Best deals on MG cars: ఎంజీ కార్లపై ఇయర్ ఎండ్ ఆఫర్; హెక్టర్, గ్లోస్టర్, ఆస్టర్ లపై కళ్లు చెదిరే డీల్స్
18 December 2024, 20:24 IST
Best deals on MG cars: 2024 ఇయర్ ఎండ్ సందర్భంగా ఎంజీ మోటార్స్ తన లైనప్ లోని పలు కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్స్ ను ప్రకటించింది. ఈ సంవత్సరాంత డీల్స్ ద్వారా కస్టమర్లు ఏకంగా రూ .5.50 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు.
ఎంజీ కార్లపై ఇయర్ ఎండ్ ఆఫర్
Best deals on MG cars: జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన లైనప్ లోని పలు వాహనాలపై ఇయర్ ఎండ్ బెనిఫిట్స్ ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రయోజనాలు ఎంజీ గ్లోస్టర్, ఎంజీ హెక్టర్, ఎంజీ ఆస్టర్ లపై మాత్రమే ఉన్నాయి. రాష్ట్రం, డీలర్ షిప్ ను బట్టి ప్రయోజనాలు మారుతుంటాయని గమనించడం ముఖ్యం. కాబట్టి, మీరు ప్రయోజనాల గురించి మరింత సమాచారం కావాలంటే, మీ సమీప ఎంజీ మోటార్ (mg motor) డీలర్ షిప్ ను సంప్రదించడం మంచిది, ఎందుకంటే వారే పూర్తి వివరాలను ఇవ్వగలరు.
ఎంజీ హెక్టార్ పై..
ఇయర్ ఎండ్ (YEAR END 2024) ఆఫర్ లో భాగంగా ఎంజీ హెక్టార్ పై రూ.2.70 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. హెక్టర్ ధర రూ .13.99 లక్షల నుండి ప్రారంభమై రూ .22.57 లక్షల వరకు ఉంటుంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. ఇది స్టైల్, షైన్ ప్రో, సెలెక్ట్ ప్రో, స్మార్ట్ ప్రో, షార్ప్ ప్రో. సావి ప్రో అనే ఆరు వేరియంట్లలో లభిస్తుంది. వేరియంట్ ను బట్టి ప్రయోజనాలు మారుతుంటాయి.
హెక్టర్ స్పెక్స్ అండ్ ఫీచర్స్: హెక్టర్ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 2.0-లీటర్ డీజల్ ఇంజన్ తో లభిస్తుంది. టర్బో పెట్రోల్ ఇంజన్ 140 బిహెచ్ పి పవర్, 250ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో జతచేయబడి ఉంటుంది. ఎంజీ హెక్టర్ (MG Hector) డీజల్ ఇంజన్ 168బిహెచ్ పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను మాత్రమే పొందుతుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లేదు.
ఎంజీ గ్లోస్టర్ పై..
ఎంజీ మోటార్స్ లో గ్లోస్టర్ ప్రస్తుతం బ్రాండ్ ఫ్లాగ్ షిప్ ఎస్ యూవీగా ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ .38.80 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఈ ఎస్యూవీ (SUV) పై ప్రస్తుతం రూ .5.50 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఎంజి గ్లోస్టర్ (MG Gloster) ను షార్ప్, సావి అనే రెండు వేరియంట్లతో ఎంజీ మోటార్స్ అందిస్తుంది. గ్లోస్టర్ 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. ఇది 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడి ఉంటుంది. స్నో, మడ్, శాండ్, ఎకో, స్పోర్ట్, ఆటో, రాక్ అనే ఏడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.
ఎంజీ ఆస్టర్ పై..
చివరగా, ఎంజీ ఆస్టర్ పై 2.70 లక్షల వరకు బెనిఫిట్స్ పొందొచ్చు. ఎంజీ ఆస్టర్ క్రాసోవర్ ధర రూ .9.99 లక్షల నుండి ప్రారంభమై రూ .18.08 లక్షల వరకు ఉంటుంది. రెండు ధరలు ఎక్స్-షోరూమ్. స్ప్రింట్, షైన్, సెలెక్ట్, షార్ప్ ప్రో, సావీ ప్రో అనే ఐదు వేరియంట్లలో ఆస్టర్ (MG Astor) అందుబాటులో ఉంది. ఇందులో 1.3-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ యూనిట్ అనే రెండు ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. టర్బో పెట్రోల్ ఇంజిన్ కేవలం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. అయితే న్యాచురల్ ఆస్పిరేటెడ్ యూనిట్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్ ను పొందుతుంది.