తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Xiaomi 12 Pro: అత్యంత తక్కువ ధరకే షావోమి 12 ప్రొ; ఫస్ట్ టైమ్ 46 శాతం డిస్కౌంట్

Xiaomi 12 Pro: అత్యంత తక్కువ ధరకే షావోమి 12 ప్రొ; ఫస్ట్ టైమ్ 46 శాతం డిస్కౌంట్

HT Telugu Desk HT Telugu

10 June 2023, 19:12 IST

  • షావోమి నుంచి వచ్చిన ఫ్లాగ్ షిప్ ప్రీమియం 5 జీ స్మార్ట్ ఫోన్ షావోమి 12 ప్రొ ఇప్పుడు అత్యంత తక్కువ ధరకే లభిస్తుంది. అందుబాటు ధరలో ప్రీమియం ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆఫర్.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT Tech)

ప్రతీకాత్మక చిత్రం

షావోమి నుంచి వచ్చిన ఫ్లాగ్ షిప్ ప్రీమియం 5 జీ స్మార్ట్ ఫోన్ షావోమి 12 ప్రొ (Xiaomi 12 Pro) ఇప్పుడు అత్యంత తక్కువ ధరకే లభిస్తుంది. అందుబాటు ధరలో ప్రీమియం ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆఫర్.

ట్రెండింగ్ వార్తలు

Nikhil Kamath: ‘అందానికి ముంబై ఫేమస్.. బిర్యానీకి హైదరాబాద్ ఫేమస్.. కానీ, నాకు బెంగళూరే ఇష్టం’: నిఖిల్ కామత్

US layoffs: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు యూఎస్సీఐఎస్ మార్గదర్శకాలు; యూఎస్ లో ఉండేందుకు ఈ మార్గాలున్నాయి..

SBI FD rate hike: ఫిక్స్డ్ డిపాజిట్ లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ

Go Digit IPO: విరాట్ కోహ్లీ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఐపీఓకు అనూహ్య స్పందన; కొన్ని గంటల్లోనే ఫుల్ సబ్ స్క్రిప్షన్

ఫ్లిప్ కార్ట్ సేల్..

ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో సేవింగ్స్ డేస్ సేల్ లో షావోమి 12 ప్రొ (Xiaomi 12 Pro) 46% డిస్కౌంట్ ధరకు లభిస్తోంది. ఈ సేల్ లో షావోమి 12 ప్రొ (Xiaomi 12 Pro) ఫోన్ పైననే కాకుండా, పలు ఇతర ప్రీమియం స్మార్ట్ ఫోన్స్, బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ఆకర్షణీయమైన డిస్కౌంట్ లో లభిస్తున్నాయి. షావోమి 12 ప్రొ అన్ని ప్రీమియం ఫీచర్స్ తో రూపొందించిన స్మార్ట్ ఫోన్. ఇది 5 జీ నెట్ వర్క్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ తో లభించే షావోమి 12 ప్రొ 5జీ ఫోన్ అసలు ధర రూ. 79999. కాగా, ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ సేల్ లో అది 46% డిస్కౌంట్ తో రూ. 42499 లకే లభిస్తుంది. అంతేకాదు, బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ తో ఈ ధర మరింత తగ్గుతుంది.

క్యాష్ డిస్కౌంట్స్..

ఫ్లిప్ కార్ట్ సేల్ లో షావోమి 12 ప్రొ 5జీ ఫోన్ డిస్కౌంట్ ధర రూ. 42499. ఒకవేళ మీరు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కానీ, కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కానీ కొనుగోలు చేస్తే తక్షణమే రూ. 1000 తగ్గింపు లభిస్తుంది. ఇదికాకుండా, ఒకవేళ మీరు వర్కింగ్ కండిషన్ లో ఉన్న మీ పాత ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేయాలనుకుంటే, ఈ ధర మరింత తగ్గుతుంది. షావోమి 12 ప్రొ 5జీ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ సెట్ అమర్చారు. అలాగే, ఇందులో 120 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్ తో 6.72 అంగుళాల అమొలెడ్ డిస్ ప్లే, 50 ఎంపీ, 32 ఎంపీ, 8 ఎంపీలతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.

తదుపరి వ్యాసం