Reliance AGM : జియో ఫైనాన్షియల్​ సర్వీసెస్​పై ముకేశ్​ అంబానీ కీలక అప్డేట్​!-reliance agm 2023 live nita ambani to step down from board ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Reliance Agm 2023 Live Nita Ambani To Step Down From Board

Reliance AGM : జియో ఫైనాన్షియల్​ సర్వీసెస్​పై ముకేశ్​ అంబానీ కీలక అప్డేట్​!

Sharath Chitturi HT Telugu
Aug 28, 2023 04:20 PM IST

Reliance AGM : సోమవారం జరిగిన రిలయన్స్​ ఏజీఎంలో సంస్థ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ పలు కీలక విషయాలను వెల్లడించారు. జియో ఫైనాన్షియల్​ సర్వీసెస్​ నుంచి జియో స్మార్ట్​ హోమ్​ సర్వీసెస్​ వరకు అనేక అంశాలపై అప్డేట్స్​ ఇచ్చారు.

రిలయన్స్​ ఏజీఎంలో ముకేశ్​ అంబానీ ప్రసంగం..
రిలయన్స్​ ఏజీఎంలో ముకేశ్​ అంబానీ ప్రసంగం.. (PTI)

Reliance AGM live updates : డిసెంబర్​ నాటికి.. దేశవ్యాప్తంగా జియో 5జీ సేవలను విస్తరించనున్నట్టు రిలయన్స్​ అధినేత ముకేశ్​ అంబానీ వెల్లడించారు. ప్రస్తుతం.. దేశంలోని 85శాతం 5జీ ఫోన్స్​లో జియో నెట్​వర్క్​ ఉందని వెల్లడించారు. ఈ మేరకు.. సోమవారం మధ్యాహ్నం జరిగిన 46వ రిలయన్స్​ వార్షిక సాధారణ సమావేశంలో ప్రకటన చేశారు.

ట్రెండింగ్ వార్తలు

"ఈ ఏడాది డిసెంబర్​ నాటికి ఇండియా మొత్తాన్ని జియో 5జీ నెట్​వర్క్​ కవర్​ చేస్తుంది. జియోకు చెందిన యూజర్​ డేటా కన్జమ్షన్​ ప్రతి నెల 25జీబీగా నమోదవుతోంది. ఈ డిసెంబర్​ నాటికి.. 1 మిలియన్​ 5జీ ఫోన్స్​లో జియో సేవలు ఉంటాయి," అని అన్నారు ముకేశ్​ అంబానీ.

Reliance AGM latest news : ఈ నేపథ్యంలో.. జియో ఎయిర్​ఫైబర్​, జియో స్మార్ట్​ హోమ్​ సర్వీసెస్​పై పలు కీలక అప్డేట్స్​ ఇచ్చారు రిలయన్స్​ ఛైర్మన్​.

"వినాయక చవితి నాడు (సెప్టెంబర్​ 19) జియో ఎయిర్​ఫైబర్​ను లాంచ్​ చేస్తున్నాము. ఇక ఇండియాలో 80శాతం డేటా కన్జమ్షన్​ అనేది ఇళ్లల్లోనే జరుగుతోంది. అందుకే.. జియో స్మార్ట్​ హోమ్​ సర్వీసెస్​ను తీసుకొస్తున్నామని ప్రకటించడానికి నాకు చాలా థ్రిల్లింగ్​గా ఉంది. ఇది మీ ఎక్స్​పీరియన్స్​నే మార్చేస్తుంది," అని అంబానీ అన్నారు. అదే సమయంలో అందరికి, అన్ని చోట్లా ఏఐ (కృత్రిమ మేథ) అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.

జియో ఫైనాన్షియల్​ సర్వీసెస్​..

Jio Financial services news : రిలయన్స్​ ఏజీఎంలో జియో ఫైనాన్షియల్​ సర్వీసెస్​పై కీలక అప్డేట్​ ఇచ్చారు ముకేశ్​ అంబానీ. భారత దేశ అసెట్​ మేనేజ్​మెంట్​ ఇండస్ట్రీ రూపురేఖలను మార్చే విధంగా ఇది ఎదుగుతుందని వ్యాఖ్యానించారు.

"ఇన్ష్యూరెన్స్​ సెగ్మెంట్​లోకి రిలయన్స్​ జియో ఫైనాన్షియల్​ సర్వీసెస్​ ఎంట్రీ ఇస్తుంది. భారత దేశాభివృద్ధి స్టోరీని ప్రతిబింబించే విధంగా ఇది ఉంటుంది. కస్టమర్లకు, మర్చెంట్స్​కు అనేక అవకాశాలనిస్తుంది. బ్లాక్​చెయిన్​ ఆధారిత ప్లాట్​ఫామ్స్​, సీబీడీసీ వంటి ఫీచర్స్​.. ఈ జియో ఫైనాన్షియల్​ సర్వీసెస్​ ప్రాడక్ట్స్​లో ఉంటాయి," అని ముకేశ్​ అంబానీ అన్నారు.

రిలయన్స్​ రీటైల్​..

"గతేడాది.. 3,300 కొత్త స్టోర్స్​ను ఓపెన్​ చేశాము. ఫలితంగా ఇప్పటివరకు 6.56 కోట్ల స్క్వేర్​ ఫీట్​తో 18,040 రిలయన్స్​ రీటైల్​ ఔట్​లెట్స్​ ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు టైర్​ 2,3లో ఉన్నాయి," అని రీటైల్​ విభాగం డైరక్టర్​ ఈషా అంబానీ వెల్లడించారు.

రిలయన్స్​ ఏజీఎంలో ఇండియా, దేశాభివృద్ధి వంటి విషయాలను కూడా ప్రస్తావించారు ముకేశ్​ అంబానీ.

"ఇది ఆత్మస్థైర్యంతో ముందుకు నడుస్తున్న నవ భారతం. 2047 నాటికి ఇండియా.. పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుతుందని నాకు నమ్మకం ఉంది. అసాధ్యమైన లక్ష్యాలను పెట్టుకున్న రిలయన్స్​, వాటిని సాధించింది. 10ఏళ్ల మరే ఇతర కార్పొరేట్​ సంస్థ కూడా చేయనంతగా.. 150 బిలియన్​ డాలర్లను ఇన్​వెస్ట్​ చేసింది," అని ముకేశ్​ అంబానీ అన్నారు.

రిలయన్స్​ ఏజీఎంలో భాగంగా.. చంద్రయాన్​-3 సక్సెస్​లో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలను అభినందించారు ముకేశ్​ అంబానీ.

నీతా అంబానీ రాజీనామా..

Mukesh Ambani Reliance AGM 2023: రిలయన్స్​ బోర్డ్​ ఆఫ్​ డైరక్టర్స్​ నుంచి ముకేశ్​ అంబానీ సతీమణి నీతా అంబానీ తప్పుకున్నారు. సోమవారం ఉదయం జరిగిన సమావేశంలో.. ఆమె రాజీనామాను బోర్డు సభ్యులు ఆమోదించారు. రిలయన్స్​ ఫౌండేషన్​ను భారతీయులకు మరింత చేరువగా తీసుకెళ్లేందుకు ఆమె కృషి చేయనున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు.. ముకేశ్​ అంబానీ సంతానం ఈషా అంబానీ, ఆకాశ్​ అంబానీ, అనంత్​ అంబానీలు బోర్డు సభ్యుల్లో చేరనున్నారు! వీరు.. నాన్​- ఎగ్జిక్యూటివ్​ డైరక్టర్స్​గా ఉంటారు. ఈ మేరకు.. బోర్డు సభ్యులు షేర్​హోల్డర్లకు సిఫార్సులు పంపించారు. వారు ఆమోదించిన అనంతరం.. ఈ ముగ్గురు, వారి బాధ్యతలను చేపడతారు.

రిలయన్స్​ షేర్​ ప్రైజ్​..

Reliance share price : రిలయన్స్​ 46వ ఏజీఎం వేళ సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో సంస్థ షేరు 1.27శాతం మేర నష్టపోయింది. 31 పాయింట్లు కోల్పోయి.. రూ. 2,437 వద్ద స్థిరపడింది.

WhatsApp channel

సంబంధిత కథనం