Jio AirFiber : జియో ఎయిర్‌ఫైబర్ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది?
29 August 2023, 12:39 IST
- Jio AirFiber launch : జియో ఎయిర్‌ఫైబర్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
జియో ఎయిర్‌ఫైబర్ అంటే ఏంటి?
What is Jio AirFiber : రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ ఏజీఎం.. సోమవారం మధ్యాహ్నం జరగ్గా.. జియో ఎయిర్ఫైబర్పై కీలక ప్రకటన చేశారు సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ. ఇది.. వినాయక చవితి (సెప్టెంబర్ 19)కి లాంచ్ అవుతుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. అసలు జియో ఎయిర్‌ఫైబర్ అంటే ఏంటి? ఇది ఎలా పని చేస్తుంది? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
జియో ఎయిర్‌ఫైబర్ అంటే ఏంటి..?
వాస్తవానికి.. గతేడాది జరిగిన ఏజీఎంలోనే ఈ ఎయిర్‌ఫైబర్‌ని ప్రకటించారు ముకేశ్ అంబానీ. తాజాగా.. లాంచ్ డేట్‌ను రివీల్ చేశారు. ఇదొక హై-స్పీడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అనే చెప్పుకోవాలి. ఇది.. జియోఫైబర్ వంటి ఆప్టిక్ కనెక్షన్‌ను పోలి ఉంటుంది. అయితే.. ఇందులో ట్రూ 5జీ టెక్నాలజీని వాడి పర్సనల్ వైఫై నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ జియో ఎయిర్‌ఫైబర్- జియోఫైబర్ మధ్య ఒక పెద్ద తేడా ఉంది.
Jio AirFiber launch : ఇప్పుడున్న జియోఫైబర్.. ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఫైబర్ ఆప్టిక్ వైర్లను ఇంట్లో సెటప్ చేసుకుని, రోటర్‌కు కనెక్ట్ చేయాలి. అప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుంది. ఈ పరికరంతో ఇంటర్నెట్ స్టేబుల్‌గానే ఉన్నా.. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం పడుతుంది. కానీ జియో ఎయిర్‌ఫైబర్ ఇలా కాదు! ఇదొక డివైజ్ అని తెలుస్తోంది. దీనిని సింపుల్‌గా ప్లగ్ ఇన్/ టర్న్ ఆన్ చేసుకుని, వైఫై హాట్‌స్పాట్‌ని క్రియేట్ చేసుకుని వాడుకోవచ్చు. దీనితో హై-స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది.
ఇదీ చూడండి:- Reliance AGM : జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌పై ముకేశ్ అంబానీ కీలక అప్డేట్!
ప్లాన్ ధరలు ఎంత?
రోజుకు 1.5లక్షల కనెక్షన్లు ఇచ్చే కెపాసిటీ ఈ జియో ఎయిర్‌ఫైబర్ టెక్నాలజీకి ఉందని తెలుస్తోంది. దేశంలో నెట్‌వర్క్‌ను విస్తరించుకునేందుకు రిలయన్స్ సంస్థ గట్టి ప్లానే వేసిందని దీని ద్వారా అర్థమవుతుంది. జియోఫైబర్‌కు ప్రస్తుతం 10మిలియన్ యూజర్స్ ఉన్నాయి. ఈ సంఖ్యను జియో ఎయిర్‌ఫైబర్ సులభంగా దాటేస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
ఈ జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్స్, ధరకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెలువడతాయని తెలుస్తోంది.