తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Twitter Subscription Plans : ట్విట్టర్​లో కొత్త సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్​.. ధరలు ఎంతంటే!

Twitter subscription plans : ట్విట్టర్​లో కొత్త సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్​.. ధరలు ఎంతంటే!

Sharath Chitturi HT Telugu

28 October 2023, 13:01 IST

google News
    • Twitter subscription plans : ట్విట్టర్​ (ఎక్స్​)లో రెండు కొత్త సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్​ వచ్చాయి. వాటి ఫీచర్స్​, ధరల వివరాలు ఇలా ఉన్నాయి..
కొత్త సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్​ తీసుకొచ్చిన ట్విట్టర్​..
కొత్త సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్​ తీసుకొచ్చిన ట్విట్టర్​.. (REUTERS)

కొత్త సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్​ తీసుకొచ్చిన ట్విట్టర్​..

Twitter subscription plans : ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్​ (ట్విట్టర్​).. కొత్తగా రెండు సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్​ తీసుకొచ్చింది. వీటి పేర్లు ప్రీమియం+, బేసిక్​. వీటితో.. సంస్థ రెవెన్యూ ఊపందుకుంటుందని ట్విట్టర్​ భావిస్తోంది. ఈ రెండు ప్లాన్స్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

రెండు కొత్త సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్​..

ఈ రెండింటి కన్నా ముందు.. ట్విట్టర్​కు ఎక్స్​ ప్రీయమం ప్లాన్​ ఉంది. ఇది కొన్న వారికి.. బ్లూ చెక్​మార్క్​, రిప్లైలలో ప్రయారిటీ ర్యాంకింగ్​, బుక్​మార్క్​ ఫోల్డర్స్​, టెక్స్ట్​ ఫార్మాటింగ్​, లాంగర్​ పోస్ట్స్​, వివిధ థీమ్స్​, ఎస్​ఎంఎస్​ 2 ఫ్యాక్టర్​ ఆథెంటిఫికేషన్​, ఎన్​క్రిప్ట్​టెడ్​ డీఎంలు వస్తాయి.

X subscription plans news : ఇక కొత్తగా వచ్చిన ప్రీమియం+ ప్లాన్​లో 'ఫర్​ యూ', 'ఫాలోయింగ్​' సెక్షన్స్​లో యాడ్స్​ కనిపించవు. అంతేకాకుండా లార్జ్​ రిప్లై బూస్ట్​ కూడా వస్తుంది. సబ్​స్క్రైబర్స్​కి రెవెన్యూ షేరింగ్​ వంటివి దక్కుతాయి.

ఇక బేసిక్​ ప్లాన్​లో పోస్ట్​ ఎడిటింగ్​, లాంగర్​ టెక్స్ట్​, వీడియో పోస్ట్​, స్మాల్​ రిప్లై బూస్ట్​ వంటివి దక్కుతాయి. కానీ ఇందులో బ్లూ చెక్​మార్క్​, రెవెన్యూ షేరింగ్​ వంటివి ఉండవు.

వీటి ధరలు ఎంతంటే..

ఎక్స్​ ప్రీమియం+ ధర నెలకు 16 డాలర్లు, ఏడాదికి 168డాలర్లు. అంటే నెలకు సుమారు రూ. 1,334- రూ. 14,000. బేసిక్​ ప్లాన్​ ధర నెలకు 3 డాలర్లు, ఏడాదికి 32 డాలర్లు. అంటే సుమారు రూ. 250- రూ. 2,670.

Twitter latest news : ఎక్స్​ ప్రీమియం ప్లాన్​ ధర నెలకు 8 డాలర్లు, ఏడాదికి 84 డాలర్లుగా ఉంది. అంటే.. సుమారు రూ. 670- రూ. 7వేలు.

ట్విట్టర్​ను కొన్నప్పటి నుంచి సామాజిక మాధ్యమ ప్లాట్​ఫామ్​లో భారీ మార్పులే చేశారు అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​. తాజాగా సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​లు తీసుకొచ్చారు. ఇవి సంస్థ రెవెన్యూను పెంచుతాయని ఆయన ఆశిస్తున్నారు.

తదుపరి వ్యాసం