MG Hector Plus : ఈ బెస్ట్ సెల్లింగ్ 7 సీటర్ ఎస్‌యూవీలో 2 కొత్త వేరియంట్లు- ధర, ఫీచర్స్ చెక్ చేయండి..
MG Hector Plus price : జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఎస్యూవీ 7 సీట్ల వర్షెన్ హెక్టర్ ప్లస్‌లో రెండు కొత్త వేరియంట్లు చేరాయి. వాటి ధరలు, ఫీచర్స్, ఇంజిన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ 7 సీటర్ ఎస్‌యూవీల్లో ఎంజీ మోటార్ హెక్టర్ ప్లస్ ఒకటి. ఇప్పుడు ఈ పాప్యులర్ ఎస్‌యూవీలో రెండు కొత్త వేరియంట్లను తీసుకొచ్చింది జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్. అవి.. సెలెక్ట్ ప్రో, స్మార్ట్ ప్రో. వీటి ధర రూ .19.71 లక్షల(ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. ఈ రెండు కొత్త వేరియంట్ల చేరికతో, హెక్టర్ ప్లస్ ఇప్పుడు స్నోస్టార్మ్, బ్లాక్‌స్టార్మ్ వంటి ప్రత్యేక ఎడిషన్లతో సహా దాదాపు 30 విభిన్న వేరియంట్లను కలిగి ఉంది!
ఎంజీ హెక్టర్ ప్లస్ ఎస్యూవీ ప్రారంభ ధర రూ .17.50 లక్షలు (ఎక్స్-షోరూమ్). మహీంద్రా ఎక్స్ యూవీ 700, టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కాజర్ వంటి మోడళ్లకు ఈ ఎస్యూవీ గట్టి పోటీనిస్తుంది.
ఎంజీ హెక్టర్ ప్లస్: కొత్త పెట్రోల్ వేరియంట్..
హెక్టర్ ప్లస్ ఎస్యూవీ 1.5-లీటర్ 7 సీటర్ వర్షెన్కు రెండు కొత్త వేరియంట్లలో సెలెక్ట్ ప్రో యాడ్ అయ్యింది. ఈ వేరియంట్ ఇప్పుడు సీవీటీ గేర్‌బాక్స్‌కు కనెక్ట్ చేసిన టర్బోఛార్జ్డ్ ఇంజిన్‌ను అందిస్తుంది. ఇంతకుముందు ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ యూనిట్‌తో వచ్చింది. దీని ధర రూ .18.48 లక్షలు (ఎక్స్-షోరూమ్), కొత్త వేరియంట్ కంటే రూ .1 లక్షకు పైగా తక్కువ!
ఎంజీ హెక్టర్ ప్లస్: కొత్త డీజిల్ వేరియంట్..
హెక్టర్ ప్లస్ లైనప్‌లో రెండవ కొత్త వేరియంట్ స్మార్ట్ ప్రో! రూ .20.64 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన ఈ కొత్త వేరియంట్ గతంలో ఆరు సీట్లను ఆఫర్ చేయగా, ఇప్పుడు ఏడు సీట్లను ఆప్షన్‌గా ఇస్తోంది. ఆరు సీట్ల ఆప్షన్లతో ఉన్న అదే వేరియంట్ ధర రూ .21.53 లక్షలు (ఎక్స్-షోరూమ్), కొత్త వేరియంట్ కంటే సుమారు రూ .1 లక్ష ఎక్కువ.
హెక్టర్ ప్లస్ కొత్త వేరియంట్లు: ఫీచర్లు, ఇంజిన్ వివరాలు..
ఎంజీ మోటార్ కొత్త వేరియంట్లలో హెక్టర్ ప్లస్ ఎస్యూవీ ఫీచర్ లిస్ట్ లేదా మరే ఇతర స్పెసిఫికేషన్ మారలేదు. రెండు వేరియంట్లలో 18 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్, 14 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, ఫుల్ ఎల్ఈడీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, వైర్ లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను ఈ ఎస్యూవీ అందిస్తోంది.
హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 141 బీహెచ్పీ పవర్, 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ వేరియంట్లు 2.0-లీటర్ యూనిట్‌తో 168 బీహెచ్పీ పవర్, 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.
మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని డీలర్షిప్ షోరూమ్‌ని సందర్శించండి.
సంబంధిత కథనం