది. కోట్ల రూపాయలు ఈ పెళ్లి కోసం ఖర్చు పెడుతున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహానికి అతిథులను తీసుకెళ్లడానికి అంబానీ మూడు ఫాల్కన్-2000 జెట్లను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది.

వివాహ అతిథులను తీసుకెళ్లడానికి అంబానీలు తమ సంస్థకు చెందిన మూడు ఫాల్కన్ -2000 జెట్లను అద్దెకు తీసుకున్నారని, ఈ కార్యక్రమాలకు 100కు పైగా ప్రైవేట్ విమానాలను ఉపయోగించవచ్చని ఎయిర్ చార్టర్ కంపెనీ క్లబ్ వన్ ఎయిర్ సీఈఓ రాజన్ మెహ్రా చెప్పారు. అతిథులు నలుమూలల నుంచి వస్తున్నారని, ప్రతి విమానం దేశవ్యాప్తంగా పలు పర్యటనలు చేస్తుందని ఆయన అన్నారు.

ఈ వారాంతంలో ముంబైలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ముంబై సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లో ఉన్న బాంద్రా కుర్లా సెంటర్ (బికెసి)లోని జియో వరల్డ్ సెంటర్‌లో వెడ్డింగ్ జరగనుంది. సభాస్థలికి సమీపంలోని రహదారులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి జూలై 12:15 అర్ధరాత్రి వరకు ఈవెంట్ వెహికల్స్ కోసం మాత్రమే తెరిచి ఉంటాయి. అంటే ఇతరులకు అనుమతి ఉండదు. ఇప్పటికే ముంబైలోని ట్రాఫిక్ పోలీసులు మూడు రోజుల పాటు రోడ్డు ఆంక్షలపై సలహాను జారీ చేశారు.

వివాహ వేడుక జూలై 12 శుక్రవారం జరగనుండగా.. జూలై 14న గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఉంటుంది. ముంబైలోని అంబానీ 27 అంతస్తుల భవనం అంటిలియా వెలుపల చెట్లను సైతం అందంగా అలంకరించారు. గత కొన్ని నెలలుగా అనంత్, రాధికా పెళ్లికి సంబంధించిన చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. విలాసవంతమైన కార్యక్రమాలు, జామ్ నగర్ లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, ఆ తర్వాత యూరప్ లో లగ్జరీ క్రూయిజ్ లో నాలుగు రోజుల గాలా, గత రెండు వారాలుగా ముంబైలో వరుస కార్యక్రమాలతో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో జస్టిన్ బీబర్, రిహానా, కెట్టి పెర్రీ, బాయ్ బ్యాండ్ బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ వంటి గ్లోబల్ సెలబ్రిటీ అతిథుల కోసం ప్రదర్శనలు ఇచ్చారు.

జూలై 8న యాంటిలియాలో అనంత్, రాధికా హల్దీ వేడుకలను నిర్వహించారు. ఈ ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జూలై 12న అనంత్ రాధికా వివాహ వేడుక ఉంటుంది. ఈ రోజు వేడుకకు అతిథులు భారతీయ సంప్రదాయ దుస్తులను ధరించి రానున్నారు. జూలై 13న శుభ అశీర్వాద్ కార్యక్రమం ఉండనుంది. ఇక్కడ కూడా సంప్రదాయ దుస్తులు ధరించే వస్తారు. జూలై 14న మంగళ్ ఉత్సవ్ అంటే వివాహ రిసెప్షన్ ఘనంగా జరగనుంది.

Whats_app_banner

టాపిక్