Petrol price in Hyderabad : తగ్గిన పెట్రోల్/ డీజిల్ ధరలు- హైదరాబాద్, విజయవాడల్లో తాజా రేట్లు ఇలా..
- Petrol price in Hyderabad today : 2024 లోక్సభ ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలను రూ. 2 తగ్గించింది కేంద్రం. తాజా ధరలు శుక్రవారం ఉదయం 6 గంటలకు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్, విజయవాడతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

(1 / 5)
హైదరాబాద్లో పెట్రోల్/ డీజిల్ ధరలు శుక్రవారం రూ. 2.25 తగ్గాయి. లీటర్ పెట్రోల్ ధర రూ. 107.41గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ. 2.17 తగ్గి రూ. 95.65గా ఉంది.(HT_PRINT)
(2 / 5)
ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధర తగ్గింది. విజయవాడలో లీటరు రూ. 2.49 తగ్గి రూ. 109.31కి చేరింది. ఇక లీటరు డీజిల్ ధర రూ. 2.34 తగ్గి రూ. 97.15కి చేరింది.
(3 / 5)
నెల్లూరులో లీటరు పెట్రోల్ ధర రూ. 110.06గా ఉంది. పశ్చిమ గోదావరిలో ఇది రూ. 109.89గా కొనసాగుతోంది. ఈ ప్రాంతాల్లో లీటరు డీజిల్ ధర వరుసగా.. రూ. 97.82, రూ. 97.69గా ఉన్నాయి.
(4 / 5)
ఇక తెలంగాణలోని వరంగల్లో లీటరు పెట్రోల్ ధర రూ. 106.99గాను, యాదాద్రి భువనగిరిలో రూ. 107.49గాను ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో లీటరు డీజిల్ ధర వరుసగా.. రూ. 95.25, రూ. 95.69గా కొనసాగుతున్నాయి. సూర్యాపేటలో లీటరు పెట్రోల్ ధర రూ. 107.17గాను, నల్గొండలో రూ. 107.54గాను ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో లీటరు డీజిల్ ధరలు.. రూ. 95.40, రూ. 95.76గా ఉన్నాయి.
ఇతర గ్యాలరీలు