తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Price Diesel Price : త్వరలోనే పెట్రోల్​- డీజిల్​ ధరలు పెంపు!

Price diesel price : త్వరలోనే పెట్రోల్​- డీజిల్​ ధరలు పెంపు!

Sharath Chitturi HT Telugu

03 June 2024, 10:16 IST

google News
    • Petrol price hike : పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరుగుతాయా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..
త్వరలోనే పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరుగాతాయా?
త్వరలోనే పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరుగాతాయా? (HT_PRINT)

త్వరలోనే పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరుగాతాయా?

Petrol Diesel price hike : 2024 లోక్​సభ ఎన్నికల పోలింగ్​ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. ఎన్నిల ఫలితాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత ప్రజలపై భారీ పిడుగు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి! ఎన్నికల కారణంగా గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్న నిత్యావసర ధరలు రానున్న రోజుల్లో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. పెట్రోల్​- డీజిల్​ విషయంలో ప్రజలు షాక్​ తగలొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

పెట్రోల్​- డీజిల్​ ధరలు పెరుగుతాయా?

లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్​, డీజిల్​ ధరలను ఈ ఏడాది మార్చ్​లో తగ్గించింది ప్రభుత్వం. లీటరుకు రూ. 2 తగ్గింపు ఇచ్చింది. సవరించిన ధరలు మార్చ్​ 15 నుంచి అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి పెట్రోల్​ ధరలు, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించేందుకు ఈ చర్యలు తీసుకున్నారని, మోదీ ప్రభుత్వంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఏది ఏమైనా.. ప్రజలపై కాస్త భారం తగ్గినట్టు అయ్యింది.

Petrol price hike : కానీ మంగళవారంతో లోక్​సభ ఎన్నికల ప్రక్రియ పూర్తి అవ్వనుండటంతో.. ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఇప్పటికప్పుడు పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరగకపోవచ్చని, కానీ నిదానంగా ఎప్పుడైనా పెరుగుతాయని సమాచారం. పెంపు మాత్రం కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తత కారణంగా అంతర్జాతీయ ముడిచెమరు ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పైగా.. 2025లో కూడా చమురు ఔట్​పుట్​ని కట్​ చేయాలని ఒపెక్​+ దేశాలు నిర్ణయించాయి. ఫలితంగా.. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.

ఇక ఇండియా విషయానికొస్తే.. పెట్రోల్​, డీజిల్​ ధరల తగ్గింపు ప్రభావం పంప్​ ఓనర్స్​పై భారీగా పడినట్టు తెలుస్తోంది. పాత సరకును తక్కువ ధరకు అమ్మాల్సి వచ్చింది. అందుకే.. పెట్రోల్​, డీజిల్​ ధరలు పెంపు తమకు మంచి పరిణామం అని అంటున్నారు.

Diesel price hike : పెట్రోల్​, డీజిల్​ ధరలు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా పలు ఇతర విషయాల్లో కూడా వినియోగదారులపై భారం పెరిగే అవకాశం ఉంది. టారీఫ్​ హైక్​ కోసం టెలికాం సంస్థలు రెడీ అవుతున్నాయి. అమూల్​ సంస్థ.. తమ పాల ప్యాకెట్​ ధరలను తాజాగా పెంచింది.

టోల్​ ఛార్జీలు కూడా పెరిగాయి..!

Toll charges hike : ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని టోల్ ఛార్జీల పెంపు వాయిదా వేసిన కేంద్రం... జూన్ 3 నుంచి ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ ఛార్జీలు పెరిగాయి. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు పెంచుతున్నట్లు...నిర్వహణ సంస్థ ఐఆర్బీ ప్రకటించింది.

జూన్ 3 నుంచి ఓఆర్ఆర్ పై టోల్ రుసుములు 2024-25 టోల్ నిబంధనల ప్రకారం పెంచుతున్నట్లు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఏటా ఏప్రిల్ 1న టోల్ రుసుములు మార్పులు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది ఎన్నికల కోడ్ కారణంగా టోల్ పెంపు వాయిదా పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం