తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp New Feature : ఇంటర్నెట్ లేకుండా ఇక వాట్సాప్‌లో పెద్ద పెద్ద ఫైల్స్ పంపుకోవచ్చు.. వాట్సాప్ న్యూ ఫీచర్

WhatsApp New Feature : ఇంటర్నెట్ లేకుండా ఇక వాట్సాప్‌లో పెద్ద పెద్ద ఫైల్స్ పంపుకోవచ్చు.. వాట్సాప్ న్యూ ఫీచర్

Anand Sai HT Telugu

21 July 2024, 20:30 IST

google News
    • WhatsApp People Nearby Feature : వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌తో వస్తుంది. దీని ద్వారా ఇంటర్నెట్ లేకుండానే పెద్ద పెద్ద ఫైల్స్ పంపుకోవచ్చు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం..
వాట్సాప్ కొత్త ఫీచర్
వాట్సాప్ కొత్త ఫీచర్ (MINT_PRINT)

వాట్సాప్ కొత్త ఫీచర్

వాట్సాప్ ఎప్పటికప్పుడు తన యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పుడు వాట్సాప్ యూజర్లకు త్వరలో చాలా ఉపయోగకరమైన ఫీచర్ రాబోతోంది. నివేదికల ప్రకారం కంపెనీ ఇప్పుడు ఫైల్ షేరింగ్ ఫీచర్‌పై పనిచేస్తోంది. ఇది వినియోగదారులు ఇంటర్నెట్ లేకుండా సమీపంలోని వ్యక్తులతో పెద్ద ఫైళ్లను పంచుకోవడానికి అనుమతిస్తుంది.

ఇంటర్నెట్ లేకుండానే

అంటే వినియోగదారులు ఎల్లప్పుడూ ఇంటర్నెట్‌పై ఆధారపడాల్సిన అవసరం లేదు. వాట్సాప్ కొత్త ఫీచర్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డబ్ల్యుఎబెటాఇన్ఫో తన నివేదికలో ఈ ఫీచర్ గురించి సమాచారాన్ని ఇచ్చింది. రాబోయే పీపుల్ నియ‌ర్‌బై ఫీచర్ ఐఓఎస్‌ యాప్‌లో భవిష్యత్తులో అప్‌డేట్ కోసం రావొచ్చు. 2024 ఏప్రిల్‌లో ఆండ్రాయిడ్‌లో ఈ ఫీచర్‌పై కంపెనీ కసరత్తు చేసింది. ఈ ఫీచర్‌తో సమీపంలో ఉన్న వ్యక్తులకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా.. ఫైళ్లను సులభంగా పంపవచ్చు, స్వీకరించవచ్చు. ఇందులో ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, మరెన్నో ఉండవచ్చు.

క్యూఆర్ కోట్ స్కాన్

ఈ ఫీచర్ స్క్రీన్ గ్రాఫ్ ప్రకారం ఐఓఎస్ మెకానిజంలో ఫైళ్లను షేర్ చేయాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం తప్పనిసరి. ఇంటర్నెట్ ద్వారా ఫైళ్లను పంచుకోవడం సాధ్యం కాని కాంటాక్ట్‌లు, వాట్సాప్ ఖాతాల మధ్య ఫైల్ షేరింగ్‌ను మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేని ప్రాంతాల్లో పెద్ద ఫైళ్లను షేర్ చేసుకోవడం సులభం చేస్తుంది. వినియోగదారులు రోజువారీ డేటాను ఆదా చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది.

మరికొన్ని రోజుల్లో

వాట్సాప్ పిపుల్ నియర్‌పై ఫీచర్ ఆండ్రాయిడ్ నుండి ఐఓఎస్ వరకు అన్ని ప్లాట్‌ఫామ్‌లలో సపోర్ట్ చేయగలదు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. తద్వారా రిసీవర్ మాత్రమే సమాచారాన్ని యాక్సెస్ చేయగలడు. అయితే ఈ ఫీచర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని గుర్తుంచుకోండి. ఫైళ్లను షేర్ చేసుకునే విధానాన్ని కూడా కంపెనీ మార్చవచ్చు. అనుమతులు, ప్రైవసీ, యూఐ వంటి వాటిని రాబోయే అప్‌డేట్‌లో మార్చుకోవచ్చు. పీపుల్ నియర్‌బై ఫీచర్ ఎప్పుడు విడుదలవుతుందో త్వరలో తెలియనుంది. ప్రస్తుతానికి దీని గురించి ఎటువంటి సమాచారం లేదు.

తదుపరి వ్యాసం