AP Govt : రూ. 2 వేల కోట్ల అప్పు...! వేలానికి ఏపీ ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లు-ap government has indented the debt of rs 2000 crore through security bonds auction ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt : రూ. 2 వేల కోట్ల అప్పు...! వేలానికి ఏపీ ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లు

AP Govt : రూ. 2 వేల కోట్ల అప్పు...! వేలానికి ఏపీ ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లు

HT Telugu Desk HT Telugu
Jun 22, 2024 03:58 PM IST

AP government News: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టింది. రూ.2,000 కోట్ల అప్పుకు ఏపీ ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది.

వేలానికి సెక్యూరిటీ బాండ్లు...!
వేలానికి సెక్యూరిటీ బాండ్లు...!

AP government: ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన కూటమి పార్టీలు, వాటిని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అందుకోసం భారీస్థాయిలో నిధులు అవసరం కానుంది. వాటిని సమకూర్చాల్సిన అవసరం ఉంది.‌ దీంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది.

ఈ నెల 25న వేలం….

అందులో భాగంగా ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ బాండ్లను కూటమి ప్రభుత్వం వేలానికి పెట్టింది. ఈ సెక్యూరిటీ బాండ్ల వేలం ఈనెల 25న జరగనుంది. భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఈ-కుబేర్) వేలం వేయనుంది. కాంపిటీటివ్, నాన్ కాంపిటీటివ్ బిడ్స్ రూపంలో ఆర్బీఐ వాటిని విక్రయిస్తుంది.

నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో రూ. 2,000 కోట్ల అప్పుకు రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. ఇందులో రూ.1,000 కోట్ల విలువ చేసే, రెండు సెక్యూరిటీ బాండ్లను ఏపీ ప్రభుత్వం వేలానికి పెట్టింది. ఈ అంశాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) ధృవీకరించింది.

ఈ బాండ్ల కాల పరిమితి నిర్ణయించింది. ఒక బాండు 11 ఏళ్లు, రెండో బాండు 20 ఏళ్లు కాల పరిమితి ఉంటాయి. వీటిని వ్యక్తులు, సంస్థలు కొనుగోలు చేయొచ్చు. కాంపిటీటివ్ విధానంలో బాండ్లను కొనదలిచిన వారు ఈనెల 25న ఉదయం 10:30 నుంచి 11:30 గంటల మధ్య బిడ్స్ ను దాఖలు చేయాల్సి ఉంటుంది.

ఏపీతో సహా మరో తొమ్మిది రాష్ట్రాలు తమ సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టాయి. ఇందులో తెలంగాణ-రూ. 1,000 కోట్లు, కేరళ-రూ.1,500 కోట్లు, తమిళనాడు-రూ.3,000 కోట్లు, పశ్చిమ బెంగాల్-రూ.3,500 కోట్లు, రాజస్థాన్-రూ.4,000 కోట్లు, హర్యానా-రూ.1,500 కోట్లు, జమ్మూకాశ్మీర్-రూ.500 కోట్లు, మిజోరాం-రూ.71 కోట్ల మేర విలువ చేసే సెక్యూరిటీ బాండ్లు ఉన్నాయి. మొత్తంగా తొమ్మిది రాష్ట్రాలు నుంచి రూ.17,071 కోట్లు విలువ చేసే సెక్యూరిటీ బాండ్లను రిజర్వ్ బ్యాంక్ ఈనెల 25న వేలం వేస్తుంది.

రిపోర్టింగ్ - జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner