Elon Musk Twitter : ట్విట్టర్ వాడాలంటే.. ఇక ప్రతి ఒక్కరు డబ్బులు చెల్లించాల్సిందే!
Elon Musk Twitter : ట్విట్టర్లో ఒక్క పోస్టు చేసినా.. డబ్బులు కట్టాల్సిందే! ఈ విధంగా చర్యలు చేపట్టేందుకు ఎలాన్ మస్క్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
Elon Musk Twitter : గత కొంతకాలంగా ట్విట్టర్లో భారీ మార్పులు తీసుకొస్తున్నారు అపరకుబేరుడు, సామాజిక మాధ్యమం ఓనర్ ఎలాన్ మస్క్. ట్విట్టర్ పేరును కూడా 'ఎక్స్'గా మార్చేశారు. ఇక ఇప్పుడు.. మరో భారీ మార్పునకు ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాన్ మస్క్.. ఇటీవలే చేసిన వ్యాఖ్యలు నిజమే అయితే.. ఎక్స్‌ను వాడేందుకు ఇక ప్రతి యూజర్ కూడా డబ్బులు చెల్లించాల్సిందే!
నెలనెలా డబ్బులు కట్టాలి..!
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూతో తాజాగా చర్చలు జరిపారు ఎలాన్ మస్క్. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇద్దరు పలు కీలక విషయాలపై మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే.. ట్విట్టర్‌ను ఉపయోగించుకోవాలంటే.. నెలనెలా కొద్ది మొత్తంలో డబ్బులను చెల్లించే విధంగా మార్పులు చేయాలని ఆలోచిస్తున్నట్టు ఎలాన్ మస్క్ తెలిపారు. ఎక్స్‌లో ఉన్న బాట్స్ సమస్యకు ఇది చక్కటి పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.
Elon Musk X : అయితే.. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ప్రతి నెల ఎంత చెల్లించాలి? అన్న వివరాలను ట్విట్టర్, టెస్లా, స్పేస్ఎక్స్ బాస్ వెల్లడించలేదు. కానీ.. ఇది చాలా తక్కువ మొత్తంలోనే ఉంటుందని వ్యాఖ్యానించారు.
మస్క్ ప్రకారం.. ఎక్స్‌లో బాట్స్ అనేవి చాలా పెద్ద సమస్యగా మారాయి. నెలవారీ పేమెంట్ ప్రక్రియతో వాటిని తగ్గించుకోవచ్చు. అయితే.. ఇలా యూజర్ల నుంచి డబ్బులు ఛార్జ్ చేయడం అనేది ట్విట్టర్‌కు కొత్త ఆలోచనేమీ కాదు. గతేడాదే.. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ ప్రస్తావించారు.
ప్రస్తుతం ఎక్స్‌కు ప్రతినెలా 550 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. రోజువారీగా 100-200 మిలియన్ పోస్టులు తయారవుతున్నాయి. ఎలాన్ మస్క్ చెప్పినట్టు.. 'కొంత మొత్తమే' ఛార్జ్ చేసినా.. ఎక్స్‌కు అది భారీ లాభాలను తెచ్చిపెడుతుందని అనడంలో డౌట్ లేదు.
రెవెన్యూ డౌన్.. మరి ఎలా?
Elon Musk latest news : గత కొన్నేళ్లుగా ట్విట్టర్ ఆదాయం పడిపోతోంది. యాడ్ సేల్స్ అయితే ఏకంగా 50శాతం డౌన్ అయినట్టు మస్క్ స్వయంగా తెలిపారు. ఈ నేపథ్యంలో.. సబ్స్క్రిప్షన్ ఆధారిత సిస్టెమ్‌ను తీసుకొస్తే.. సంస్థ ఆదాయం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎక్స్‌కు ప్రస్తుతం.. ఎక్స్ బ్లూ ప్రోగ్రామ్ ఉంది. దీనికి నెలవారీగా రూ. 900 కట్టాలి. వీటి నుంచి సంస్థ ఆదాయం పొందుతోంది.
సంబంధిత కథనం