Connected car technology : కారులో ఈ ఫీచర్ వాడుతున్నారా? ‘స్పై’ చేసి మరీ ప్రీమియం పెంచుతున్నారు!
17 March 2024, 11:27 IST
- Connected car technology disadvantages : ‘కనెక్టెడ్ కార్’ టెక్నాలజీతో.. ఇన్ష్యూరెన్స్ కంపెనీలు, మీకు తెలియకుండానే మిమ్మల్ని ట్రాక్ చేస్తున్నాయట! ఈ వార్త చాలా షాకింగ్‌గా ఉంది!
'కనెక్టెడ్ కార్'తో వాళ్లు మిమ్మల్ని స్పై చేస్తున్నారు..!
Connected car technology data breach : ఈ మధ్య కాలంలో కార్లు కూడా 'స్మార్ట్' అవుతున్నాయి. పోటీపడి మరీ.. వెహికిల్స్‌లో కొత్త కొత్త ఫీచర్స్‌ని తీసుకొస్తున్నాయి ఆటోమొబైల్ సంస్థలు. వీటిల్లో.. 'కనెక్టెడ్ కార్' టెక్నాలజీ ఒకటి. ఈ టెక్నాలజీతో కేబిన్‌లో కంఫర్ట్ పెరుగుతోంది. ఈ ఫీచర్ ఉందా? లేదా? అని చూసి మరీ కొనేవాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే.. ఈ కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో మన డేటాను దొంగిలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చే విధంగా.. న్యూయార్క్ టైమ్స్ సంస్థ ఓ నివేదికను బయటపెట్టింది. ఈ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ద్వారా.. బీమా కంపెనీలు డ్రైవర్లను స్పై చేస్తున్నాయని పేర్కొంది!
మీ మీద ఇన్ష్యూరెన్స్ సంస్థలు స్పై చేస్తున్నాయి..!
ఇన్ష్యూరెన్స్ కంపెనీలు.. కెనెక్టెడ్ కార్ ఫీచర్ ద్వారా మన డ్రైవింగ్ స్కిల్స్‌ని తెలుసుకుంటున్నాయని, ఫలితంగా మనం కట్టే ప్రీమియమ్స్పై దీని ప్రభావితం పడుతోందని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. 'లెక్సస్నెక్సస్' అనే డేటా బ్రోకర్ సంస్థ.. ఇన్షూరెన్స్ కంపెనీలకు డ్రైవింగ్ బిహేవియర్ డేటాను చెబుతోందని పేర్కొంది.
ప్రపంచంలో టెక్నాలజీ రోజురోజుకు మెరుగుపడుతుండటంతో.. వెహికిల్స్‌లో కనెక్టివిటీ పెరుగుతోంది. ఈ తరుణంలో.. ఇన్ష్యూరెన్స్ కంపెనీలు డ్రైవర్లను స్పై చేస్తున్నాయని వస్తున్న వార్తలు.. మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Insurance companies Connected car technology : నేటి తరం కార్లల్లో ఇంటర్నెట్ సర్వీసులు కచ్చితంగా ఉంటున్నాయి. ఇన్-కార్ యాప్స్‌తో పాటు రిమోట్ ఫంక్షన్స్, వైఫ్- హాట్‌స్పాట్ వరకు.. అనేక క్రేజీ ఫీచర్స్ వస్తున్నాయి. కానీ.. వీటితో కంఫర్ట్‌తో పాటు మనకి తెలియకుండానే మన డ్రైవింగ్ డేటా కార్ తయారీ కంపెనీలు, ఇన్ష్యూరెన్స్ కంపెనీలకు తెలిసిపోతుండటం కాస్త ఆలోచించాల్సిన విషయమే.
న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం.. జనరల్ మోటర్స్ వంటి దిగ్గజ సంస్థలే.. తమ కస్టమర్ల డ్రైవింగ్ బిహేవియర్‌కి సంబంధించిన డేటాను.. లెక్సస్నెక్సస్ వంటి కంపెనీలతో పంచుకుంటున్నాయి. ఈ లెక్సస్నెక్సస్ వంటి కంపెనీలు.. ఆ డేటాను ఇన్ష్యూరెన్స్ సంస్థలకు అమ్ముకుంటున్నాయి. ఓ సందర్భంలో.. ఓ వ్యక్తి డ్రైవింగ్ డేటా ఇన్ష్యూరెన్స్ కంపెనీకి లీక్ అవడంతో.. తన చెవర్లెట్ బోల్ట్ ఈవీపై సదరు వ్యక్తి కట్టాల్సిన ప్రీమియం 21శాతం పెరిగింది! ఆటోమొబైల్ సంస్థలు.. కస్టమర్ల డేటాను, వారికి చెప్పకుండా, తెలియకుండానే కలెక్ట్ చేస్తున్నాయి. ఇది.. ప్రత్యక్షంగానే డేటా బ్రీచ్!
Connected car technology : స్మార్ట్‌ఫోన్స్, ఇతర వ్యక్తిగత డివైజ్‌లలో కనిపించే ప్రైవసీ సమస్యలే.. ఈ కనెక్టెడ్ కార్ టెక్నాలజీతోనూ ఉత్పన్నమవుతోంది. టర్మ్స్ అండ్ కండీషన్లను చదవకుండా.. ప్రజలు చాలా యాప్స్‌ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఆయా కంపెనీలు.. ఆ డేటాను అమ్మేసుకుంటున్నాయి. ఈ టెక్ యుగంలో.. 'డేటా ఈజ్ పవర్.' డేటా ఎవరి దగ్గర ఉంటుందో.. వారే కింగ్! కానీ ఇది కస్టమర్ల భద్రతకు చాలా సవాళ్లు విసురుతోంది. ప్రైవసీ మాటకు అర్థమే లేకుండా పోతోందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.