When to change car battery : మీ కారు బ్యాటరీని ఎప్పుడు మార్చాలి? సంకేతాలివే..
10 April 2023, 7:24 IST
- When to change car battery : మీ కారు బ్యాటరీ పనైపోయిందా? ఎలా తెలుసుకోవాలో మీకు అర్థం కావడం లేదా? మీ కారు బ్యాటరీని ఎప్పుడు మార్చాలి? అన్న విషయం తెలుసుకోవాలంటే.. ఈ సంకేతాలు మీకు తెలియాలి..
మీ కారు బ్యాటరీని ఎప్పుడు మార్చాలి? సంకేతాలివే..
When to change car battery : కారుకు ఇంజిన్ ఎంత ముఖ్యమో.. బ్యాటరీ కూడా అంతే కీలకం. ఇప్పుడు వస్తున్న కొత్త కార్లలో బ్యాటరీ ప్రాముఖ్యత మరింత పెరిగింది. అలాంటి బ్యాటరీ హెల్త్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. అందుకోసం కాస్త టైమ్ కేటాయించాలి. సాధారణంగా.. కారు బ్యాటరీ 3-4ఏళ్ల వరకు పనిచేస్తుంది. అయితే.. వేడి, అతి వినియోగం వంటి కారణాలతో బ్యాటరీ లైఫ్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. వీటిని చెక్ చేస్తూ ఉండాలి. లేకపోతే.. సరిగ్గా కావాల్సిన టైమ్‌లో బండి హ్యాండ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో.. అసలు కారు బ్యాటరీ ఎప్పుడు మార్చాలి? సంకేతాలేంటి? అన్నవి ఇక్కడ తెలుసుకుందాము..
కీ టర్న్ చేసినా స్పందన లేకపోవడం..
How to change car battery in telugu : సాధారణంగా కీ ఆన్ చేసినప్పుడు కారు ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. అయితే.. కీ తిప్పినా, ఎలాంటి స్పందన లేకపోతే.. కారు బ్యాటరీ అయిపోయిందని భావించవచ్చు. అందుకు అదనంగా.. డాష్‌బోర్డ్‌లో ఎలాంటి వార్నింగ్ సిగ్నల్స్ కూడా రాకపోతే.. కారు బ్యాటరీ అయిపోయినట్టు, దానిని మార్చాల్సిన సమయం వచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు.
మోటార్‌పై ఫోకస్ చేయండి..
కీ పెట్టి తిప్పినప్పుడు.. మోటార్ ఎక్కువ సేపు స్టార్ట్ అవ్వకపోతే కారు బ్యాటరీ పనైపోయినట్టు! వెంటనే దానిని మార్చాల్సి ఉంటుంది. ఈ సమస్య.. 2 వీలర్స్‌లోనూ గమనించవచ్చు.
బ్యాటరీ/ ఛార్జింగ్ సిస్టెమ్ వార్నింగ్ లైట్స్..
ఇప్పుడు అనేక కార్లలో బ్యాటరీ, ఛార్జింగ్ సిస్టెమ్కు సంబంధించి సిగ్నల్స్ వస్తున్నాయి. మీ కారులో కూడా ఆ సిగ్నల్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. అలాంటి సిగ్నల్స్ బ్లింక్ అవుతుంటే.. బ్యాటరీని మార్చాల్సిన సమయం వచ్చినట్టు ఫిక్స్ అవ్వాల్సిందే.
హెట్లైట్స్ డిమ్‌గా ఉండటం..
Car battery life check : కారు ఇంజిన్ ఆగిపోయినప్పుడు.. హెడ్‌లైట్స్ డిమ్‌గా ఉంటే.. బ్యాటరీ పనైపోయినట్టు. అదే.. కారు నడుపుతున్నప్పుడు హెట్లైట్స్ డిమ్‌గా ఉంటే.. ఆల్టర్నేటర్ పాడైపోయినట్టు. దానిని కూడా వెంటనే మార్చాలి.
బ్యాటరీలో లీక్స్..
Car battery changing tips : మీ కారు బ్యాటరీకి క్రాక్స్, లీక్స్ వంటివి ఉన్నాయేమో చూసుకోవాలి. అలాంటివేవైనా కనిపిస్తే.. వెంటనే బ్యాటరీని రిప్లేస్ చేయాలి. అప్పుడే కారు సురక్షితంగా ఉంటుంది.
ఈ విధంగా కారు బ్యాటరీని ఎప్పుడు మార్చాలన్న సంకేతాలను తెలుసుకుని.. అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి.