Anant Ambani: సిల్క్ లెహెంగాలో అందరి గుండెలు దోచుకున్న అనంత్ అంబానీ వదిన, అందానికి కేరాఫ్ అడ్రస్-radhika merchants older sister stole everyones hearts in a silk lehenga in anant ambani marriage ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Anant Ambani: సిల్క్ లెహెంగాలో అందరి గుండెలు దోచుకున్న అనంత్ అంబానీ వదిన, అందానికి కేరాఫ్ అడ్రస్

Anant Ambani: సిల్క్ లెహెంగాలో అందరి గుండెలు దోచుకున్న అనంత్ అంబానీ వదిన, అందానికి కేరాఫ్ అడ్రస్

Haritha Chappa HT Telugu
Jul 09, 2024 04:30 PM IST

Anant Ambani: రాధికా మర్చంట్, అనంత్ అంబానీల వివాహ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. హల్దీ వేడుకలో రాధిక సోదరి అంజలి చాలా అందంగా కనిపించింది. తన లుక్ చూస్తే ఎవరైనా చూస్తూ అలా ఉండిపోవాల్సిందే.

అనంత్ - రాధిక హల్దీలో అంజలి
అనంత్ - రాధిక హల్దీలో అంజలి (instagram)

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లిలో ప్రతి క్షణం జీవితాంతం గుర్తుండిపోయేంత వేడుకలా సెలబ్రిటీలంతా భాగస్వాములవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ పెళ్లి ఫోటోలు వైరల్ గా అవుతున్నాయి. ఎంతో మంది సినీతారలు ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొని సందడి చేస్తున్నా కూడా వారి మధ్యలో ఒక సాధారణ అమ్మాయిపైనే అందరి దృష్టి పడింది. ఆమె అందం చూసే వారిని కట్టిపడేస్తోంది. ఆమె ఎవరో కాదు, రాధికా మర్చంట్ సోదరి అంజలి మర్చంట్. రాధికకు అక్క అంజలి. ఆమెకు నాలుగేళ్ల క్రితం పెళ్లయింది. ఆమె తన అందమైన సింపుల్ లుక్స్ తో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఇటీవల జరిగిన అనంత్ - రాధికా హల్దీ వేడుకలో అంజలి లుక్ చాలా హూందాగా కనిపిస్తోంది. అంజలి లుక్‌ను చూడటానికి రెండు కళ్లూ చాలడం లేదు. ఆమె సిల్క్ లెహెంగాలో ఎంతో అందంగా కనిపిస్తోంది.

రాయల్ ఫ్యాబ్రిక్ లెహెంగాలో

సిల్క్ లెహెంగాలో అంజలి ఎంతో చూడముచ్చటగా ఉంది. పట్టును రాయల్ ఫ్యాబ్రిక్ గా పరిగణిస్తారు. అంజలి తన హల్దీ లుక్ కోసం సిల్క్ లెహంగాను ఎంచుకుంది. లెహంగాను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ఆమె కలర్ ప్యాలెట్ పనిచేసింది. పింక్ లెహెంగాలో, ఊదా రంగు జాకెట్లో, పసుపు రంగు ఓణీలో చక్కగా ఉంది అంజలి. ఈ ప్రకాశవంతమైన రంగులలో అంజలి అందాన్ని మరింత హైలైట్ చేస్తోంది. ప్రకాశవంతమైన పింక్ లెహంగాకు భిన్నంగా, పర్పుల్ బ్లౌజ్, పసుపు దుపట్టాలు ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్ అవుతోంది. చక్కటి కలర్ కాంట్రాస్ట్ ఉన్న డ్రెస్ ఇది.

అంజలి లుక్‌ను నడుముకు పెట్టిన బెల్ట్ మరింత అందంగా మార్చింది. ఇది మొత్తం లుక్ కు ఫ్యాన్సీ, సొగసైన టచ్ ఇస్తోంది. బెల్ట్ చిన్న యాక్సెసరీ అయినా అది అంజలి మొత్తం లుక్‌ని మార్చేసింది. ఇక ఆభరణాల విషయానికి వస్తే… ఆమె చాలా తక్కువ జ్యూయలరీని ధరించింది. స్టేట్ మెంట్ నెక్లెస్ తో పాటూ, భారీ చెవిపోగులు, చేతికి సాధారణ బంగారు బ్రేస్ లెట్ లు, కొన్ని ఉంగరాలు ధరించింది. లెహంగాతో పాటూ ఈ ఆభరణాలు వేసుకోవడం వల్ల మొత్తం లుక్ రిచ్ గా మారిపోయింది.

హెయిర్ స్టైల్, మేకప్

అంజలి హెయిర్ స్టైల్, మేకప్ కూడా చాలా సింపుల్ గా ఉంది. అయినా కూడా చూసేందుకు మాత్రం ఎంతో అందంగా ఉంది అంజలి. ఈమె చాలా లైట్ మేకప్ ధరించింది. అంజలి మినిమమ్ అండ్ గ్లో మేకప్ లుక్ చక్కగా ఉంది. ఐలైనర్, మస్కారా ధరించింది. కళ్ల కింద మాత్రం ఎలాంటి కాటుకను ధరించలేదు. హైలైటర్, గులాబీ రంగు బ్లష్ ఆమెకు సహజమైన పింక్ చెంపలను ఇచ్చాయి. గ్లాసీ పింక్ లిప్ షేడ్, నుదుటిన చిన్న బొట్టుతో అంజలి చాలా క్యూట్ గా కనిపించింది. ఇక హెయిర్ స్టైల్ విషయానికొస్తే క్లాసిక్ పోనీనే అంజలి ఎంచుకుంది. దీని వల్ల ఆమె మరింత సింపుల్ గా కనిపిస్తోంది.

WhatsApp channel

టాపిక్