doctor cuts off private parts: మోసం చేసిన బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసిన మహిళా డాక్టర్-bihar woman doctor cuts off private parts of man for refusing to marry her ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Doctor Cuts Off Private Parts: మోసం చేసిన బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసిన మహిళా డాక్టర్

doctor cuts off private parts: మోసం చేసిన బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసిన మహిళా డాక్టర్

HT Telugu Desk HT Telugu
Jul 02, 2024 02:13 PM IST

Crime news: రెండేళ్ల సహజీవనం తర్వాత తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన బాయ్ ఫ్రెండ్ మర్మాయవాలను కట్ చేసేసిందో మహిళా డాక్టర్. తనను మోసం చేసినందుకు అదే సరైన శిక్ష అని చెబుతోంది ఆ వైద్యురాలు. ప్రస్తుతం ఆ యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

మోసం చేసిన బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసిన మహిళా డాక్టర్
మోసం చేసిన బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసిన మహిళా డాక్టర్

Bihar Crime news: రెండు సంవత్సరాల సహజీవనం అనంతరం తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన బాయ్ ఫ్రెండ్ మర్మావయవాలను ఒక మహిళా డాక్టర్ కోసేసింది. ఈ ఘటన బిహార్ లోని సరన్ జిల్లాలో జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వైద్యురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి రక్తపు మరకలు ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మోసం చేసినందుకు శిక్ష

పోలీసుల విచారణలో ఆ డాక్టర్ తను చేసిన పనికి కారణం వివరించింది. తనతో బాధిత యువకుడు రెండేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నాడని, అతడి వల్ల తనకు రెండుసార్లు అబార్షన్ కూడా అయిందని, తనను పెళ్లి చేసుకోమని కోరగా, అందుకు నిరాకరించాడని వెల్లడించింది. తన ప్రపోజల్ ను అతను తిరస్కరించడంతో అతడితో గొడవ జరిగిందని, ఆ ఆవేశంలో అతనిపై దాడి చేశానని ఆమె వివరించింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, మోసం చేసినందువల్లనే ఈ పని చేశానని ఆమె స్పష్టం చేసింది.

మత్తు మందు ఇచ్చి కట్ చేసేసింది..

వివరాల్లోకి వెళితే.. బిహార్ లోని సరన్ జిల్లా కేంద్రంలో డాక్టర్ గా పని చేస్తున్న 26 ఏళ్ల యువతి 30 ఏళ్ల బాధితుడితో రెండేళ్లుగా సహజీవనం చేస్తోంది. మొదట ఆ డాక్టర్ ను ఆ యువకుడు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. జూలై 1న చాప్రాలోని కోర్టులో వివాహానికి వారిద్దరు రిజిస్టర్ కూడా చేసుకున్నారు. అయితే, ఆ వ్యక్తి కోర్టుకు హాజరు కాలేదు. దాంతో, అతని చర్యలతో తీవ్రంగా కలత చెందిన ఆ యువతి అతన్ని తన క్లినిక్ కు పిలిపించి, అతడికి మత్తు మందు ఇంజెక్ట్ చేసి, ఆపై అతని జననేంద్రియాలను కత్తిరించేసింది. దాంతో, అతడికి తీవ్ర రక్తస్రావం అయింది.

పోలీసులకు సమాచారం

సరన్ జిల్లాలోని మర్హౌరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో జూలై 1న ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం పాట్నాలోని మరో ఆసుపత్రికి తరలించారు. గత రెండేళ్లుగా తామిద్దరం రిలేషన్ షిప్ లో ఉన్నామని పోలీసుల విచారణలో మహిళ వెల్లడించింది. జూలై 1న వారిద్దరూ చాప్రాలోని కోర్టులో వివాహం చేసుకోవాలనుకున్నాం. కానీ, చివరి నిమిషంలో అతడు కోర్టుకు హాజరు కాలేదు’’ అని ఆ యువతి తెలిపింది. ఆ యువకుడి వల్ల తనకు రెండుసార్లు అబార్షన్ కూడా అయిందని వెల్లడించింది.

Whats_app_banner