వాట్సాప్ కొత్త ఫీచర్.. ఇక మీరేం మాట్లాడినా నో ప్రాబ్లమ్.. వాయిస్ కాస్త టెక్ట్స్‌గా మారిపోతుంది-whatsapp is rolling out a feature to transcribe voice message whatsapp voice message transcript check more details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  వాట్సాప్ కొత్త ఫీచర్.. ఇక మీరేం మాట్లాడినా నో ప్రాబ్లమ్.. వాయిస్ కాస్త టెక్ట్స్‌గా మారిపోతుంది

వాట్సాప్ కొత్త ఫీచర్.. ఇక మీరేం మాట్లాడినా నో ప్రాబ్లమ్.. వాయిస్ కాస్త టెక్ట్స్‌గా మారిపోతుంది

Anand Sai HT Telugu
Jul 10, 2024 02:30 PM IST

WhatsApp Voice Message Transcript Feature : వాట్సాప్‌లొ కొన్నిసార్లు పర్సనల్ వాయిస్ మేసెజ్‌లు పంపిస్తుంటాం. ఎవరైనా పక్కన వారు వింటారా అని కంగారు ఉంటుంది. ఇక నుంచి ఆ భయం లేదు. ఎందుకుంటే మీరు పంపే వాయిస్‌ను అవతలివారు టెక్ట్స్‌గా మార్చుకోవచ్చు.

వాట్సాప్ కొత్త ఫీచర్
వాట్సాప్ కొత్త ఫీచర్

వాట్సాప్ కొత్త ఫీచర్ పేరు వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌స్క్రిప్ట్‌. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ గురించి సమాచారాన్ని డబ్ల్యూఏబీటాఇన్ఫో ఎక్స్ పోస్ట్‌లో ఇచ్చింది. వాట్సాప్ ట్రాన్స్‌స్క్రిప్షన్ ఫీచర్ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ వాయిస్ మెసేజెస్ కోసం ఉపయోగపడుతుంది. దీని సహాయంతో యూజర్లు అందుకున్న వాయిస్ మెసేజ్ ను టెక్ట్స్ గా మార్చుకోవచ్చు.

వాట్సాప్‌లో చాటింగ్‌తో పాటు ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తుంటారు. ఇది కాకుండా వాట్సాప్ తన వినియోగదారులకు వాయిస్ నోట్ అంటే వాయిస్ మెసేజ్ ఫీచర్‌ను కూడా అందిస్తుంది. ఒకవేళ సందేశాన్ని టైప్ చేయడం సాధ్యం కాకపోతే, యూజర్ మాట్లాడటం ద్వారా సందేశాన్ని రికార్డ్ చేసి పంపుతాడు. వాయిస్ అనేది మెసేజ్ టైప్ చేయడం కంటే సులభం, తక్కువ సమయం పడుతుంది. అయితే వాయిస్ మెసేజ్ లో ప్రైవేట్ సంభాషణ ఉంటే దాన్ని పక్కన ఉన్నవారి మధ్య ప్లే చేయడం కష్టం. ఇయర్ బడ్స్ కలిగి ఉండాలి. అప్పుడే ఎవరికీ వినిపించకుండా మీరు మాత్రమే వినవచ్చు. కానీ చాలా మంది వినియోగదారులు ఎల్లప్పుడూ ఇయర్స్ బడ్స్ అందుబాటులో పెట్టుకోరు. ఈ సమస్యను అధిగమించేందుకు వాట్సాప్ లో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది.

ఈ కొత్త ఫీచర్ వాయిస్ మెసేజ్ ట్రాన్స్‌స్క్రిప్ట్‌. ఈ ఫీచర్ స్క్రీన్ షాట్ ను కూడా డబ్ల్యూఏబీటాఇన్ఫో షేర్ చేసింది. షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం, వాట్సాప్ ట్రాన్స్‌స్క్రిప్షన్ ఫీచర్ ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ వాయిస్ సందేశాల కోసం ఉపయోగించుకోవచ్చు. వాయిస్ మెసేజ్ లను టెక్ట్స్ గా మారుస్తుంది ఇది. ఈ ఫీచర్‌ను సెటప్ చేసుకోవాలంటే 136 ఎంబీ డేటాను వెచ్చించాల్సి ఉంటుంది.

నివేదిక ప్రకారం, వాయిస్ ట్రాన్స్‌స్క్రిప్ట్‌ పరికరంలోనే జనరేట్ అవుతాయి. తద్వారా మీరు తప్ప మరెవరూ వాటిని వినలేరు లేదా చదవలేరు. వాయిస్ ట్రాన్స్‌స్క్రిప్షన్ కోసం హిందీతో సహా ఐదు భాషలను కంపెనీ సపోర్ట్ చేస్తోంది. వాట్సాప్ లోని ఈ ఫీచర్ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వినికిడి సమస్య ఉన్న యూజర్లకు ఈ ఫీచర్ ఎంతగానో అవసరం.

గూగుల్ ప్లే స్టోర్లో ఆండ్రాయిడ్ 2.24.15.5 కోసం వాట్సాప్ బీటాలో ఈ కొత్త ఫీచర్‌ను డబ్ల్యూఏబీటాఇన్ఫో చూసింది. బీటా టెస్టింగ్ తరువాత కంపెనీ ఈ ఫీచర్‌ను యూజర్లకు విడుదల చేస్తుంది. తర్వాత నేరుగా వాయిస్ పంపిస్తే అది టెక్ట్స్‌ రూపంలో వస్తుంది.

Whats_app_banner