Xiaomi Mix Fold 3 : షావోమీ మిక్స్ ఫోల్డ్ 3 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే!
15 August 2023, 9:41 IST
- Xiaomi Mix Fold 3 : షావోమీ నుంచి మిక్స్ ఫోల్డ్ 3 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
షావోమీ మిక్స్ ఫోల్డ్ 3 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే!
Xiaomi Mix Fold 3 launch : షావోమీ నుంచి థర్డ్ జనరేషన్ ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ అయ్యింది. దీని పేరు షావోమీ మిక్స్ ఫోల్డ్ 3. ఈ గ్యాడ్జెట్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఈ ఫోల్డెబుల్ ఫోన్ ఫీచర్స్ ఇవే..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8.03 ఇంచ్ మెయిన్ ఫోల్డెబుల్ స్క్రీన్ ఉంటుంది. యూటీజీ ప్రొటెక్షన్‌తో కూడిన 2కే రిసొల్యూషన్కు ఇది సపోర్ట్ చేస్తుంది. 6.56 ఇంచ్ ఫుల్హెచ్డీ ప్లస్ కార్నరింగ్ గొరిల్లా గ్లాస్ స్క్రీన్ కూడా ఇందులో ఉంటుంది. రెండింటికీ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, డాల్బి విజన్ వంటివి వస్తున్నాయి. వీటిల్లో డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఫోల్డ్ సాఫ్ట్‌వేర్‌పై ఈ గ్యాడ్జెట్ పనిచేస్తుంది. చైనాలోని టాప్ 200 యాప్స్.. ఈ డివైజ్‌లో ఇన్‌బిల్ట్‌గా వస్తున్నట్టు సంస్థ చెబుతోంది.
ఈ షావోమీ మిక్స్ ఫోల్డ్ 3లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ఉంటుంది. 4,800ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ వయర్డ్ ఛార్జింగ్, 50వాట్ వయర్లెస్ ఛార్జింగ్ కెపాసిటీ దీని సొంతం. ఇక కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఈ ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్ రేర్‌లో 50ఎంపీ+12ఎంపీ+10ఎంపీ లెన్స్‌లు ఉంటాయి. ఇక సెల్ఫీల కోసం 20ఎంపీ కెమెరా సెటప్ ఉంటుంది.
ఇదీ చూడండి:- గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, ఫ్లిప్ 5పై శామ్సంగ్ భారీ ఆశలు..!
ఈ గ్యాడ్జెట్ ధరల వివరాలివే..
Xiaomi Mix Fold 3 price in India : షావోమీ మిక్స్ ఫోల్డ్ 3.. మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వాటి ధరల వివరాలు ఇప్పుడు చూద్దాము..
12జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్ ధర రూ. 8,999 యెన్ (సుమారు రూ. 1.03లక్షలు)
16జీబీ ర్యామ్- 512 జీబీ స్టోరేజ్ ధర రూ. 9999 యెన్ (సుమారు రూ. 1.14లక్షలు)
16జీబీ ర్యామ్- 1టీబీ స్టోరేజ్ ధర రూ. 10,999 యెన్ (సుమారు రూ. 1.26లక్షలు)
Xiaomi Mix Fold 3 smartphone features : ఈ మొబైల్స్ బ్లాక్, గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంటాయి. కాగా.. ఈ ఫోల్డెబుల్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు చైనాలో మొదలయ్యాయి. బుధవారం స్థానికంగా ఇది సేల్కు వెళ్లనుంది.
ఈ మోడల్.. ఇండియాలో లాంచ్ అవుతుందా? ఎప్పుడు లాంచ్ అవుతుంది? ధర ఎంత ఉంటుంది? వంటి వివరాలపై సంస్థ క్లారిటీ ఇవ్వలేదు.